Sumeeth
-
సెమీస్‌లో ఓడిన సిక్కిరెడ్డి–సుమీత్ జోడీ
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి సెమీఫైనల్లో వెనుదిరిగింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 66వ ర్యాంక్‌లో ఉన్న సిక్కి–సుమీత్ 17–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంక్‌లో ఉన్న రినోవ్ రివాల్డీ–పితా మెంతారి (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. సిక్కి–సుమీత్ జోడీకి 2,940 డాలర్ల (రూ. 2 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సుమీత్–మనూ జంట సంచలనం
టోక్యో: భారత అగ్రశ్రేణి డబుల్స్ జంట సుమీత్ రెడ్డి–మనూ అత్రి జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్–మనూ అత్రి ద్వయం 15–21, 23–21, 21–19తో ప్రపంచ 10వ ర్యాంక్, రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన గో వీ షెమ్–తాన్ వీక్ కియోంగ్ (మలేసియా) జంటను బోల్తా కొట్టించింది. 54 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ రెండో గేమ్‌లో భారత జోడీ మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. అంతేకాకుండా నిర్ణాయక మూడో గేమ్‌లో 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ‘ఈ మధ్య మేమిద్దరం బాగా ఆడుతున్నాం. కీలకదశలో సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తున్నాం. సమన్వయ లోపం లేకుండా చూసుకుంటున్నాం. ఆసియా క్రీడల్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో చైనా జోడీతో జరిగిన మ్యాచ్‌లో మేము 3 మ్యాచ్ పాయింట్లు కోల్పో యాం. ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే కచ్చితంగా మాకు పతకం సాధించే అవకావకాశాలు ఉండేవి. ఏదేమైనా ఆ ఓటమితో మేము గుణపాఠం నేర్చుకున్నాం’ అని మనూ అత్రి అన్నాడు. మరో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 12–21, 17–21తో మూడో సీడ్ తకెషి కముర–కిగో సొనోడా (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 17–21, 13–21తో చాంగ్ యె నా–జంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గావో ఫాంగ్‌జి (చైనా)తో పీవీ సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0–1తో వెనుకబడి ఉంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో విన్సెంట్ (హాంకాంగ్) తో శ్రీకాంత్; జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా)తో ప్రణయ్ ఆడతారు. డబుల్స్‌లో హీ జిటియాంగ్–తాన్ కియాంగ్ (చైనా)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా తలపడతారు. ఇటీవల ఆసియా క్రీడల్లో విన్సెంట్ చేతిలో ఓడిపోయిన శ్రీకాంత్ ఈసారి గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలతో ఉన్నాడు. నేటి ప్రిక్వార్టర్ ఫైనల్స్ ఉదయం గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
రెజ్లర్ సుమీత్కు రజతం
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు భారత్‌కు రజతం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 125 కేజీల విభాగంలో సుమీత్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో సుమీత్ 2–6తో యాదొల్లా మొహమ్మద్ కాజిమ్ (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన హర్ఫూల్ (61 కేజీలు), వినోద్ కుమార్ ఓంప్రకాశ్ (70 కేజీలు), సోమ్‌వీర్ (86 కేజీలు) నిరాశపరిచారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత రెజ్లర్లు ఒక స్వర్ణం, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 10 పతకాలు సొంతం చేసుకున్నారు. -
రేప్ చేసి.. ముక్కలుగా నరికి..
హరియాణాలో మరో నిర్భయ ఘటన సోనిపట్: యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించిన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ (23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికివేశారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత 9వ తేదీన సోనిపట్‌లో మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. రోహ్తక్కు కారులో తరలించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు సోనిపట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 11వ తేదీన రోహ్తక్లో మృతదేహాన్ని గుర్తించామని, బాధిత మహిళ ముఖంపైన, పలుచోట్ల కుక్కలు కరిచినట్లు పేర్కొన్నారు. ‘ఆ మహిళపై తొలుత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఇటుకతో తీవ్రంగా కొట్టారు. ఆమె ముఖాన్ని బండరాయికేసి కొట్టారు. తలకు తీవ్రగాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది’ అని ఎస్సై అజయ్ మలిక్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు సుమీత్, వికాస్‌లను అరెస్టు చేసినట్లు మలిక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం ఇద్దరినీ రెండు రోజుల కస్టడీకి తరలించారు. బాధితురాలికి సుమిత్ పరిచయస్తుడేనని పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాధిత మహిళను కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ‘హత్యాచార’ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోనిపట్‌లో మహిళను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పదించారు. దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. మరో మూడు నెలల్లో హరియాణ వాసుల డేటాబేస్ పూర్తవుతుందని వెల్లడించారు. -
శివ, సుమీత్... రజతాలతో సరి!
