- అక్టోబర్ 4, 5 తేదీల్లో పోటీలు
దక్షిణ భారతస్థాయి అథ్లెటిక్స్ వేదికగా జిల్లా
Published Fri, Aug 12 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
కరీంనగర్ స్పోర్ట్స్ : 28వ దక్షిణ భారతస్థాయి జూనియర్స్ అథ్లెటిక్ ్స పోటీలకు జిల్లా వేదికగా మారనుంది. ఢిల్లీలో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇంyì యా ప్రతినిధులను గురువారం సంప్రదించారు. నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని జిల్లా అథ్లెటిక్ సంఘం ప్రతినిధులకు అందజేశారు. ఈ పోటీల వేదికగా జిల్లాను ఎంపిక చేశారు. జిల్లా అథ్లెటిక్ సంఘం కార్యదర్శి మహిపాల్ ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. పోటీల నిర్వహణ బాధ్యతలు జిల్లాకు వచ్చేలా కృషి చేసిన ఎంపీ వినోద్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్‌కు రాష్ట్ర క్రీడాకారులతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరీ, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్ నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు చెప్పారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో పోటీలు జరుగనున్నాయని, అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని తెలిపారు.
Advertisement
Advertisement