బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే 3 రజతాలు (మెన్స్ లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్, మహిళల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌సాబ్లే), ఓ కాంస్యం (పురుషుల హై జంప్‌లో తేజస్విన్ శంకర్) సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో రెండు పతకాలు చేజిక్కించుకున్నారు.
పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఎల్దోస్ పాల్ స్వర్ణం (మూడో ప్రయత్నంలో 17.03 మీటర్లు), ఇదే ఈవెంట్‌లో అబ్దుల్లా అబూబకర్ రజత పతకం (ఐదో ప్రయత్నంలో 17.02 మీటర్లు) సాధించి కామన్‌వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. వీరిద్దరు ఒకే ఈవెంట్‌లో గోల్డ్, సిల్వర్ సాధించడంతో భారత్ కామన్‌వెల్త్ క్రీడల్లో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. గతంలో ఈ క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో ఒకే ఈవెంట్‌లో భారత్ ఎన్నడూ స్వర్ణం, రజతం సాధించింది లేదు.
ఇదే ఈవెంట్‌లో భారత్ కాంస్యం గెలిచే అవకాశాన్ని కూడా తృటిలో చేజార్చుకుంది. ప్రవీన్ చిత్రవేళ్ (16.89మీ, నాలుగో స్థానం) 0.03 మీటర్ల మార్జిన్‌తో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. బెర్ముడాకు చెందిన జా-నై పెరిన్‌చీఫ్ 16.92 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం సాధించాడు. ఎల్దోస్ పాల్ స్వర్ణం (కామన్‌వెల్త్ క్రీడల చరిత్రలో ఆరో స్వర్ణం), అబ్దుల్లా రజతంతో ప్రస్తుత క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరగా, ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 45కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు) చేరింది.
ఇదిలా ఉంటే, కామన్‌వెల్త్ క్రీడల పదో రోజు భారత్ వరుసగా స్వర్ణ పతకాలు సాధిస్తుంది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పతకాలు సాధించారు. తాజాగా ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్ పాల్ కూడా స్వర్ణం సాధించడంతో ఇవాళ భారత్ ఖాతాలో చేరిన స్వర్ణాల సంఖ్య మూడుకు చేరింది. ఇక ఇదే రోజు భారత్ మరో పతకం కూడా సాధించింది. మహిళల హాకీలో భారత్.. న్యూజిలాండ్‌పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది.
చదవండి: మరో పసిడి పంచ్.. బాక్సింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
Comments
Please login to add a commentAdd a comment