జాతీయ అథ్లెటిక్స్‌కు ఖమ్మం విద్యార్థిని | Khammam students to participate Nationa level competetion | Sakshi
Sakshi News home page

జాతీయ అథ్లెటిక్స్‌కు ఖమ్మం విద్యార్థిని

Published Mon, Oct 23 2017 8:39 PM | Last Updated on Mon, Oct 23 2017 8:41 PM

Khammam students to participate Nationa level competetion

జిల్లా జట్టుతో మానస(ఇన్‌సెట్‌లో ఫైల్‌ ఫొటో)

సాక్షి, ఖమ్మం : పట్టణంలోని గురుకుల పాఠశాల విద్యార్థిని గుర్రం మానస జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మెదక్‌ పట్టణంలో నిర్వహించిన 63 వ రాష్ట్ర స్థాయి అండర్ 17 అథ్లెటిక్ పోటీలలో విశేష ప్రతిభకనబర్చడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. మూడు  కిలోమీటర్ల నడక పోటీ విభాగంలో మానస ప్రధమ స్థానంలో నిలిచి, బంగారు పథకం సాధించారు.

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడుకు చెందిన గుర్రం మానస.. ఖమ్మం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా సుమారు ఐదు వందల విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. షాట్ పుట్, లాంగ్ జంప్, మూడు కిలోమీటర్ల నడక పోటీలలో ఖమ్మం కొత్తగూడెంజిల్లాలకు చెందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీలకు మానస ఎంపిక కావడంపై కుటుంబీకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement