సాక్షి, హైదరాబాద్: సెయింట్ పాయ్స్ డిగ్రీ, పీజీ కాలేజి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రన్ ఈవెంట్‌లో ఎంఎల్‌ఆర్ కాలేజికి చెందిన ఉజ్వల విజేతగా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఉజ్వల స్వర్ణాన్ని గెలుచుకుంది. శనివారం నిర్వహించిన మహిళల 3 కి.మీ పరుగును ఉజ్వల అందరికంటే ముందుగా 12 నిమిషాల 52.02 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. సెయింట్ ఆన్స్‌కు చెందిన ఎస్. అనురాగ రెండోస్థానాన్ని దక్కించుకుంది. అనురాగ పరుగును 13 నిమిషాల 6:59 సెకన్లలో ముగించింది. రైల్వే కాలేజికి చెందిన మమత లక్ష్యాన్ని 15 నిమిషాల 2:15 సెకన్లలో పూర్తి చేసి మూడోస్థానంలో నిలిచింది.
పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్‌బీ లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పరుగులో తొలి 10 స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ధ్రువపత్రాలతో పాటు బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాయ్స్ డిగ్రీ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ వేలాంగిణి, ఫిజికల్ ఎడ్యుకేషన్ హెచ్‌ఓడీ దివ్య శ్రీవాస్తవ, ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కార్యదర్శి ప్రొఫెసర్ బి. సునీల్ కుమార్, యూసీపీఈ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment