టీమ్‌ చాంపియన్‌ హెచ్‌పీఎస్‌ | HPS wins team championship of athletics meet | Sakshi
Sakshi News home page

టీమ్‌ చాంపియన్‌ హెచ్‌పీఎస్‌

Published Fri, Dec 29 2017 10:44 AM | Last Updated on Fri, Dec 29 2017 10:44 AM

HPS wins team championship of athletics meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) బేగంపేట్‌ జట్టు సత్తా చాటింది. హైదరాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మూడు టీమ్‌ చాంపియన్‌షిప్‌ టైటిళ్లను కైవసం చేసుకుంది. అండర్‌–10 బాలుర, అండర్‌–12 బాలబాలికల విభాగాల్లో హెచ్‌పీఎస్‌ జట్లు విజేతలుగా నిలిచాయి.

అండర్‌–14 బాలబాలికల విభాగంలో సెయింట్‌ ఆండ్రూస్‌ బోయిన్‌పల్లి జట్లు టీమ్‌ చాంపియన్‌షిప్‌ టైటిళ్లను సాధించాయి. అండర్‌–10 బాలికల టీమ్‌ చాంపియన్‌షిప్‌ చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ జట్టుకు దక్కింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన అండర్‌–14 బాలికల 4000మీ. పరుగులో చిరెక్‌ స్కూల్‌కు చెందిన దియా గంగ్వార్‌ చాంపియన్‌గా నిలిచింది. అదితి సింగ్‌ (జ్యోతి వీఎస్‌), ప్రియాంక దాస్‌ (సెయింట్‌ ఆండ్రూస్‌) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. బాలుర విభాగంలో టి. రాహుల్‌ (సెయింట్‌ ఆండ్రూస్‌), ఎం. అరవింద్‌ (శాంతినికేతన్‌) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుపొందగా, సుహాస్‌ చౌదరి (కేవీ గచ్చిబౌలి) కాంస్యాన్ని దక్కించుకున్నాడు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

అండర్‌–14 బాలుర 800మీ. పరుగు: 1. మోహిన్‌ (టీర్‌ఈఐఎస్‌), 2. ఎం. అరవింద్‌ (శాంతినికేతన్‌), 3. ఎం. సాయి (ఎన్‌జేఎంహెచ్‌ఎస్‌); బాలికలు: 1. సీహెచ్‌ రాఘవి (కేవీజీవీ), 2. పి. శ్రేయ (సెయింట్‌ మార్క్‌ హైస్కూల్‌), 3. యువిక (కెన్నడీ వీఎస్‌).

షాట్‌పుట్‌: 1. ఎం. చంద్ర కుమార్, 2. టి. ఎమ్మాన్యుయేల్‌ (హెచ్‌పీఎస్‌), 3. ఎం. సుహాస్‌ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. ధ్రుతి అనీశ్‌ కుమార్, 2. కె. ఖదీజ, 3. ఎం. వర్ణిక.

హైజంప్‌: 1. ఎం. చంద్రకుమార్, 2. హిమవంత్‌ కృష్ణ, 3. బి. ప్రణయ్‌; బాలికలు: 1. అదితి సింగ్‌ (జ్యోతి విద్యాలయ), 2. ధ్రుతి, 3. సౌమ్య (హెచ్‌పీఎస్‌).  
అండర్‌–12 బాలుర 600మీ. పరుగు: 1. ఎన్‌. గణేశ్‌ (ప్రగతి వీఎంఎస్‌), 2. బి. మహేశ్‌ (పుడమి ఎన్‌హెచ్‌ఎస్‌), 3. ఎస్‌. గణేశ్‌ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. బీఎస్‌ జాష్వి (సెయింట్‌ ఆండ్రూస్‌), 2. జి. రితిక (హెచ్‌పీఎస్‌), 3, ఎ. వైష్ణవి (జీసీఏఏ).

హైజంప్‌: 1. పి. భవదీప్‌ (ఆర్మీ స్కూల్‌), 2. సీహెచ్‌ సిద్ధార్థ్‌ (సెయింట్‌ మేరీస్‌), 3. బి. ఇషాన్‌ (హెచ్‌పీఎస్‌); బాలికలు: 1. అదితి సింగ్, 2. ధ్రుతి, 3. సౌమ్య.
షాట్‌పుట్‌: 1. ఆర్‌. అద్నాన్‌ (ఎంఎస్‌బీ), 2. ఎం. ప్రణవ్‌ (హెచ్‌పీఎస్‌), 3. ఇడ్రిస్‌ (ఎంఎస్‌బీ); బాలికలు: 1. బి. వర్‌‡్ష రెడ్డి (హెచ్‌పీఎస్‌), 2. ఎం. అవని (జీసీఏఏ), 3. సి. అవని (జీసీఏఏ).

అండర్‌–10 బాలుర 600మీ. పరుగు: 1. పి. బద్రీనాథ్, 2. కె. దర్శ్‌ (ఎన్‌ఏఎస్‌ఆర్‌), 3. ఎస్‌. శ్రుశాంత్‌ రెడ్డి (శ్రీనిధి హైస్కూల్‌); బాలికలు: 1. కె. మహేశ్వరి (సాయి చైతన్య హైస్కూల్‌), 2. ఎం. రేవతి (ప్రగతి హైస్కూల్‌), 3. బి. శ్రీనిక (శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement