జింఖానా, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా అమెచ్యూర్ అథ్లెటిక్స్ సంఘం ఈనెల 23న వార్షిక అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనుంది. ఈ పోటీలు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహిస్తారు. బాలబాలికల అండర్-14 విభాగంలో 100, 600 మీటర్ల పరుగు పందెం, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఈవెంట్లను, అండర్-16 విభాగంలో 100, 200, 400, 1000 మీటర్ల పరుగు పందెం, 100 మీటర్ల హర్డిల్స్, హై జంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో ఈవెంట్లను ఈ పోటీల్లో నిర్వహిస్తారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ఏప్రిల్ 25వ తేదీ నుంచి హరిద్వార్‌లో జరగబోయే జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఈ మీట్‌లో పాల్గొనాలనుకునే వారు మరిన్ని వివరాలకు స్టాన్లీ జోన్స్ (9346616266), సాయి రెడ్డి (8686563169)లను సంప్రదించాలి.
23న రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ మీట్
Published Thu, Feb 20 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement