ఫైనల్లో శివ, సుమీత్
వికాస్‌కు కాంస్యం ∙ ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్
తాష్కెంట్: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు శివ థాపా, సుమీత్ సాంగ్వాన్‌లు ఫైనల్లోకి ప్రవేశించారు. 60 కేజీల విభాగంలో పోటీపడుతున్న శివ.. శుక్రవారం జరిగిన సెమీస్‌లో ఒలింపిక్ కాంస్యపతక విజేత, టాప్ సీడ్ దొర్యమ్‌బుగ్ ఒట్గొందలాయ్ (మంగోలియా)పై సంచలన విజయం సాధించాడు.
మరోవైపు 91 కేజీల విభాగంలో పోటీపడుతోన్న సుమీత్.. రెండోసీడ్ తాజిక్ జఖోన్ కుర్బొనోవ్ (తజకిస్తాన్)పై గెలుపొందాడు. ఫైనల్లో స్థానికప్లేయర్ ఎల్‌నూర్ అబ్దురైమోవ్‌తో శివ తలపడనున్నాడు. మరోవైపు 75 కేజీల విభాగంలో పోటీపడుతున్న వికాస్ కృషన్ మ్యాచ్‌కు హాజరు కాకపోవడంతో అతని ప్రత్యర్థి నాలుగోసీడ్, లీ డొంగ్‌యూన్ (దక్షిణ కొరియా)ను విజేతగా ప్రకటించారు.