Athletics meet
-
16 ఏళ్ల రికార్డు బద్దలు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ‘ద టెన్’ అథ్లెటిక్స్ మీట్లో 25 ఏళ్ల గుల్వీర్ ఈ ఘనత సాధించాడు. గుల్వీర్ తాను పాల్గొన్న హీట్స్‌లో 10,000 మీటర్లను 27 నిమిషాల 41.81 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 16 ఏళ్లుగా సురేందర్ సింగ్ (28ని:02.89 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును గుల్వీర్ తిరగరాశాడు. గుల్వీర్ కొత్త జాతీయ రికార్డు సృష్టించినా పారిస్ ఒలింపిక్స్ (27 నిమిషాలు) అర్హత ప్రమాణ సమయాన్ని అధిగమించలేకపోయాడు. -
రజతం నెగ్గిన జ్యోతి యర్రాజీ
ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ బెల్జియంలో జరిగిన ఐఫామ్ ఈఏ పర్మిట్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో రజత పతకం సాధించింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.19 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. జో సెడ్నీ (నెదర్లాండ్స్; 13.18 సెకన్లు) స్వర్ణం, జెన్నా బ్లన్‌డెల్ (బ్రిటన్; 13.30 సెకన్లు) కాంస్యం సాధించారు. హీట్స్‌లో జ్యోతి 13.26 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. -
వయసు దాటినవారు 51 మంది...
తిరుపతి: క్రీడల్లో తప్పుడు వయోధ్రువీకరణ పత్రాలతో తక్కువ వయసు స్థాయి పోటీల్లో పాల్గొనడటం తరచుగా జరుగుతూనే ఉంది. ఇలాంటిదే ఇటీవల జరిగిన ఒక ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తిరుపతి వేదికగా నవంబర్ 24 నుంచి 26 మధ్య వరకు జరిగిన జాతీయ జూనియర్ అంతర్ జిల్లా అథ్లెటిక్స్ మీట్లో ఇది చోటు చేసుకుంది. అండర్–14, అండర్–16 విభాగాల్లో పోటీ పడటానికి దేశవ్యాప్తంగా 494 జిల్లాలకు చెందిన 4500 మంది అథ్లెట్లు ఈ మీట్లో పాల్గొన్నారు. అయితే వీరి వయసును తెలుసుకోవడానికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వారికి వయసు నిర్ధారిత పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగా అథ్లెట్లకు దంత పరీక్షలు, టానర్ వైట్‌హౌస్ (టీడబ్ల్యూ3– ఎక్స్‌రే ద్వారా ఎముక వయసును కనుగొనే పద్ధతి) పరీక్షలు నిర్వహించగా... అందులో 51 మందికి ఎక్కువ వయసు ఉన్నట్లు తేలింది. వీరంతా తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలతో పోటీల్లో పాల్గొంటున్నట్లు ఏఎఫ్ఐ కనిపెట్టింది. మరో 169 మంది పరీక్షల్లో పాల్గొనకుండా ముందే తప్పించుకున్నట్లు ఏఎఫ్ఐ వయసు నిర్ధారిత పరీక్షల నిర్వహణాధికారి రాజీవ్ ఖత్రి తెలిపారు. దీనిపై ఆయా రాష్ట్రా ల వివరణను కోరనున్నట్లు ఏఎఫ్ఐ స్పష్టం చేసింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వేదికగా జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్ లో కూడా దాదాపు 100 మంది ప్లేయర్లు తప్పుడు వయసుతో పోటీల్లో పాల్గొంటూ పట్టుబడ్డారు. -
విజేతలు పద్మశ్రీ, మనో వెంకట్
సాక్షి, హైదరాబాద్: ఏఎస్ఐఎస్ఈ తెలంగాణ, ఏపీ రీజినల్ స్పోర్ట్స్, గేమ్స్ అథ్లెటిక్స్ మీట్లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి సీహెచ్ పద్మశ్రీ, గీతాంజలికి చెందిన మనో వెంకట్ సత్తా చాటారు. గచి్చ»ౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్–17 బాలికల 100మీ. పరుగులో పద్మశ్రీ విజేతగా నిలిచింది. ఆమె పరుగును 12.91 సెకన్లలో పూర్తిచేసింది. శ్రీసాయి పబ్లిక్ స్కూల్ (పటాన్చెరు)కు చెందిన శ్రీవర్షిణి (13.82 సె.), పి. అంబిక (14.03 సె.) