సాక్షి, హైదరాబాద్: ఏఎస్‌ఐఎస్‌ఈ తెలంగాణ, ఏపీ రీజినల్ స్పోర్ట్స్, గేమ్స్ అథ్లెటిక్స్ మీట్‌లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి సీహెచ్ పద్మశ్రీ, గీతాంజలికి చెందిన మనో వెంకట్ సత్తా చాటారు. గచి్చ»ౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్–17 బాలికల 100మీ. పరుగులో పద్మశ్రీ విజేతగా నిలిచింది. ఆమె పరుగును 12.91 సెకన్లలో పూర్తిచేసింది. శ్రీసాయి పబ్లిక్ స్కూల్ (పటాన్‌చెరు)కు చెందిన శ్రీవర్షిణి (13.82 సె.), పి. అంబిక (14.03 సె.) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. అండర్–19 బాలుర 100మీ. పరుగును మనో వెంకట్ 11.7 సెకన్లలో ముగించి పసిడిని సొంతం చేసుకున్నాడు. అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు వంశీ (11.8సె.), విష్ణు రేవంత్‌రెడ్డి (12.03సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్‌ఎం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
అండర్–19 బాలికల 800మీ. పరుగు: 1. నిధి (సెయింట్ జోసెఫ్), 2. నైనితరావు (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. రుచిత (అభ్యాస); బాలురు: 1. వీఎస్ విన్సెంట్ (షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్), 2. సాకేత్ రెడ్డి (అభ్యాస స్కూల్), 3. దినేశ్ (షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్).
అండర్–14 బాలికల లాంగ్ జంప్: 1. కృతి (సెయింట్ జోసెఫ్), 2. గయాన (ఎమ్మాస్ స్విస్ స్కూల్), 3. ప్రహర్షిత (హెచ్‌పీఎస్, బేగంపేట్); అండర్–17 బాలికలు: 1. పద్మశ్రీ (సెయింట్ జోసెఫ్), 2. పి. అంబిక (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 3. ఇందు వర్షిణి (ఎమ్మాస్ స్కూల్); అండర్–19 బాలికలు: 1. రాగవర్షిణి, 2. జోహిత (సెయింట్ జోసెఫ్), 3. సలోమి ప్రహర్షిత (సెయింట్ జార్జ్ స్కూల్).
అండర్–14 బాలుర షాట్‌పుట్: 1. తిరుపతి, 2. అక్షయ్ (ఎమ్మాస్ స్విస్ స్కూల్), 3. అజయ్ వర్దన్‌రెడ్డి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్); అండర్–17 బాలురు: 1. సంజయ్, 2. పవన్ తేజ్ (ఎమ్మాస్ స్విస్ స్కూల్), 3. వీర సాయి (ఫ్యూచ ర్‌కిడ్స్); అండర్–19 బాలురు: 1. అరుణ్ (ఎమ్మాస్ స్కూల్), 2. అశోక్ (ది పీపల్ గ్రోవ్ స్కూల్), 3. అక్షయ్ (శ్రీ అరబిందో స్కూల్).
Comments
Please login to add a commentAdd a comment