పాటియాలా: ఫెడ రేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నమెంట్‌లో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత టోర్నమెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీ లో ద్యుతీ స్వర్ణాన్ని గెలుచుకుంది. సోమవారం జరిగిన 100మీ. పరుగును ద్యుతీ అందరికన్నా ముందుగా 11:45 సెకన్లలోనే ముగించి విజేతగా నిలిచింది.
కానీ ఈ విభాగంలో ఆసియా చాంపియన్‌షిప్ అర్హత ప్రమాణాన్ని (11:40 సె.) ఆమె అందుకోలేకపోయింది. 100మీ. పరుగులో ఆమె విఫలమైనప్పటికీ... 200మీ. పరుగులో ద్యుతీ ఆసియా చాంపియన్‌షిప్ బెర్తును సాధించింది. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ దగ్గర ద్యుతీ శిక్షణ పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment