
రెజ్లర్ సుమీత్‌కు రజతం
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు భారత్‌కు రజతం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 125 కేజీల విభాగంలో సుమీత్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో సుమీత్ 2–6తో యాదొల్లా మొహమ్మద్ కాజిమ్ (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు.
భారత్‌కే చెందిన హర్‌ఫూల్ (61 కేజీలు), వినోద్ కుమార్ ఓంప్రకాశ్ (70 కేజీలు), సోమ్‌వీర్ (86 కేజీలు) నిరాశపరిచారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత రెజ్లర్లు ఒక స్వర్ణం, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 10 పతకాలు సొంతం చేసుకున్నారు.