నాన్న కష్టం చూసి.. పరుగు ఆపేద్దామనుకున్నా.. | athlet naganjali special story on women empowerment | Sakshi
Sakshi News home page

నాన్న కష్టం చూసి.. పరుగు ఆపేద్దామనుకున్నా..

Published Wed, Feb 14 2018 12:03 PM | Last Updated on Wed, Feb 14 2018 12:56 PM

athlet naganjali special story on women empowerment - Sakshi

సాధన చేస్తున్న నాగాంజలి, తల్లిదండ్రులు, తోబుట్టువులతో నాగాంజలి

‘సాహసం నాపదం.. రాజసంనా రథం.. సాగితే ఆపడం.. సాధ్యమా’ అన్నట్టుగా అథ్లెటిక్స్‌తో పేదరికం అనే హర్డిల్స్‌ను దాటుతూ సత్తాచాటుతోంది. కష్టాల్లో పుట్టి పెరిగినా.. కన్నీళ్లను గుండెల్లో దాచుకుని తండ్రి ప్రోత్సాహంతో జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తాపీమేస్త్రీ ఇంట పుట్టినా పరుగులో ప్రతిభ కనబరుస్తూ ఎన్నో రాష్ట్రస్థాయి పతకాలు సొంతం చేసుకున్న ‘బంగారు’ కొండ నిడదవోలు అన్నపూర్ణనగర్‌కు చెందిన యితం నాగాంజలి. పూరిపాకలో కుటుంబం జీవనం సాగిస్తున్నా తండ్రి, కోచ్‌ ప్రోత్సాహంతో పరుగే శ్వాసగా మైదానంలో చెలరేగిపోతోంది. నాగాంజలి విజయగాథ ఆమె మాటల్లోనే..

నిడదవోలు: మాది పేద కుటుం బం. చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగి పెద్దాయ్యాను. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. అథ్లెటిక్‌లో జాతీయ స్థాయిలో రాణిం చాలనే లక్ష్యంతో కష్టాలు, కన్నీళ్లను గుండెల్లో దాచుకుని అలుపెరుగని పరుగుపెడుతున్నాను. నిడదవోలు 7 వార్డు అన్నపూర్ణనగర్‌లో చిన్న పూరిపాకలో నివసిస్తున్నాం. నాన్న సత్తిబాబు, అమ్మ లక్ష్మితో పాటు ఇద్దరు చెల్లెళ్లు. నా న్న తాపీమేస్త్రీగా పనిచేస్తూ రెక్కలు ముక్కలు చేసుకుని  కుటుంబాన్ని పోషిస్తున్నా డు. చిన్నప్పటి నుంచి పరుగంటే నాకెంతో ఇష్టం. నిడదవోలు జెడ్పీ బాలికల హైస్కూ ల్‌లో ఆరో తరగతి చదువున్న రోజుల్లో డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ శిబిరంలో చేరాను. అక్కడ అ బ్బాయిలతో సమానంగా పరుగు పెట్టడంతో పీఈటీల దృష్టి నాపై పడింది.

చక్కగా పరుగు పెడుతుందని, నాగాంజలిని మా పాఠశాలలో చేర్పించమని శెట్టిపేట, చాగల్లు, ఊనగట్ల, గుడివాడ, చిక్కాల హైస్కూళ్ల పీఈటీ సార్లు నాన్నను అడిగా రు. అయితే నాన్న మాత్రం ఇంటికి దగ్గరలో ఉన్న బాలికల హైస్కూల్‌లో చదువుతూ దుర్గా పీఈటీ దగ్గర శిక్షణ తీసుకో మన్నారు. అక్కడ నుంచి నిడదవోలు మండలం పెండ్యాల హైస్కూల్‌లో చేరిన తర్వాత పీఈటీ నాగరాజు సార్‌ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అక్కడ ఉన్నప్పుడే ఒకే ఏడాది ఏడు బం గారు పతకాలను సాధిం చాను. అప్పుడే బలంగా నిశ్చయించుకున్నా జాతీయ స్థాయిలో రా ణించాలని. జాతీయస్థాయిలో పేరుతో పా టు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సంపాదించి నాన్న పడుతున్న కష్టానికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను.

డైట్‌ లేక పస్తులున్నా..
పదో తరగతి పూర్తవగానే పట్టణంలోని కళాశాలలో ఇంటర్‌లో చేరాను. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మై దానంలో రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేసేదానిని. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా మానకుండా ప్రాక్టీస్‌ చే స్తున్నా. అయితే నాన్న రోజంతా కూలీ పని చేసి తీసుకువచ్చిన రూ.400తో కుటుంబ పోషణ కష్టంగా మారింది. నేనే మో రోజూ డైట్‌ తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాక్టీస్‌ చేసి ఇంటికి వచ్చి పస్తులున్న రోజులు ఉన్నాయి. అటువంటి సమయంలో కూడా అమ్మా నేనున్నా నువ్వు బాధపడకు అని నాన్న ధైర్యానిచ్చేవారు. టోర్నమెంట్‌కు వెళ్లడానికి ఖర్చులు, రోజూ శిక్షణ అ నంతరం డైట్‌ కోసం పడు తున్న  ఇబ్బందులు చూసి ప్రాక్టీస్‌ మానేద్దామనుకు న్నా. బాదం, శెనగలు, పాలు, పండ్లు, గుడ్లు డైట్‌ తీసుకోనేందుకు రోజుకి రూ.300 వర కు ఖర్చవుతుంది. ఇంత ఖర్చు పెట్టలేని నాన్నను చూసి కళ్లం టా నీళ్లు తిరిగేవి. ఆ సమయంలో వద్దు నాన్న ఇంక ప్రాక్టీస్‌ చేయనని చె ప్పాను. అయితే నాన్న ఒప్పుకోలేదు. తినో తినకో నీకు ఏ లోటు రానివ్వమని ఆయన అనడంతో మళ్లీ ప్రాక్టీస్‌ మొదలెట్టాను.

ఏం చేయాలో తెలియలేదు
2016లో గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో బూట్లకు రాయి తగలడంతో ఎడమ కాలు పాదానికి గాయమైంది. నొ ప్పి భరించలేకపోయోదాన్ని. పరుగు పెడుతుంటే నొప్పి బా గా వచ్చేది. కనీసం మందులు కొనుక్కోవడానికి డబ్బుల్లేని పరిస్థితి. ఏం చేయాలో.. నాన్నకు ఎలా చెప్పాలో తెలియక ఒంటరిగా కూర్చుని బాధపడేదాన్ని. నన్ను గమనించిన నా న్న, పీఈటీ నాగరాజు సార్‌ రాజమండ్రి ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. నాలుగు నెలలు మందులు వాడిన త ర్వాత బాధ తగ్గింది. మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. నాలో పట్టుదల మరింత పెరిగింది. ఇంట్లో డైట్‌ సమస్యలు ఉన్నా అర్ధాకలితో ప్రాక్టీస్‌ చేశాను. పరుగులో ఈ స్థాయికి చేరుకున్న నేను దాతల సహకారంతో వివిధ పోటీల్లో రాణిస్తున్నాను. ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ మొదటి సం వత్సరం చదువుతూ పరుగులో శిక్షణ తీసుకుంటున్నా. ఉ ద్యోగం సాధించి నా ఇద్దరు చెల్లెళ్లకు వివాహలు చేయడమే నా ముందున్న లక్ష్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement