గోల్డెన్‌ బోయ్‌ నీరజ్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?  | World Athletics Championship 2023 do you know prize money for Neeraj Chopra | Sakshi
Sakshi News home page

Neeraj Chopra: గోల్డెన్‌ బోయ్‌ నీరజ్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? 

Published Mon, Aug 28 2023 1:43 PM | Last Updated on Mon, Aug 28 2023 5:17 PM

World Athletics Championship 2023 do you know prize money for Neeraj Chopra - Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా  88.17 మీటర్ల అద్భుతమైన త్రో మెన్స్‌ జావెలిన్‌ త్రోలో బంగార పతకాన్నిసాధించి భారత్‌కు తొలిస్వర్ణాన్ని అందించి మరోసారి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌  రజత పతకంతో సరి పెట్టుకున్నాడు. 

ఈ సందర్బంగా నీరజ్‌కు దక్కిన ప్రైజ్‌ మనీ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచిన నీరజ్ చోప్రాకు 70వేల డాలర్లు (సుమారు రూ. 58 లక్షలు) నగదు బహుమతిని అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండోస్థానంలో ఉన్న అర్షద్ నదీమ్ 35000 డాలర్లు (సుమారు రూ. 29 లక్షలు) ప్రైజ్ మనీని గెలుచు కున్నాడు.

బుడాపెస్ట్‌లో జరిగిన ఈవెంట్‌లో 88.17 మీటర్ల త్రోతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో నిలిచి,  గోల్డెన్‌ బోయ్‌గా మరోసారి తన ప్రత్యకతను నిరూపించుకున్నాడు నీరజ్‌ చోప్రా. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే మరో ఇద్దరు భారత అథ్లెట్లు కిషోర్ జెనా , డిపి మను వరుసగా 84.77 మీ  84.14 మీటర్ల త్రోతో ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన సంగతి  తెలిసిందే. 

 కాగా 40 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూఏసీ) చరిత్రలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా. ఆదివారం బుడాపెస్ట్‌లో జరిగిన WAC 2023లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో 25 ఏళ్ల   స్టార్‌ నీరజ్‌ తన సొంత రికార్డును తానే చెరిపేసి రజత పతకాన్ని  స్వర్ణంగా మార్చుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement