![A disappointment for India on the first day of the athletics competition](/styles/webp/s3/article_images/2024/08/2/walk.jpg.webp?itok=kW_hpN3K)
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజు భారత్‌కు నిరాశ తప్పలేదు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో మన అథ్లెట్లు ఆకట్టుకోలేకపోయారు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 1 గంటా 39 నిమిషాల 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 41వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించి ఆశలు రేపిన ప్రియాంక... ‘పారిస్’ క్రీడల్లో అదే ప్రదర్శన కనబర్చలేకపోయింది. 28 ఏళ్ల ప్రియాంక తన అత్యుత్తమ ప్రదర్శన (1 గంట 28 నిమిషాల 45 సెకన్లు) కంటే 11 నిమిషాలు వెనుకబడింది. పురుషుల విభాగంలో వికాస్ సింగ్ 30వ స్థానంతో, పరమ్‌జీత్ సింగ్ 37వ స్థానంతో రేసును ముగించారు. మరో వాకర్ అ„Š దీప్ అనారోగ్యం కారణంగా రేసు పూర్తి చేయలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment