
క్రికెట్ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది

ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్‌లో జట్టు కెప్టెన్ అఖిల్ (Akhil Akkineni)తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి కూడా హాజరయ్యారు.