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. అండర్–19 బాలుర 100మీ. పరుగును మనో వెంకట్ 11.7 సెకన్లలో ముగించి పసిడిని సొంతం చేసుకున్నాడు. అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు వంశీ (11.8సె.), విష్ణు రేవంత్‌రెడ్డి (12.03సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–19 బాలికల 800మీ. పరుగు: 1. నిధి (సెయింట్ జోసెఫ్), 2. నైనితరావు (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. రుచిత (అభ్యాస); బాలురు: 1. వీఎస్ విన్సెంట్ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. సాకేత్ రెడ్డి (అభ్యాస స్కూల్), 3. దినేశ్ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్). అండర్–14 బాలికల లాంగ్ జంప్: 1. కృతి (సెయింట్ జోసెఫ్), 2. గయాన (ఎమ్మాస్ స్విస్ స్కూల్), 3. ప్రహర్షిత (హెచ్‌పీఎస్, బేగంపేట్); అండర్–17 బాలికలు: 1. పద్మశ్రీ (సెయింట్ జోసెఫ్), 2. పి. అంబిక (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 3. ఇందు వర్షిణి (ఎమ్మాస్ స్కూల్); అండర్–19 బాలికలు: 1. రాగవర్షిణి, 2. జోహిత (సెయింట్ జోసెఫ్), 3. సలోమి ప్రహర్షిత (సెయింట్ జార్జ్ స్కూల్). అండర్–14 బాలుర షాట్‌పుట్: 1. తిరుపతి, 2. అక్షయ్ (ఎమ్మాస్ స్విస్ స్కూల్), 3. అజయ్ వర్దన్‌రెడ్డి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్); అండర్–17 బాలురు: 1. సంజయ్, 2. పవన్ తేజ్ (ఎమ్మాస్ స్విస్ స్కూల్), 3. వీర సాయి (ఫ్యూచ ర్కిడ్స్); అండర్–19 బాలురు: 1. అరుణ్ (ఎమ్మాస్ స్కూల్), 2. అశోక్ (ది పీపల్ గ్రోవ్ స్కూల్), 3. అక్షయ్ (శ్రీ అరబిందో స్కూల్). -
చాంప్స్ ఆదిత్య, సురేంద్ర
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసీ) ఆధ్వర్యంలో ఆదివారం అథ్లెటిక్స్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన పురుషుల ఐదు కిలోమీటర్ల రేసులో వి. ఆదిత్య... పది కిలోమీటర్ల రేసులో సురేంద్ర పరవాడ విజేతలుగా నిలిచారు. ఐదు కిలోమీటర్ల విభాగంలో ప్రీతమ్ కుమార్ సింగ్ రెండో స్థానంలో, శాంతను మూడో స్థానంలో నిలిచారు. పది కిలోమీటర్ల విభాగంలో విజ్ఞాన్ రాచబత్తుని రెండో స్థానాన్ని, అనిల్ మూడో స్థానాన్ని పొందారు. హైసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైసీ అధ్యక్షుడు బొల్లు మురళి కూడా పాల్గొన్నారు. -
ద్యుతీ చంద్‌కు స్వర్ణం
పాటియాలా: ఫెడ రేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత టోర్నమెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీ లో ద్యుతీ స్వర్ణాన్ని గెలుచుకుంది. సోమవారం జరిగిన 100మీ. పరుగును ద్యుతీ అందరికన్నా ముందుగా 11:45 సెకన్లలోనే ముగించి విజేతగా నిలిచింది. కానీ ఈ విభాగంలో ఆసియా చాంపియన్‌షిప్ అర్హత ప్రమాణాన్ని (11:40 సె.) ఆమె అందుకోలేకపోయింది. 100మీ. పరుగులో ఆమె విఫలమైనప్పటికీ... 200మీ. పరుగులో ద్యుతీ ఆసియా చాంపియన్‌షిప్ బెర్తును సాధించింది. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ దగ్గర ద్యుతీ శిక్షణ పొందుతోంది. -
చాంపియన్ ఉజ్వల
సాక్షి, హైదరాబాద్: సెయింట్ పాయ్స్ డిగ్రీ, పీజీ కాలేజి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రన్ ఈవెంట్లో ఎంఎల్ఆర్ కాలేజికి చెందిన ఉజ్వల విజేతగా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఉజ్వల స్వర్ణాన్ని గెలుచుకుంది. శనివారం నిర్వహించిన మహిళల 3 కి.మీ పరుగును ఉజ్వల అందరికంటే ముందుగా 12 నిమిషాల 52.02 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. సెయింట్ ఆన్స్‌కు చెందిన ఎస్. అనురాగ రెండోస్థానాన్ని దక్కించుకుంది. అనురాగ పరుగును 13 నిమిషాల 6:59 సెకన్లలో ముగించింది. రైల్వే కాలేజికి చెందిన మమత లక్ష్యాన్ని 15 నిమిషాల 2:15 సెకన్లలో పూర్తి చేసి మూడోస్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పరుగులో తొలి 10 స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ధ్రువపత్రాలతో పాటు బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాయ్స్ డిగ్రీ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ వేలాంగిణి, ఫిజికల్ ఎడ్యుకేషన్ హెచ్ఓడీ దివ్య శ్రీవాస్తవ, ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కార్యదర్శి ప్రొఫెసర్ బి. సునీల్ కుమార్, యూసీపీఈ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు 9 పతకాలు
అడ్డగుట్ట: జాతీయ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో తెలంగాణ బృందం మొత్తం 9 పతకాలను గెలుచుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శివాని, మైథిలి, మెడ్లీ, రూప, అక్షిత, ఇందుప్రియలతో కూడిన రాష్ట్ర బృందం 6 రజతాలు, 3 కాంస్యాలను సాధించింది. రాష్ట్రం లోని పలు జిల్లాలకు చెందిన ఈ విద్యార్థినులు జాతీయ స్థాయిలో రాణించడం హర్షనీయమని స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ సరళ అన్నారు. లాలాగూడలోని రైల్వే వర్క్‌షాప్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పతకాలు సాధించిన వారిని అభినందించారు. ఈ ప్రదర్శనతో వీరంతా జాతీయ క్యాంపులో చోటు దక్కించుకున్నారని తెలిపారు. శిక్షణలో మెరుగ్గా రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విద్య, వసతితో పాటు మెరుగైన అథ్లెటిక్స్ శిక్షణను అందిస్తుందని పేర్కొన్నారు. -
నిషాంత్, అనికేత్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో తెలంగాణ అథ్లెట్లు 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించారు. సోమ వారం జరిగిన బాలుర 200మీ. పరుగులో హైదరాబాద్‌కు చెందిన అనికేత్ విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 22.62సెకన్లలో చేరుకొని పసిడి పతకాన్ని అందుకున్నాడు. 1000మీ. పరుగులో నిషాంత్ శర్మ స్వర్ణాన్ని సాధించాడు. నిషాంత్ వేగంగా 2నిమిషాల 45.65 సెకన్లలో పరుగును పూర్తి చేశాడు. 100మీ. హర్డిల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన పద్మశ్రీ రజతాన్ని గెలుచుకుంది. బాలుర (12–14) 600మీ. పరుగులో జయశంకర్ భూపాలపల్లికి చెందిన వినోద్ రన్నరప్‌గా నిలిచాడు. బాలికల 400మీ. పరుగులో నందిని (మేడ్చల్), 1000మీ. పరుగులో భాగ్యలక్ష్మి (నాగర్ కర్నూల్) చెరో కాంస్యాన్ని గెలుచుకున్నారు. -
టీమ్ చాంపియన్ హెచ్‌పీఎస్
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట్ జట్టు సత్తా చాటింది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మూడు టీమ్ చాంపియన్‌షిప్ టైటిళ్లను కైవసం చేసుకుంది. అండర్–10 బాలుర, అండర్–12 బాలబాలికల విభాగాల్లో హెచ్‌పీఎస్ జట్లు విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలబాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ బోయిన్పల్లి జట్లు టీమ్ చాంపియన్‌షిప్ టైటిళ్లను సాధించాయి. అండర్–10 బాలికల టీమ్ చాంపియన్‌షిప్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుకు దక్కింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన అండర్–14 బాలికల 4000మీ. పరుగులో చిరెక్ స్కూల్‌కు చెందిన దియా గంగ్వార్ చాంపియన్‌గా నిలిచింది. అదితి సింగ్ (జ్యోతి వీఎస్), ప్రియాంక దాస్ (సెయింట్ ఆండ్రూస్) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. బాలుర విభాగంలో టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), ఎం. అరవింద్ (శాంతినికేతన్) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుపొందగా, సుహాస్ చౌదరి (కేవీ గచ్చిబౌలి) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–14 బాలుర 800మీ. పరుగు: 1. మోహిన్ (టీర్ఈఐఎస్), 2. ఎం. అరవింద్ (శాంతినికేతన్), 3. ఎం. సాయి (ఎన్జేఎంహెచ్ఎస్); బాలికలు: 1. సీహెచ్ రాఘవి (కేవీజీవీ), 2. పి. శ్రేయ (సెయింట్ మార్క్ హైస్కూల్), 3. యువిక (కెన్నడీ వీఎస్). షాట్‌పుట్: 1. ఎం. చంద్ర కుమార్, 2. టి. ఎమ్మాన్యుయేల్ (హెచ్‌పీఎస్), 3. ఎం. సుహాస్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. ధ్రుతి అనీశ్ కుమార్, 2. కె. ఖదీజ, 3. ఎం. వర్ణిక. హైజంప్: 1. ఎం. చంద్రకుమార్, 2. హిమవంత్ కృష్ణ, 3. బి. ప్రణయ్; బాలికలు: 1. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ), 2. ధ్రుతి, 3. సౌమ్య (హెచ్‌పీఎస్). అండర్–12 బాలుర 600మీ. పరుగు: 1. ఎన్. గణేశ్ (ప్రగతి వీఎంఎస్), 2. బి. మహేశ్ (పుడమి ఎన్హెచ్ఎస్), 3. ఎస్. గణేశ్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. బీఎస్ జాష్వి (సెయింట్ ఆండ్రూస్), 2. జి. రితిక (హెచ్‌పీఎస్), 3, ఎ. వైష్ణవి (జీసీఏఏ). హైజంప్: 1. పి. భవదీప్ (ఆర్మీ స్కూల్), 2. సీహెచ్ సిద్ధార్థ్ (సెయింట్ మేరీస్), 3. బి. ఇషాన్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. అదితి సింగ్, 2. ధ్రుతి, 3. సౌమ్య. షాట్‌పుట్: 1. ఆర్. అద్నాన్ (ఎంఎస్బీ), 2. ఎం. ప్రణవ్ (హెచ్‌పీఎస్), 3. ఇడ్రిస్ (ఎంఎస్బీ); బాలికలు: 1. బి. వర్‡్ష రెడ్డి (హెచ్‌పీఎస్), 2. ఎం. అవని (జీసీఏఏ), 3. సి. అవని (జీసీఏఏ). అండర్–10 బాలుర 600మీ. పరుగు: 1. పి. బద్రీనాథ్, 2. కె. దర్శ్ (ఎన్ఏఎస్ఆర్), 3. ఎస్. శ్రుశాంత్ రెడ్డి (శ్రీనిధి హైస్కూల్); బాలికలు: 1. కె. మహేశ్వరి (సాయి చైతన్య హైస్కూల్), 2. ఎం. రేవతి (ప్రగతి హైస్కూల్), 3. బి. శ్రీనిక (శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్). -
లాంగ్‌జంప్ విజేత యోగిత
సాక్షి, హైదరాబాద్: జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బి. యోగిత రాజ్ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో లాంగ్‌జంప్ ఈవెంట్లో స్వర్ణంతో పాటు, 60మీ. పరుగులో కాంస్యాన్ని సాధించింది. బుధవారం జరిగిన అండర్–10 బాలికల లాంగ్‌జంప్‌లో యోగిత 3.07మీ దూరం జంప్ చేసి విజేతగా నిలిచింది. ఇన్సియా ధరివాలా (2.78మీ., ఎంఎస్బీ), ఆర్. మునీర (2.71మీ., ఎంఎస్బీ) వరుసగా రజత కాంస్యాలను సాధించారు. 60మీ. పరుగు ఈవెంట్లో చిరెక్ స్కూల్‌కు చెందిన విభా రావు తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఆమె 9.6సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకాన్ని గెలుచుకుంది. హెచ్‌పీఎస్‌కు చెందిన దియా జైన్ 9.8 సెకన్లలో పరుగును పూర్తి చేసి రజతాన్ని గెలుచుకోగా, యోగిత 10సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యాన్ని దక్కించుకుంది. 200మీ. పరుగు ఈవెంట్లోనూ విభారావు విజేతగా నిలవగా, దియా, మహేశ్వరి తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–10 బాలుర 60మీ. పరుగు: 1. హర్నూర్ సింగ్ (హెచ్‌పీఎస్), 2. టి. వెంకట శ్రేయస్ (ఎన్ఏఎస్ఏఆర్), 3. బద్రీనాథ్ (సాల్వేషన్ హైస్కూల్). 200మీ. పరుగు: 1. హర్నూర్ సింగ్ (హెచ్‌పీఎస్), 2. మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ (సెయింట్ జోసెఫ్), 3. విహాన్ (హెచ్‌పీఎస్). లాంగ్‌జంప్: 1. టి. వెంకట శ్రేయస్ (ఎన్ఏఎస్ఆర్), 2. కె. అమోఘ్, 3. ముర్తజా. అండర్–12 బాలుర 80మీ. పరుగు: 1. అనిరుధ్ బోస్ (సెయింట్ ఆండ్రూస్), 2. సాహిత్ సోమసుందర్ (భారతీయ స్కూల్), 3. బి. ఇషాన్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. ఎ. కృతి (సెయింట్ జోసెఫ్), 2. శ్రేయసి బిశ్వాస్ (ఇంటర్నేషనల్ స్కూల్), 3. ఎం. సుష్మా (డీపీఎస్). 300మీ. పరుగు: 1. అనిరుధ్ (సెయింట్ ఆండ్రూస్), 2. మహేశ్ (పుడమి హైస్కూల్), 3. అయాన్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. కృతి (సెయింట్ జోసెఫ్), 2. భావన (చిరెక్), 3. ఇషిక (చిరెక్). లాంగ్‌జంప్: 1. ఎన్. గణేవ్ (ప్రగతి విద్యామందిర్), 2. బి. శ్రేయస్ రాజు (హెచ్‌పీఎస్), 3. ఎస్. గణేశ్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. శ్రేయసి బిశ్వాస్ (ఇంటర్నేషనల్ స్కూల్), 2. అమూల్య రెడ్డి (హెచ్‌పీఎస్), 3. పి. ప్రహర్షిత (హెచ్‌పీఎస్). అండర్–14 బాలుర 100మీ. పరుగు: 1. ఎ. రేవంత్ (మెరిడియన్ స్కూల్), 2. జె. ప్రణీత్ (సెయింట్ ఆండ్రూస్), 3. నితిన్ (శాంతినికేతన్); బాలికలు: 1. ఆర్. రితిక (సెయింట్ ఆండ్రూస్), 2. కె. నిత్యారెడ్డి (సెయింట్ ఆండ్రూస్), 3. బి. మధులత (బ్రిలియంట్ హైస్కూల్). 200మీ. పరుగు: 1. టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), 2. ఎ. రేవంత్ (మెరిడియన్ స్కూల్), 3. ఇ. నితిన్ (శాంతినికేతన్); బాలికలు: 1. ఆర్. రితిక (సెయింట్ ఆండ్రూస్), 2. దియా (చిరెక్), 3. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ). 400మీ. పరుగు: 1. టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), 2. ఎం. అరవింద్ (శాంతినికేతన్), 3. సుహాస్ (కేవీ గచ్చిబౌలి). లాంగ్‌జంప్: 1. బి. కృష్ణ, 2. జె. ప్రణీత్ (సెయింట్ ఆండ్రూస్), 3. బి. ప్రణయ్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. ప్రియాంక దాస్ (సెయింట్ ఆండ్రూస్), 2. దీక్షిత (హెచ్‌పీఎస్), 3. జి. అలేక్య (జీహెచ్ఎస్). -
ఆరంభం అదిరింది
-
విజేతలు శ్రీకాంత్, దుర్గ
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ (ఆర్‌ఎఫ్‌వైఎస్) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్‌ఎస్) విద్యార్థులు సత్తా చాటారు. గచ్చిబౌలి స్డేడియంలో జరిగిన ఈ టోర్నీలో 17 ఈవెంట్లకు గానూ 8 టైటిళ్లను వారే గెలుచుకున్నారు. గురువారం జరిగిన సీనియర్ బాలుర 800మీ. పరుగులో డి. శ్రీకాంత్ (టీఎస్‌ఎస్‌ఎస్) చాంపియన్‌గా నిలిచాడు. అతను లక్ష్యదూరాన్ని 2 నిమిషాల 0.18 సెకన్లలో పూర్తిచేశాడు. 4/400మీ. రిలేలోనూ శ్రీకాంత్ సభ్యునిగా ఉన్న టీఎస్‌ఎస్‌ఎస్ బృందం విజేతగా నిలిచింది. సీనియర్ బాలికల లాంగ్‌జంప్‌లో వి. దుర్గ (టీఎస్‌ఎస్‌ఎస్) 4.31మీ. దూరం జంప్ చేసి టైటిల్‌ను గెలుపచుకోగా, శ్రీకీర్తి (భారతీయ విద్యాభవన్), కసక్ విజయవర్గీ (సెయింట్ జోసెఫ్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు సీనియర్ బాలురు: 800మీ.: 1. డి. శ్రీకాంత్ (టీఎస్‌ఎస్‌ఎస్), 2. దుర్గా రావు (టీఎస్‌ఎస్‌ఎస్), వంశీకృష్ణ (జయచంద్ర). 4/400మీ. రిలే: 1. టీఎస్‌ఎస్‌ఎస్, 2. భవన్స్ జూ. కాలేజి, 2. విజ్ఞాన్ విద్యాలయ. హైజంప్: 1.పట్లోళ్ల రెడ్డి, 2. సతీశ్, 3. కృతరిత్ పటేల్. ట్రిపుల్ జంప్: 1. శామ్యూల్స్, 2. పట్లోళ్ల రెడ్డి, 3. హృషి. సీనియర్ బాలికలు: 400మీ.: 1. సప్నా రావత్, 2. అంజలి, 3. శ్రీలక్ష్మి. 800మీ.: 1. ధరణి (టీఎస్‌ఎస్‌ఎస్), 2. తరిణి (భవన్స్), 3. జెస్సికా. 4/400మీ.: 1. భవన్స్ అరబిందో, 2. కస్తూర్బా కాలేజి, 3. సెయింట్ ఫ్రాన్సిస్. జూనియర్ బాలురు: 800మీ.: 1. దేముడు నాయుడు (టీఎస్‌ఎస్‌ఎస్), సతీశ్ (టీఎస్‌ఎస్‌ఎస్), ప్రకాశ్ (టీఎస్‌ఎస్‌ఎస్). హైజంప్: 1. గోపాలకృష్ణ (టీఎస్‌ఎస్‌ఎస్), తేజ, 3. కార్తీక్. ట్రిపుల్‌జంప్: 1. కపిల్ సూర్య, 2. సూర్య (డీపీఎస్), 3. పి. వెంకటేశ్. జూనియర్ బాలికలు: 800మీ.: 1. భాగ్యలక్ష్మి (టీఎస్‌ఎస్‌ఎస్), 2. ఎం. భారతి (టీఎస్‌ఎస్‌ఎస్). 4/400మీ. రిలే: 1. సెయింట్ మార్క్స్ బాయ్స్టౌన్, 2. సాయ్ స్కూల్, 3. జిల్లా పరిషత్ హైస్కూల్. లాంగ్ జంప్: 1. టి. అనిత (టీఎస్‌ఎస్‌ఎస్), 2. ఎం. భారతి (టీఎస్‌ఎస్‌ఎస్), 3. మాధురి (జాన్సన్ గ్రామర్ స్కూల్). -
800 మీటర్ల విజేత సుచిత్ర
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ టోర్నమెంట్లో సెయింట్ ఆన్స్‌కు చెందిన సుచిత్ర సత్తా చాటింది. గచ్చిబౌలిలో సోమవారం జరిగిన బాలికల 800 మీటర్ల పరుగు ఈవెంట్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సుచిత్ర లక్ష్యదూరాన్ని 2ని. 21.03 సెకన్లలో పూర్తి చేసింది. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజికి చెందిన ప్రత్యూష పరుగును 2ని. 22.00 సెకన్లలో పూర్తి చేసి రజతాన్ని గెలుచుకోగా, సెయింట్ పాయిస్ అథ్లెట్ బి. కావ్య (2ని. 45.7సె.) కాంస్యాన్ని సాధించింది. బాలుర విభాగంలో ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజికి చెందిన వి. శ్రీనివాస్ పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. అతను పరుగును 2ని. 02.07 సెకన్లలో పూర్తిచేశాడు. హాజి గౌస్ వ్యాయామ విద్య కాలేజికి చెందిన వి. మారుతి (2ని. 05.06సె.) రజతాన్ని, భవన్స్ న్యూ సైన్స్ కాలేజికి చెందిన పి. గోపాల్ (2ని. 05.09సె.) కాంస్యాన్ని సాధించారు. ఈ టోర్నీని ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు: మహిళలు: షాట్‌పుట్: 1. కె. నాగ అనూష, 2. మానస, 3. జె. సంధ్య. 200 మీ. పరుగు: 1. జి. నిత్య, 2. పి.సుశ్మితా రాణి. 400 మీ. పరుగు: 1. విశాలాక్షి, 2. హఫీజా బేగం, 3. చందన. 5000 మీ.: 1. బి. సంధ్య, 2. ఆర్. కలైవాణి, 3. మేఘన. డిస్కస్ త్రో: 1. మానస, 2. అంబిక, 3. యాస్మిన్. 4/400మీ. రిలే: 1. సెయింట్ ఆన్స్, 2. నిజాం కాలేజి, 3. జీసీపీఈ. పురుషులు: 200 మీ: 1. ఆమ్లాన్ బొర్గొహెన్, 2. పి. యశ్వంత్ సాయి, 3. జె. శ్రవణ్. షాట్‌పుట్: 1. అంకిత్, 2. సన్నీ, 3. పీఎన్ సాయి కుమార్. లాంగ్‌జంప్: 1. పి. శ్రీకాంత్, 2. సీహెచ్ వినోద్ కుమార్, 3. బి. రాము. 400 మీ. హర్డిల్స్: 1. పి. గోపాల్, 2. కె. అజయ్ కుమార్, 3. ఎం. మధు. 5000 మీ. : 1. బి. రమేశ్, 2. కె. నరేశ్, 3. సయ్యద్ షాబాజ్ అలీ. హైజంప్: 1. ఆర్. ప్రకాశ్, 2. పి. శ్రీకాంత్, 3. అక్షయ్. 4/400మీ. రిలే: 1. నిజాం కాలేజి, 2. జీసీపీఈ, 3. ఓయూ సైన్స్ కాలేజి (సైఫాబాద్). -
జాతీయ అథ్లెటిక్స్‌కు ఖమ్మం విద్యార్థిని
సాక్షి, ఖమ్మం : పట్టణంలోని గురుకుల పాఠశాల విద్యార్థిని గుర్రం మానస జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మెదక్ పట్టణంలో నిర్వహించిన 63 వ రాష్ట్ర స్థాయి అండర్ 17 అథ్లెటిక్ పోటీలలో విశేష ప్రతిభకనబర్చడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. మూడు కిలోమీటర్ల నడక పోటీ విభాగంలో మానస ప్రధమ స్థానంలో నిలిచి, బంగారు పథకం సాధించారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడుకు చెందిన గుర్రం మానస.. ఖమ్మం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా సుమారు ఐదు వందల విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. షాట్ పుట్, లాంగ్ జంప్, మూడు కిలోమీటర్ల నడక పోటీలలో ఖమ్మం కొత్తగూడెంజిల్లాలకు చెందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీలకు మానస ఎంపిక కావడంపై కుటుంబీకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
