బెస్ట్ బాక్సర్ వికాస్
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ వికాస్ క్రిషన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ‘ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్’గా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) వికాస్‌ను ఎంపిక చేసింది. వచ్చే నెల 20న జరిగే ‘ఐబా’ సమావేశంలో ఈ అవార్డును వికాస్‌కు అందజేస్తారు. భారత్ నుంచి ఓ బాక్సర్‌కు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం.
హరియాణాకు చెందిన 24 ఏళ్ల వికాస్ రియో ఒలింపిక్స్‌లో 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ‘నాకిది గొప్ప గౌరవం. అరుుతే నేనంతగా ఆనందంగా లేను. ఎందుకంటే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆశించిన నాకు నిరాశే మిగిలింది’ అని ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో శిక్షణ తీసుకుంటున్న వికాస్ వ్యాఖ్యానించాడు.