16 ఏళ్ల రికార్డు బద్దలు  | Breaking the 16 year old record | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల రికార్డు బద్దలు 

Published Mon, Mar 18 2024 1:30 AM | Last Updated on Mon, Mar 18 2024 1:30 AM

Breaking the 16 year old record - Sakshi

పురుషుల 10,000 మీటర్ల విభాగంలో గుల్‌వీర్‌ ఘనత

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, భారత అథ్లెట్‌ గుల్‌వీర్‌ సింగ్‌ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ‘ద టెన్‌’ అథ్లెటిక్స్‌ మీట్‌లో 25 ఏళ్ల గుల్‌వీర్‌ ఈ ఘనత సాధించాడు.

గుల్‌వీర్‌ తాను పాల్గొన్న హీట్స్‌లో 10,000 మీటర్లను 27 నిమిషాల 41.81 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 16 ఏళ్లుగా సురేందర్‌ సింగ్‌ (28ని:02.89 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును గుల్‌వీర్‌ తిరగరాశాడు. గుల్‌వీర్‌ కొత్త జాతీయ రికార్డు సృష్టించినా పారిస్‌ ఒలింపిక్స్‌ (27 నిమిషాలు) అర్హత ప్రమాణ సమయాన్ని అధిగమించలేకపోయాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement