
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి సెమీఫైనల్లో వెనుదిరిగింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 66వ ర్యాంక్‌లో ఉన్న సిక్కి–సుమీత్ 17–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంక్‌లో ఉన్న రినోవ్ రివాల్డీ–పితా మెంతారి (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. సిక్కి–సుమీత్ జోడీకి 2,940 డాలర్ల (రూ. 2 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment