
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. జోర్డాన్‌లో బుధవారం జరిగిన సెమీఫైనల్లో లవ్లీనా 5–0తో సెయోంగ్ సుయోన్ (కొరియా)పై గెలిచింది.
భారత్‌కే చెందిన అల్ఫియా (ప్లస్ 81 కేజీలు), మీనాక్షి (52 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. అంకుశిత (66 కేజీలు), ప్రీతి (57 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment