పారిస్‌ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌ దూరం  | Sreeshankar away from Paris Olympics | Sakshi
Sakshi News home page

పారిస్‌ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌ దూరం 

Published Fri, Apr 19 2024 4:22 AM | Last Updated on Fri, Apr 19 2024 4:22 AM

Sreeshankar away from Paris Olympics - Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ లాంగ్‌జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ మోకాలి గాయంతో పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్‌ సమయంలో శ్రీశంకర్‌ మోకాలికి గాయమైంది. ఈ గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించడంతో ఈ ఏడాది మొత్తం శ్రీశంకర్‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు.

కేరళకు చెందిన 25 ఏళ్ల శ్రీశంకర్‌ గత ఏడాది ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 8.37 మీటర్ల దూరం దూకి రజత పతకం సాధించాడు. ఈ క్రమంలో పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ను కూడా సంపాదించాడు. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం, 2023 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన శ్రీశంకర్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడినా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement