సాక్షి, నిర్మల్: రైతు అంటే.. పొలం దున్ని, పంటలు పండించాలా?.. వాళ్లలోనూ అదనపు టాలెంట్లు ఉంటాయి. వాళ్లు వినోదాన్ని కోరుకుంటారు. అలాంటి కొందరు రైతులు క్రికెట్ ఆడి ఔరా అనిపించారు. పొలంలోనే కాదు.. మైదానంలోనూ పంచె పైకి బిగించికట్టి అద్భుతంగా క్రికెట్ ఆడి ఔరా అనిపించారు.
నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో ఆదివారం అన్నదాతలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. అనంతపేట్, నీలాయిపేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట్ గ్రామాల రైతులు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. ఈ పోటీలను ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. వయసుతో సంబంధం లేకుండా .. రైతులు మైదానంలో చురుగ్గా పరుగులు తీస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రైతుల క్రికెట్ చూసేందుకు వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment