Tashkent
-
ఉజ్బెకిస్తాన్ గడ్డపై తెలంగాణ బిడ్డల సత్తా
తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా స్కూల్స్ ర్యాపిడ్ అండ్ చెస్ చాంపియన్‌షిప్–2023లో తెలంగాణ ఆటగాళ్లు సత్తా చాటారు. దాంతో భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. అండర్–15 బాలుర విభాగం ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో విఘ్నేశ్ అద్వైత్ వేముల రెండు స్వర్ణాలు సాధించడం విశేషం. అండర్–15 బాలికల కేటగిరీ బ్లిట్జ్‌లో యశ్వి జైన్ కాంస్యం పతకం సొంతం చేసుకుంది. -
Boxing World Championships 2023: స్వర్ణ పతకం సాధిస్తే రూ. కోటీ 63 లక్షలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరగనున్న పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని ప్రకటించారు. మే 1 నుంచి 14 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌ను మొత్తం 52 లక్షల డాలర్ల (రూ. 425 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నామని సోమవారం ఇక్కడ నిర్వహించి మీడియా సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన బాక్సర్‌కు 2 లక్షల డాలర్లు (రూ. కోటీ 63 లక్షలు), రజతం నెగ్గిన బాక్సర్‌కు 1 లక్ష డాలర్లు (రూ. 81 లక్షలు), కాంస్యం సొంతం చేసుకున్న ఇద్దరు బాక్సర్లకు 50 వేల డాలర్ల (రూ. 40 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన క్రెమ్లెవ్ ఒకవేళ ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్‌ను తొలగిస్తే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. -
అఫ్గాన్ అధ్యక్షుడితో జై శంకర్ భేటీ
న్యూఢిల్లీ: విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ గురువారం అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో తాష్కెంట్లో భేటీ అయ్యారు. దేశం నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ అనంతరం వేగంగా మారుతున్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. అఫ్గానిస్తాన్ అభివృద్ధి, శాంతి, సుస్థిరతకు భారత్ తోడ్పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా జై శంకర్ భరోసా ఇచ్చారు. తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో రెండు రోజులపాటు జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగిన కనెక్టివిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అష్రాఫ్ ఘనీతో సమావేశమయ్యారు. ఎస్సీవో సమావేశాల్లో రష్యా, చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేవాల విదేశాంగ మంత్రులు పాలుపంచుకున్నారు. Pleased to call on President @ashrafghani. Discussed the current situation in and around Afghanistan. Reiterated our support for peace, stability and development of Afghanistan. pic.twitter.com/heTlL9KwaQ — Dr. S. Jaishankar (@DrSJaishankar) July 15, 2021 -
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ భేటీ
తాష్కెంట్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం చైనా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. రెండురోజుల పాటు జరుగనున్న ఎస్సీవో సమ్మిట్ (షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్)లో పాల్గొనేందుకు ఆయన ఇవాళ తాష్కెంట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ...చైనా అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. అంతకు ముందు ఉజ్బెకిస్థాన్ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ ట్విట్ చేశారు. 'స్నేహపూరిత దేశానికి మరోసారి రావటం సంతోషకరం. ఎస్సీవో సమ్మిట్‌లో పలువురు నేతలతో సమావేశం అవుతాను' అని మోదీ ట్విట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉజ్బెకిస్థాన్ ప్రధాని షౌకత్ మీర్జియోయెవ్తో కలిసి దిగిన ఫోటోను మోదీ పోస్ట్ చేశారు. ఈ సమ్మిట్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, చైనా, రష్యా,కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. దేశాల మధ్య శాంతి భద్రతల అంశంలో పరస్పర సహకారం, తీవ్రవాదం అణచివేత, రక్షణ రంగానికి సంబంధించిన చర్యలపై సమ్మిట్‌లో కీలక చర్చలు జరుపనున్నారు. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా భేటీ కానున్నారు. న్యూక్లియార్ సప్లై గ్రూప్ దేశాల సమావేశం కూడా రేపటి నుంచే సియోల్‌లో ప్రారంభం అవుతుండటంతో మోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం అమెరికాతో పాటు రష్యా తదితర దేశాలు మద్దతిస్తున్నా చైనా వ్యతిరేకిస్తోందనే వార్తలు వస్తుండటంతో మోదీ పర్యటన కీలకం కానుంది. -
నేతాజీ వివాదం ముగియకముందే..
న్యూఢిల్లీ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం.. మరణం.. లాంటి విషయాలకు సంబంధించి పశ్చిమబెంగాల్ విడుదల చేసిన డాక్యుమెంట్లపై వివాదాలు, భిన్నాభిప్రాయాలు సమసిపోకముందే మరో అంశం తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. తన తండ్రి, మాజీ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి మృతికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్.. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని, దానిపై ప్రభుత్వం స్పందిస్తే నిజనిజాలు బయటపడతాయన్నారు. సుమారు 50 ఏళ్ల కిందట తాష్కెంట్(జనవరి 11, 1966) లో జరిగిన శాస్త్రి మృతి ఘటనపై ఇప్పటికీ సందేహాలు అలాగే ఉండిపోయాయని అనిల్ ప్రస్తావించారు. శాస్త్రి మృతికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలంటూ గతంలో బీజేపీ డిమాండ్ చేసిందన్న విషయాన్ని గుర్తుచేశారు. స్వదేశానికి తీసుకువచ్చిన తండ్రి మృతదేహంపై ఉన్న కొన్ని గుర్తులు, మరకలు ఆయన మృతిపై పెను అనుమానాలకు దారితీసిందని చెప్పారు. మాజీ ప్రధాని మరో కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి మాట్లాడుతూ.. గతంలో చాలా మంది ప్రధానులను ఈ విషయాలకు సంబంధించిన ఫైళ్లను అందించాలని కోరినట్లు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ మృతిపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొన్ని కీలక డాక్యుమెంట్లను విడుదల చేసిన వారం రోజుల్లోనే మరో వివాదాస్పాద అంశం తెరమీదకు వచ్చింది. విదేశీ పర్యటన నుంచి తిరిగిరాగానే తన తండ్రి గురించిన సమాచారం కోసం ప్రధానికి లేఖ రాయనున్నట్లు అనిల్ శాస్త్రి వెల్లడించారు. -
హంపి, హారిక గేమ్ డ్రా
తాష్కెంట్: మళ్లీ అదే ఫలితం. ఈసారీ ఎవరూ గెలువలేదు. వరుసగా నాలుగోసారి ‘డ్రా’తో సంతృప్తి పడ్డారు. ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ సందర్భంగా ముఖాముఖి పోరులో తలపడిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక 59 ఎత్తుల్లో తమ గేమ్‌ను ‘డ్రా’గా ముగించారు. మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ప్రపంచ మూడో ర్యాంకర్ హంపిని నిలువరించడంలో ప్రపంచ 27వ ర్యాంకర్ హారిక సఫలమైంది. గతంలో ఈ ఇద్దరూ మూడుసార్లు ముఖాముఖిగా పోటీపడగా మూడుసార్లూ ‘డ్రా’ చేసుకున్నారు. ఆరో రౌండ్ తర్వాత హంపి, హారిక, కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్) నాలుగున్నర పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. బుధవారం జరిగే ఏడో రౌండ్లో నఫీసా ముమినోవా (ఉజ్బెకిస్థాన్)తో హంపి; కాటరీనా లాగ్నోతో హారిక తలపడతారు.