న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో జరగనున్న పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని ప్రకటించారు. మే 1 నుంచి 14 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌ను మొత్తం 52 లక్షల డాలర్ల (రూ. 425 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నామని సోమవారం ఇక్కడ నిర్వహించి మీడియా సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన బాక్సర్‌కు 2 లక్షల డాలర్లు (రూ. కోటీ 63 లక్షలు), రజతం నెగ్గిన బాక్సర్‌కు 1 లక్ష డాలర్లు (రూ. 81 లక్షలు), కాంస్యం సొంతం చేసుకున్న ఇద్దరు బాక్సర్లకు 50 వేల డాలర్ల (రూ. 40 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన క్రెమ్లెవ్ ఒకవేళ ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్‌ను తొలగిస్తే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment