క్వార్టర్స్‌లో శివ, సుమీత్
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్
తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు శివ థాపా, సుమీత్ సంగ్వాన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన శివ..ఒముర్బెక్ మలబెకోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. క్వార్టర్స్‌లో చు ఎన్ లాయ్ (చైనీస్‌తైపీ)తో శివ తలపడనున్నాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సుమీత్.. ఎర్దెన్‌బెయర్ సందగ్‌సురేన్ (మంగోలియా)ను ఓడించాడు.
క్వార్టర్స్‌లో మూడోసీడ్ ఫెంగ్‌కాయ్ యు (చైనా)తో సుమీత్ తలపడనున్నాడు. మరోవైపు మనీశ్ పాన్వర్ (81 కేజీలు), కవీందర్ సింగ్ బిస్త్ (49 కేజీలు) కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్‌లో జీ ఆర్ గుణరత్నపై మనీశ్ గెలుపొందగా.. అల్దోమ్స్ సుగురో (ఇండోనేసియా)పై కవీందర్ విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో జాసుర్బెక్ లాతిపోవ్ (ఉజ్బెకిస్తాన్)తో కవీందర్ తలపడుతాడు. వీరితోపాటు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ బిధురి (56 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.