ఫైనల్లో ఓడిన భారత బాక్సర్లు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): పసిడి పతకాలు సాధించాలని ఆశించిన భారత బాక్సర్లు శివ థాపా, సుమీత్ సాంగ్వాన్లకు నిరాశ ఎదురైంది. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో శివ థాపా (60 కేజీలు) తొలి రౌండ్ ముగియకముందే గాయం కారణంగా వైదొలగగా... సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) 0–5తో టాప్ సీడ్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా ఈవెంట్లో శివ థాపాకిది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2013లో స్వర్ణం నెగ్గిన శివ... 2015లో కాంస్య పతకం గెలిచాడు. తద్వారా వరుసగా మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా శివ థాపా గుర్తింపు పొందాడు. ఎల్నూర్ అబ్దురైమోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన ఫైనల్లో మూడు నిమిషాల నిడివిగల తొలి రౌండ్ చివరి సెకన్లలో శివ కుడి కంటి పైభాగానికి గాయం అయింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి అబ్దురైమోవ్ను విజేతగా ప్రకటించారు. ‘నా రెండు లక్ష్యాలు పూర్తయ్యాయి. పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్‌ను దక్కించుకున్నాను’ అని శివ థాపా వ్యాఖ్యానించాడు. మరోవైపు గౌరవ్ బిధురి (56 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. ‘బాక్స్ ఆఫ్’ బౌట్లలో రైమీ తనకా (జపాన్) చేతిలో గౌరవ్... అవైజ్ అలీఖాన్ (పాకిస్తాన్) చేతిలో మనీశ్ ఓడిపోయారు. ఈ టోర్నమెంట్‌లోని ఆయా కేటగిరీలలో టాప్–6లో నిలిచిన బాక్సర్లు ఆగస్టు–సెప్టెంబరులో జర్మనీలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందారు. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. -
క్వార్టర్స్‌లో శివ, సుమీత్
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు శివ థాపా, సుమీత్ సంగ్వాన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన శివ..ఒముర్బెక్ మలబెకోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. క్వార్టర్స్‌లో చు ఎన్ లాయ్ (చైనీస్‌తైపీ)తో శివ తలపడనున్నాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సుమీత్.. ఎర్దెన్బెయర్ సందగ్సురేన్ (మంగోలియా)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో మూడోసీడ్ ఫెంగ్కాయ్ యు (చైనా)తో సుమీత్ తలపడనున్నాడు. మరోవైపు మనీశ్ పాన్వర్ (81 కేజీలు), కవీందర్ సింగ్ బిస్త్ (49 కేజీలు) కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్‌లో జీ ఆర్ గుణరత్నపై మనీశ్ గెలుపొందగా.. అల్దోమ్స్ సుగురో (ఇండోనేసియా)పై కవీందర్ విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో జాసుర్బెక్ లాతిపోవ్ (ఉజ్బెకిస్తాన్)తో కవీందర్ తలపడుతాడు. వీరితోపాటు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ బిధురి (56 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. -
క్వార్టర్స్‌లో సుమీత్ జంట ఓటమి
గ్లాస్గో: స్కాటిష్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆనంద్ పవార్ 21-12, 10-21, 13-21తో టాప్ సీడ్ విట్టింగ్హస్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 17-21, 15-21తో ఐదో సీడ్ ఆండ్రూ ఎల్లిస్-పీటర్ మిల్స్ (ఇంగ్లండ్) జంట చేతిలో పరాజయం చవిచూసింది.