ఓవరాల్ చాంప్ సెయింట్ ఆండ్రూస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం (హెచ్‌డీఏఏ) ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 22 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సీఆర్పీఎఫ్ స్కూల్‌కు ఫెయిర్ ప్లే’ అవార్డు లభించింది. మొత్తం ఈ పోటీల్లో 17 స్కూళ్లకు చెందిన 300 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో హెచ్‌డీఏఏ అధ్యక్షుడు రాజేశ్ కుమార్, కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, మాజీ అథ్లెట్ లావణ్య రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందించారు. శుక్రవారం జరిగిన వివిధ పోటీల్లో విజేతల వివరాలు షాట్‌పుట్ (సీనియర్ బాలురు) 1. డానీ (10. 92మీ. జాన్సన్ గ్రామర్ స్కూల్), 2. సన్ని (10.02 మీ., సీఆర్పీఎఫ్), 3. ప్రభాకర్ సింగ్ (8.81 మీ., సీఆర్పీఎఫ్). జూనియర్ బాలురు 1. అజీజ్ (9.75 మీ., ఎంఎస్బీ స్కూల్), 2. ముకేశ్ (9.33 మీ., సీఆర్పీఎఫ్), 3. సిద్ధాంత్ (9.08మీ., ఆర్మీ పబ్లిక్ స్కూల్). సీనియర్ బాలికలు 1. త్రిష (7.10మీ., సీఆర్పీఎఫ్), 2. సారుు నేహా (7.09మీ., సెయింట్ ట్ ఆండ్రూస్), 3. శ్రేయ (6.58మీ., సెయింట్ మైకెల్స్). జూనియర్ బాలికలు 1. అహిగేల్ (6.94మీ., సెయింట్ ఆండ్రూస్), 2. దామిని (6.32మీ., సీఆర్పీఎఫ్), జ్యోతి (5.22మీ., ఆర్మీ పబ్లిక్ స్కూల్). లాంగ్ జంప్ (సీనియర్ బాలురు) 1.సాత్విక్ (డీఆర్ఎస్, 4.91మీ.), 2. సన్ని (సీఆర్పీఎఫ్, 4.89మీ.), 3. భార్గవ్ (సెయింట్ ఆండ్రూస్, 4.66మీ.). జూనియర్ బాలురు 1. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 4.76మీ.), 2.వైష్ణవ్ రాజ్ (భవన్స, 4.48మీ.), 3. డి.సాత్విక్ (ఆర్మీ పబ్లిక్ స్కూల్, 4.18మీ.) సీనియర్ బాలికలు 1. ఎన్. అపూర్వ (భవన్స, 3.98మీ.), 2. సాక్షి (సీఆర్పీఎఫ్, 3.96మీ.), 3. శరణ్య (భవన్స, 3.95మీ.). జూనియర్ బాలికలు 1. నిత్య (లిటిల్ ఫ్లవర్, 3.67మీ.), 2. లహరి (సీఆర్పీఎఫ్, 3.54మీ.), 3. భవాణి (భవన్స, 3.51మీ.) 100మీ.పరుగు (సీనియర్ బాలురు) 1.రామకృష్ణ (భవన్స, 12.1సె.), 2. నితీశ్ (సెయింట్ ఆండ్రూస్, 12.3సె.), 3. అలెన్ (సెరుుంట్ ఆండ్రూస్, 12.07సె). సీనియర్ బాలికలు 1. కృతిక (సెయింట్ఆండ్రూస్, 13.8 సె.), 2. రియా (సెయింట్ ఆండ్రూస్, 14.1సె.), 3. సాక్షి (సీఆర్పీఎఫ్, 14.4సె.) జూనియర్ బాలురు 1. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 12.3సె.), 2.నితిన్ (సీఆర్పీఎఫ్, 12.6సె.), 3. సొహైల్ (సీఆర్పీఎఫ్, 12.9సె.) జూనియర్ బాలికలు 1. పారుల్ (సెయింట్ ఆండ్రూస్, 14.4సె.), 2. రియా (సెయింట్ ఆండ్రూస్, 15.3సె., 3. చిత్ర (సీఆర్పీఎఫ్, 15.6సె.) 200మీ. పరుగు (సీనియర్ బాలురు) 1.నితీశ్ (సెయింట్ ఆండ్రూస్, 25.3సె.), 2. ఆదిత్య (భవన్స, 25.6సె.), 3. రామకృష్ణ (భవన్స, 25.9సె.) జూనియర్ బాలురు 1. నితిన్ (సీఆర్పీఎఫ్, 27.5సె.), 2. హర్షవర్ధన్ (లిటిల్ ఫ్లవర్, 27.9సె.), 3. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 28.2సె.) జూనియర్ బాలికలు 1.నిత్య (సెయింట్ ఆండ్రూస్, 32.8సె.), 2. ప్రియాంక (సెయింట్ ఆండ్రూస్, 33.1సె.), 3. చిత్ర (సీఆర్పీఎఫ్, 33.4సె.) సీనియర్ బాలికలు 1. సుహాలి (సెయింట్ ఆండ్రూస్, 31.2 సె.), 2. కృతిక (సెయింట్ ఆండ్రూస్, 31.8సె.), 3. సౌమ్య (లిటిల్ ఫ్లవర్, 32.1సె.) -
అథ్లెట్ల పోరాటం
ఎల్లెడలా ఆనందం నవోదయలో ముగిసిన క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్స్ అగ్రస్థానంలో మెదక్ ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్ రీజియన్ టోర్నీకి 16 మంది విద్యార్థులు ఎంపిక వర్గల్:ఒకరికి మరొకరు స్ఫూర్తి.. విజయమే అంతిమ లక్ష్యం..హోరాహోరీ పోరాటం..అరుపులు, కేరింతలు, హర్షాతిరేకాలు, చప్పట్లు.. రెండ్రోజుల పాటు వివిధ జిల్లాల అథ్లెట్ల విన్యాసాలతో వర్గల్ నవోదయ స్టేడియం మార్మోగింది. క్రీడాభిమానులకు అంతులేని ఆనందం పంచింది. విజయవంతంగా కొనసాగిన క్లస్టర్ స్థాయి అథ్లెటిక్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ఆతిథ్య మెదక్ జిల్లాతోపాటు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నవోదయ విద్యార్థులు క్రీడాస్ఫూర్తి చాటుతూ ఆటలపోటీల్లో తమ ప్రతిభ పాటవాలు ప్రదర్శించారు. అథ్లెటిక్స్ పోటీల్లో ఆతిథ్య మెదక్ జిల్లా వర్గల్ నవోదయ విద్యార్థులు 21 ఈవెంట్స్‌లో విజయాలు నమోదు చేసి, క్లస్టర్ మీట్లో అగ్రస్థానానికి ఎగబాకారు. 13 ఈవెంట్స్‌లో గెలుపొందిన మహబూబ్‌నగర్ జిల్లా నవోదయ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. 11 అంశాల్లో వరంగల్ నవోదయ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా నవోదయ 8, నల్గొండ జిల్లా 8 చొప్పున, ఈస్ట్ గోదావరి 3, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నవోదయ విద్యార్థులు ఒకటేసి క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచారు. క్లస్టర్ టోర్నీలో ‘వర్గల్’ హవా క్లస్టర్ టోర్నీలో ఆతిధ్య వర్గల్ నవోదయ విద్యార్థులు చక్కని పోరాట పటిమ ప్రదర్శించారు. మొత్తం 15 మంది బాలికలు, 15 మంది బాలురు బరిలో దిగారు. ఇందులో తొమ్మిది మంది బాలికలు, ఏడుగురు బాలురు విజయాలు నమోదు చేసి టోర్నీ జరిగిన రెండు రోజుల్లోను తమ ఆధిక్యత చాటారు. లాంగ్‌జంప్, హర్డిల్స్, 100 మీటర్ల పరుగులో యూ. స్వర్ణలత ప్రథమ స్థానంలో నిలిచింది. ఎల్ స్నేహ 1500 మీటర్లు, 3 కిలోమీటర్ల పరుగులో విజేతగా నిలిచింది. షాట్‌పుట్‌లో కె. పవిత్ర, 1500 మీటర్ల పరుగులో ఎస్ శ్రావణి, 3 కిలోమీటర్ల పరుగులో డి. ప్రియాంక, జావెలిన్ త్రోలో జి శ్రావ్య, డిస్కస్ త్రో ఎండీ ముబీన్, హామర్‌త్రోలో కే రోషిణి, 400 మీటర్ల హర్డిల్స్‌లో ఎన్ పూజితలు విజేతలుగా నిలిచి రీజినల్ మీట్‌కు ఎంపికయ్యారు. అదేవిధంగా 400 మీటర్లు, 800 మీటర్ల పరుగులో యూ చంద్రశేఖర్, 1500 మీటర్లు, 3 కిలోమీటర్ల పరుగులో పీ నవీన్‌రెడ్డిలు విజయాలు నమోదు చేసి రీజినల్ టోర్నీలో తమ పేరు ఖాయం చేసుకున్నారు. 5 కిలోమీటర్ల పరుగులో ఆర్ చైతన్య ప్రసాద్, 200 మీటర్ల పరుగులో జి రాజేష్, 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆర్ విజయ్, 100 మీటర్ల పరుగులో డీ గణేష్, 5 కిలోమీటర్ల క్రాస్కంట్రిలో జీ రాజ్ కుమార్‌లు ప్రథమ స్థానంలో నిలిచారు. మొత్తం 21 ఈవెంట్లలో ఆతిథ్య నవోదయ విద్యార్థుల హవా కొనసాగింది. -
23న రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ మీట్
జింఖానా, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా అమెచ్యూర్ అథ్లెటిక్స్ సంఘం ఈనెల 23న వార్షిక అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనుంది. ఈ పోటీలు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహిస్తారు. బాలబాలికల అండర్-14 విభాగంలో 100, 600 మీటర్ల పరుగు పందెం, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఈవెంట్లను, అండర్-16 విభాగంలో 100, 200, 400, 1000 మీటర్ల పరుగు పందెం, 100 మీటర్ల హర్డిల్స్, హై జంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో ఈవెంట్లను ఈ పోటీల్లో నిర్వహిస్తారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ఏప్రిల్ 25వ తేదీ నుంచి హరిద్వార్‌లో జరగబోయే జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఈ మీట్లో పాల్గొనాలనుకునే వారు మరిన్ని వివరాలకు స్టాన్లీ జోన్స్ (9346616266), సాయి రెడ్డి (8686563169)లను సంప్రదించాలి.