HPS
-
విజేత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) విజేతగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గీతాంజలి దేవశాల వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను అందుకుంది. ఆదివారం జరిగిన నాసర్ స్కూల్‌తో జరిగిన ఫైనల్లో హెచ్‌పీఎస్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. అమన్ (57; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. వైభవ్ (21) రాణించాడు. అనంతరం నాసర్ జట్టు 99 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హర్షిల్ మిశ్రా (42) ఒంటరిపోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్, ఆదిత్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
టీమ్ చాంపియన్ హెచ్‌పీఎస్
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట్ జట్టు సత్తా చాటింది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మూడు టీమ్ చాంపియన్‌షిప్ టైటిళ్లను కైవసం చేసుకుంది. అండర్–10 బాలుర, అండర్–12 బాలబాలికల విభాగాల్లో హెచ్‌పీఎస్ జట్లు విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలబాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ బోయిన్పల్లి జట్లు టీమ్ చాంపియన్‌షిప్ టైటిళ్లను సాధించాయి. అండర్–10 బాలికల టీమ్ చాంపియన్‌షిప్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుకు దక్కింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన అండర్–14 బాలికల 4000మీ. పరుగులో చిరెక్ స్కూల్‌కు చెందిన దియా గంగ్వార్ చాంపియన్‌గా నిలిచింది. అదితి సింగ్ (జ్యోతి వీఎస్), ప్రియాంక దాస్ (సెయింట్ ఆండ్రూస్) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. బాలుర విభాగంలో టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), ఎం. అరవింద్ (శాంతినికేతన్) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుపొందగా, సుహాస్ చౌదరి (కేవీ గచ్చిబౌలి) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–14 బాలుర 800మీ. పరుగు: 1. మోహిన్ (టీర్ఈఐఎస్), 2. ఎం. అరవింద్ (శాంతినికేతన్), 3. ఎం. సాయి (ఎన్జేఎంహెచ్ఎస్); బాలికలు: 1. సీహెచ్ రాఘవి (కేవీజీవీ), 2. పి. శ్రేయ (సెయింట్ మార్క్ హైస్కూల్), 3. యువిక (కెన్నడీ వీఎస్). షాట్‌పుట్: 1. ఎం. చంద్ర కుమార్, 2. టి. ఎమ్మాన్యుయేల్ (హెచ్‌పీఎస్), 3. ఎం. సుహాస్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. ధ్రుతి అనీశ్ కుమార్, 2. కె. ఖదీజ, 3. ఎం. వర్ణిక. హైజంప్: 1. ఎం. చంద్రకుమార్, 2. హిమవంత్ కృష్ణ, 3. బి. ప్రణయ్; బాలికలు: 1. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ), 2. ధ్రుతి, 3. సౌమ్య (హెచ్‌పీఎస్). అండర్–12 బాలుర 600మీ. పరుగు: 1. ఎన్. గణేశ్ (ప్రగతి వీఎంఎస్), 2. బి. మహేశ్ (పుడమి ఎన్హెచ్ఎస్), 3. ఎస్. గణేశ్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. బీఎస్ జాష్వి (సెయింట్ ఆండ్రూస్), 2. జి. రితిక (హెచ్‌పీఎస్), 3, ఎ. వైష్ణవి (జీసీఏఏ). హైజంప్: 1. పి. భవదీప్ (ఆర్మీ స్కూల్), 2. సీహెచ్ సిద్ధార్థ్ (సెయింట్ మేరీస్), 3. బి. ఇషాన్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. అదితి సింగ్, 2. ధ్రుతి, 3. సౌమ్య. షాట్‌పుట్: 1. ఆర్. అద్నాన్ (ఎంఎస్బీ), 2. ఎం. ప్రణవ్ (హెచ్‌పీఎస్), 3. ఇడ్రిస్ (ఎంఎస్బీ); బాలికలు: 1. బి. వర్‡్ష రెడ్డి (హెచ్‌పీఎస్), 2. ఎం. అవని (జీసీఏఏ), 3. సి. అవని (జీసీఏఏ). అండర్–10 బాలుర 600మీ. పరుగు: 1. పి. బద్రీనాథ్, 2. కె. దర్శ్ (ఎన్ఏఎస్ఆర్), 3. ఎస్. శ్రుశాంత్ రెడ్డి (శ్రీనిధి హైస్కూల్); బాలికలు: 1. కె. మహేశ్వరి (సాయి చైతన్య హైస్కూల్), 2. ఎం. రేవతి (ప్రగతి హైస్కూల్), 3. బి. శ్రీనిక (శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్). -
విద్యార్థిని ఎందుకు డిమోట్ చేయడం లేదు?
సాక్షి, హైదరాబాద్: ఓ చిన్నారిని ఒకటవ తరగతిలో కాకుండా నేరుగా రెండో తరగతిలో చేర్చుకోవడంపై వివరణ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు గురువారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) యాజమాన్యాన్ని ఆదేశించింది. రెండో తరగతిలో చేరిన తమ చిన్నారి ఆ పాఠాలను నేర్చుకోలేకపోతోందని, అందువల్ల ఒకటో తరగతికి డిమోట్ చేయాలన్న చిన్నారి నానమ్మ చేసిన అభ్యర్థనను తిరస్కరించడంపై వివరణ ఇవ్వాలంది. తదుపరి విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో తరగతిలో చేరిన తమ చిన్నారి ఆ తరగతి పాఠాలను చదవలేకపోతోందని, అందువల్ల ఆ చిన్నారిని ఒకటో తరగతికి డిమోట్ చేయాలంటూ తాము చేసిన అభ్యర్థనను హెచ్‌పీఎస్ యాజమాన్యం తిరస్కరించడంపై కొమిరెడ్డి అద్వేత్య నానమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి పిటిషన్‌ను కొట్టేశారు. పిటిషనర్ కోరిక మేరకే రెండో తరగతిలో ప్రవేశం కల్పించామని హెచ్‌పీఎస్ యాజమాన్యం చెప్పడంతో దానిని పరిగణనలోకి తీసుకుంటూ న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై అద్వేత్య నానమ్మ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఆ చిన్నారి భవిష్యత్తును, హక్కులను దృష్టిలో పెట్టుకుని ఈ కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. ఆ చిన్నారిని ఎందుకు ఒకటో తరగతికి డిమోట్ చేయడం లేదో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
ఓవరాల్ చాంపియన్ హెచ్‌పీఎస్
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ క్లస్టర్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా అథ్లెటిక్స్ విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్–రామంతాపూర్) జట్టు సత్తా చాటింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 149 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు అండర్–14 బాలబాలికల టీమ్ చాంపియన్‌షిప్ టైటిళ్లను సెయింట్ ఆండ్రూస్ జట్టు కైవసం చేసుకుంది. అండర్–17 బాలు ర టీమ్ విభాగంలో హెచ్‌పీఎస్ రామంతాపూర్, బాలికల కేటగిరీలో సెయింట్ ఆండ్రూస్ జట్లు... అండర్–19 కేటగిరీలో హెచ్‌పీఎస్ (బాలుర), ఏపీఎస్ ఆర్కే పురం (బాలికల) జట్లు టీమ్ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డీపీఎస్ చైర్మన్ కొమురయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. డీపీఎస్ జోరు సీబీఎస్ఈ క్లస్టర్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) జట్లు జోరు కనబరుస్తున్నాయి. శనివారం జరిగిన అండర్–17 మ్యాచ్‌ల్లో డీపీఎస్ (వరంగల్) 3–1తో జూబ్లీహిల్స్ హైస్కూల్‌పై, డీపీఎస్ (విజయవాడ) 4–0తో స్పార్కిల్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, డీపీఎస్ (ఖాజాగూడ) 1–0తో భవన్స్ రామకృష్ణ జట్లపై గెలుపొందాయి. ఇతర మ్యాచ్‌ల్లో పరమహంస స్కూల్ 1–0తో సెయింట్ పీటర్స్‌పై, ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్ 1–0తో దేవ్ పబ్లిక్ స్కూల్‌పై, ఆర్మీ పబ్లిక్ స్కూల్ (గోల్కొండ) 5–0తో ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించాయి. టైటిల్ పోరుకు డీపీఎస్, ఓక్రిడ్జ్ జట్లు బాస్కెట్‌బాల్ ఈవెంట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) నాచారం, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో డీపీఎస్ నాచారం 49–36తో గ్లెండేల్ అకాడమీ (తెలంగాణ)పై గెలుపొందగా, మరో సెమీస్ మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 32–15తో ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో డీపీఎస్ 66–37తో సెయింట్ ఆండ్రూస్‌ను, గ్లెండేల్ అకాడమీ 64–43తో ఇండస్ యూనివర్సల్ జట్టును ఓడించాయి. -
హెచ్‌పీఎస్ జట్టుకు టైటిల్
క్రికెట్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్ఈ–ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట్ జట్టు సత్తా చాటింది. మీట్లో భాగంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి టైటిల్‌ను సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో గీతాంజలి స్కూల్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గీతాంజలి స్కూల్ 62 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ (21) ఒక్కడే రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అనిరుధ్ 3 వికెట్లు పడగొట్టగా, అజీమ్, శార్దుల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆతిథ్య హెచ్‌పీఎస్ జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లకు 63 పరుగులు చేసింది. అజీమ్ (27) ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో గీతాంజలి 12 పరుగుల తేడాతో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, హెచ్‌పీఎస్ 80 పరుగుల తేడాతో సుజాత స్కూల్‌పై గెలుపొందింది. వాలీబాల్‌లోనూ శుభారంభం ఐసీఎస్ఈ–ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ వాలీబాల్ ఈవెంట్లోనూ హెచ్‌పీఎస్ జట్టు శుభారంభం చేసింది. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ సీనియర్ బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ 15–8, 15–5తో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్‌పై గెలిచి శుభారంభం చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో ఎస్డీఏ సెకండరీ స్కూల్ 15–11, 15–8తో ఫ్యూచర్కిడ్స్పై, హెరిటేజ్ వ్యాలీ 12–15, 14–4, 15–8తో సెయింట్ జోసెఫ్ కింగ్ కోఠిపై, సుజాత పబ్లిక్ స్కూల్ 15–4, 15–2తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై గెలుపొందాయి. జూనియర్ బాలుర లీగ్ మ్యాచ్‌ల ఫలితాలు హెచ్‌పీఎస్ కడప 15–11, 15–5తో లిటిల్ ఫ్లవర్ స్కూల్‌పై, షేర్వుడ్ 15–5, 15–11తో ఇంటర్నేషనల్ స్కూల్‌పై, ఇండియన్ బ్లోసమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 15–11, 15–5తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ 15–7, 15–9తో సెయింట్ మేరీస్‌పై, సుజాత పబ్లిక్ స్కూల్ 15–12, 15–11తో అభ్యాస స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ మలక్‌పేట్ 15–3, 15–5తో సెయింట్ జోసెఫ్ కింగ్కోఠిపై, సెయింట్‌ఆన్స్ 15–13, 15–13తో ఫ్యూచర్‌కిడ్స్ జట్లపై గెలిచి ముందంజ వేశాయి. -
సిస్టమ్స్‌పై మాల్వేర్ దాడులు నిజమే
32 లక్షల కార్డుల వివరాల చోరీ ఉదంతంపై హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ ముంబై: కార్డు ఆధారిత లావాదేవీల భద్రతపై ఆందోళన కలిగించే విధంగా గతేడాది తమ సిస్టమ్స్ సైబర్ దాడులకు గురైన మాట వాస్తవమేనని హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్(హెచ్‌పీఎస్) వెల్లడించింది. దీని వల్ల వినియోగదారులకు, బ్యాంకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. 2016 మధ్యలో హిటాచీ సెక్యూరిటీ సిస్టమ్స్‌పై మాల్వేర్ దాడి జరిగిన సంగతి సెక్యూరిటీ ఆడిట్ సంస్థ ఎస్ఐఎస్ఏ ఇన్ఫర్మేషన్ నివేదికలో తేలింది. తాము అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ ఊహించని విధంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు హెచ్‌పీఎస్ ఎండీ లోనీ ఆంథోనీ తెలిపారు. మాల్వేర్ చొరబడిన తీరు గురించి తెలిసినప్పటికీ ఎంత మేర డేటా చౌర్యం జరిగిందన్నది నిర్ధారించలేమన్నారు. గతేడాది మే 21–జూలై 11 మధ్యకాలంలో హెచ్‌పీఎస్ సర్వీసులు అందిస్తున్న ఏటీఎంలలో మాల్వేర్ చొరబడటంతో దాదాపు 32 లక్షల పైగా డెబిట్ కార్డుల సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లు అంచనాలు ఉన్నాయి. 600 మంది పైగా కస్టమర్లు రూ. 1.3 కోట్ల మేర నష్టపోయినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేర్కొంది. హెచ్పీఎస్కి అతి పెద్ద క్లయింట్ అయిన యస్ బ్యాంక్‌కి చెందిన ఒకానొక ఏటీఎం నుంచి ఈ మాల్వేర్ .. మొత్తం వ్యవస్థలోకి ప్రవేశించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చాలా మటుకు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త కార్డులు జారీ చేయాల్సి వచ్చింది. -
హెచ్‌పీఎస్, శ్రీనిధి జట్ల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ కప్ అండర్-14 ఇంటర్‌స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్‌పీఎస్ రామంతపూర్ జట్లు శుభారంభం చేశారుు. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ మైదానం వేదికగా శుక్రవారం హిల్‌సైడ్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీనిధి జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హిల్‌సైడ్ స్కూల్ 7.3 ఓవర్లలో 30 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో నిమిష్ 3 వికెట్లు దక్కించుకోగా... నితిన్ కేవలం 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీనిధి జట్టు 2.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31పరుగులు చేసి గెలిచింది. 4 వికెట్లతో రాణించిన నితిన్ సారుుకి బెస్ట్ ప్లేయర్ పురస్కారం లభించింది. మెరిడియన్ (మాదాపూర్)స్కూల్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ రామంతపూర్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన మెరిడియన్ జట్టు 10.3 ఓవర్లలో 41 పరుగులకు ఆలౌటైంది. హెచ్‌పీఎస్ బౌలర్ బాలాజీ 4 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు. అనంతరం హెచ్‌పీఎస్ జట్టు 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసి గెలిచింది. ధనుశ్ (19 నాటౌట్), వ్యాస్ (14 నాటౌట్) రాణిం చారు. బౌలింగ్‌లో రాణించిన బాలాజీకి బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది. -
ఆ స్కూల్ బండారం బయటపెడతా: ఎమ్మెల్యే
⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్ధులకు సీట్లు కేటాయించడంలో నిర్లక్ష్యం ⇒ హెచ్‌పీఎస్ లీజు రద్దుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ⇒ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపాటు హైదరాబాద్: పజల అభీష్టం మేరకు శ్మశాన వాటికకు 3.26 ఎకరాలను కేటాయిస్తే.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం(హెచ్‌పీఎస్) అభివృద్ధిని అడ్డుకుంటోందని, వారి చేసే అక్రమాలన్నింటినీ బయటపడతానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. శ్యాంలాల్‌బిల్డింగ్ తాతాచారికాలనీ గ్రౌండ్లో స్థానికులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. శవాలను కూడా తీసుకెళ్లనీయకుండా, మహిళలకు కనీసం స్నానాలు గదులు కట్టనీయకుండా చేస్తున్నారని హెచ్‌పీఎస్ యాజమాన్యంపై మండిపడ్డారు. రూ.85 లక్షలతో (ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ నిధులు) 3.26 ఎకరాల్లో హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులు గత నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన విషయం విదితమే. అయితే రెండెకరాల స్థలానికి సంబంధించి కోర్టు స్టే ఉందని, పోలీసుల సహాయంతో హెచ్‌పీఎస్ స్కూల్ వారు పనులను నిలుపుదల చేయిస్తున్నారని మాధవరం కృష్ణారావు తెలుసుకున్నారు. యాజమాన్యం చేస్తున్న అక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి హెచ్‌పీఎస్ కు కేటాయించిన స్థల లీజును రద్దుచేయాలని కోరతామన్నారు. లీజును రద్దు చేయించి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రా ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు గానీ వినియోగించేలా కృషి చేస్తానని స్థానికులకు హామీనిచ్చారు. ఇక్కడ పాఠశాల డెరైక్టర్ల బంధువులు, కుటుంబసభ్యుల పిల్లలకే సీట్లు పరిమితమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు స్థానికంగా ఉంటున్న వారి పిల్లలకు చోటు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెరైక్టర్లుగా చెప్పుకుంటున్న వారు కార్లలో తిరుగుతూ బంగ్లాల్లో ఉంటున్నారని, అసలు వారి ఆస్తులపై విచారణ జరిపే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్మశానవాటికకు కేటాయించిన రెండెకరాల స్థలంపై ఉన్న స్టేను త్వరలోనే ఎత్తివేయించి మొత్తం 3.26 ఎకరాలను అభివృద్ధి చేసేవరకు తాను ఈ సమస్యను వదిలేది లేదన్నారు. హెచ్‌పీఎస్ యాజమాన్య అక్రమాలపై 3, 4 రోజుల్లో అన్ని రకాల పత్రాలను తీసుకుని సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ ఉప్పల తరుణినాయీ, టీఆర్ఎస్ నాయకులు డీవీ నరేందర్‌రావు, సురేష్‌యాదవ్, యాదగిరిగౌడ్, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
చెలరేగిన కెవిన్ గుప్తా
సాక్షి, హైదరాబాద్: హెచ్‌పీఎస్ బౌలర్ కెవిన్ గుప్తా (7/20, 5/32) దక్కన్ బ్లూస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) జట్టును గెలిపించాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో ఆదివారం 58/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన దక్కన్ బ్లూస్ 86 పరుగులకే కుప్పకూలింది. కెవిన్ ధాటికి ఎవరూ నిలువలేకపోయారు. తర్వాత ఫాలోఆన్ ఆడిన దక్కన్ బ్లూస్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. ఠాకూర్ హర్స్వర్దింగ్ (74) ఒంటరి పోరాటం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కెవిన్ 5 వికెట్లు తీశాడు. తర్వాత 33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో హెచ్‌పీఎస్ 189 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు కొసరాజు తొలి ఇన్నింగ్స్: 338/7 (రోహన్ వార్కె 166 నాటౌట్, రాహుల్ 57), సాయి సత్య తొలి ఇన్నింగ్స్: 382/8 (శ్రీకరణ్ 103 నాటౌట్; నారాయణ 74, కృష్ణచరిత్ 57). తెలంగాణ తొలి ఇన్నింగ్స్: 145/9 డిక్లేర్డ్, డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 175/9 డిక్లేర్డ్, తెలంగాణ రెండో ఇన్నింగ్స్: 250/6 డిక్లేర్డ్ (రాజేశ్ నాయక్ 85), డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 143/7 (యశ్వంత్ బాబు 71; సురేశ్ 3/23). -
హెచ్‌పీఎస్‌కు 18 ఎకరాల స్థలం: కడియం
వరంగల్ : మామునూరులో వెటర్నరీ కాలేజీకి ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మంగళవారం వరంగల్‌లో పైడిపల్లిలోని ఏఆర్ఎస్లోనే అగ్రికల్చర్ కాలేజీ నిర్మాణం చేస్తామని ఆయన చెప్పారు. ఐదెకరాల్లో కాటన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు 18 ఎకరాల స్థలం కేటాయిస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
హెచ్‌పీఎస్ @:90
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... నగరంతో తొమ్మిది దశాబ్దాల అనుబంధం. ఎందరో ప్రముఖులకు మార్గనిర్దేశనం చేసిన విద్యానిలయం. ఇరుకు గదుల్లో... విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు భిన్నంగా ప్రత్యేకత చాటుకుంది. సువిశాల ప్రాంగణంలో... అత్యాధునిక వసతులతో... నాణ్యమైన విద్యను అందిస్తూ దేశంలోనే విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. నేడు హెచ్‌పీఎస్ 90 వసంతాల ఉత్సవం జరుపుకొంటున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. దేశంలోని 20 ప్రసిద్ధ పాఠశాలల్లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని ప్రఖ్యాత ‘వరల్డ్ మ్యాగజైన్’ గుర్తించింది. 140 ఎకరాల సువిశాల ప్రాంగణం... పెద్ద క్రీడా మైదానం... ఎటు చూసినా పచ్చందం... అత్యాధునిక వసతులతో చూడగానే ముచ్చటగొలుపుతుంది హెచ్‌పీఎస్. ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో ‘జాగీర్దార్ స్కూల్’ పేరుతో ప్రారంభమైందీ పాఠశాల. అప్పటి జాగీర్దార్లలో ఒకరైనా సర్ వికార్-ఉల్-ఉమా బహుల్‌ఖానగూడ పేరుతో ఉన్న ప్రస్తుత బేగంపేటలో దీర్ఘకాల లీజ్ ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా... ముగ్గురు విద్యార్థులతో పాఠశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. పబ్లిక్ స్కూల్‌గా... 1950లో ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దు చేయడంతో... అప్పటి వరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్దార్ స్కూల్ పబ్లిక్ స్కూల్‌గా రూపాంతరం చెందింది. నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పాటైంది. బాలులకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్... 1988 నుంచి కోఎడ్యుకేషన్ విద్యాలయంగా మారిపోయింది. ఒకరా... ఇద్దరా..! ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజకీయ నాయకులుగా, సినీతారలుగా, బడా వ్యాపారవేత్తలుగా ఉన్నారు. వారిలో కొందరు... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి పళ్లం రాజు, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేష్, రామ్‌చరణ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, లండన్‌లో కోబ్రా బీర్ వ్యవస్థాపక చైర్మన్ కరణ్బిల్లి మోరియా, ఐ2 టెక్నాలజీస్ సీఈఓ సంజీవ్సిద్ధు, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ, గాయకుడు తలజ్ అజీజ్, ఎంటీవీ వీజే నిఖిల్ చిన్నప్ప, క్రికెట్ వ్యాఖ్యాత హర్షభోగ్లే, ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి వీర్మొహిసిన్ సయిద్, కెనడాలో స్థిరపడ్డ ఫెయిర్‌ఫాక్స్ చైర్మన్ రాజ్వత్సా, ఇటీవల వార్తల్లో నిలిచిన బిజినెస్ మ్యాన్ ప్రేమ్‌వత్సా. ప్రముఖులు ఎంతో మంది విద్యాభ్యాసం చేసిన హెచ్‌పీఎస్‌లో చదువుకోవడం చాలా ఆనందంగా ఉంది. దశాబ్ధాలు గడిచినా పాఠశాల ఖ్యాతి తరగకపోవడం విశేషం. ఇప్పటికీ నగరంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు హెచ్‌పీఎస్‌లో సీటు సంపాదించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఇది పాఠశాలకే గర్వకారణం. - మర్రి ఆదిత్యారెడ్డి, పూర్వ విద్యార్థి, హెచ్‌పీఎస్ సొసైటీ సభ్యుడు