సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) విజేతగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గీతాంజలి దేవశాల వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను అందుకుంది. ఆదివారం జరిగిన నాసర్ స్కూల్‌తో జరిగిన ఫైనల్లో హెచ్‌పీఎస్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.
అమన్ (57; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. వైభవ్ (21) రాణించాడు. అనంతరం నాసర్ జట్టు 99 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హర్షిల్ మిశ్రా (42) ఒంటరిపోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్, ఆదిత్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment