సాక్షి, హైదరాబాద్: జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బి. యోగిత రాజ్ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో లాంగ్‌జంప్ ఈవెంట్‌లో స్వర్ణంతో పాటు, 60మీ. పరుగులో కాంస్యాన్ని సాధించింది. బుధవారం జరిగిన అండర్–10 బాలికల లాంగ్‌జంప్‌లో యోగిత 3.07మీ దూరం జంప్ చేసి విజేతగా నిలిచింది. ఇన్సియా ధరివాలా (2.78మీ., ఎంఎస్‌బీ), ఆర్. మునీర (2.71మీ., ఎంఎస్‌బీ) వరుసగా రజత కాంస్యాలను సాధించారు.
60మీ. పరుగు ఈవెంట్‌లో చిరెక్ స్కూల్‌కు చెందిన విభా రావు తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఆమె 9.6సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకాన్ని గెలుచుకుంది. హెచ్‌పీఎస్‌కు చెందిన దియా జైన్ 9.8 సెకన్లలో పరుగును పూర్తి చేసి రజతాన్ని గెలుచుకోగా, యోగిత 10సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యాన్ని దక్కించుకుంది. 200మీ. పరుగు ఈవెంట్‌లోనూ విభారావు విజేతగా నిలవగా, దియా, మహేశ్వరి తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
అండర్–10 బాలుర 60మీ. పరుగు: 1. హర్నూర్ సింగ్ (హెచ్‌పీఎస్), 2. టి. వెంకట శ్రేయస్ (ఎన్‌ఏఎస్‌ఏఆర్), 3. బద్రీనాథ్ (సాల్వేషన్ హైస్కూల్).
200మీ. పరుగు: 1. హర్నూర్ సింగ్ (హెచ్‌పీఎస్), 2. మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ (సెయింట్ జోసెఫ్), 3. విహాన్ (హెచ్‌పీఎస్).
లాంగ్‌జంప్: 1. టి. వెంకట శ్రేయస్ (ఎన్‌ఏఎస్‌ఆర్), 2. కె. అమోఘ్, 3. ముర్తజా.
అండర్–12 బాలుర 80మీ. పరుగు: 1. అనిరుధ్ బోస్ (సెయింట్ ఆండ్రూస్), 2. సాహిత్ సోమసుందర్ (భారతీయ స్కూల్), 3. బి. ఇషాన్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. ఎ. కృతి (సెయింట్ జోసెఫ్), 2. శ్రేయసి బిశ్వాస్ (ఇంటర్నేషనల్ స్కూల్), 3. ఎం. సుష్మా (డీపీఎస్).
300మీ. పరుగు: 1. అనిరుధ్ (సెయింట్ ఆండ్రూస్), 2. మహేశ్ (పుడమి హైస్కూల్), 3. అయాన్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. కృతి (సెయింట్ జోసెఫ్), 2. భావన (చిరెక్), 3. ఇషిక (చిరెక్).
లాంగ్‌జంప్: 1. ఎన్. గణేవ్ (ప్రగతి విద్యామందిర్), 2. బి. శ్రేయస్ రాజు (హెచ్‌పీఎస్), 3. ఎస్. గణేశ్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. శ్రేయసి బిశ్వాస్ (ఇంటర్నేషనల్ స్కూల్), 2. అమూల్య రెడ్డి (హెచ్‌పీఎస్), 3. పి. ప్రహర్షిత (హెచ్‌పీఎస్).
అండర్–14 బాలుర 100మీ. పరుగు: 1. ఎ. రేవంత్ (మెరిడియన్ స్కూల్), 2. జె. ప్రణీత్ (సెయింట్ ఆండ్రూస్), 3. నితిన్ (శాంతినికేతన్); బాలికలు: 1. ఆర్. రితిక (సెయింట్ ఆండ్రూస్), 2. కె. నిత్యారెడ్డి (సెయింట్ ఆండ్రూస్), 3. బి. మధులత (బ్రిలియంట్ హైస్కూల్).
200మీ. పరుగు: 1. టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), 2. ఎ. రేవంత్ (మెరిడియన్ స్కూల్), 3. ఇ. నితిన్ (శాంతినికేతన్); బాలికలు: 1. ఆర్. రితిక (సెయింట్ ఆండ్రూస్), 2. దియా (చిరెక్), 3. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ).
400మీ. పరుగు: 1. టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), 2. ఎం. అరవింద్ (శాంతినికేతన్), 3. సుహాస్ (కేవీ గచ్చిబౌలి).
లాంగ్‌జంప్: 1. బి. కృష్ణ, 2. జె. ప్రణీత్ (సెయింట్ ఆండ్రూస్), 3. బి. ప్రణయ్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. ప్రియాంక దాస్ (సెయింట్ ఆండ్రూస్), 2. దీక్షిత (హెచ్‌పీఎస్), 3. జి. అలేక్య (జీహెచ్‌ఎస్).
Comments
Please login to add a commentAdd a comment