Triple Jumper
-
చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లు.. ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం, రజతం మనవే
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే 3 రజతాలు (మెన్స్ లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్, మహిళల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌సాబ్లే), ఓ కాంస్యం (పురుషుల హై జంప్‌లో తేజస్విన్ శంకర్) సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో రెండు పతకాలు చేజిక్కించుకున్నారు. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఎల్దోస్ పాల్ స్వర్ణం (మూడో ప్రయత్నంలో 17.03 మీటర్లు), ఇదే ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్ రజత పతకం (ఐదో ప్రయత్నంలో 17.02 మీటర్లు) సాధించి కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. వీరిద్దరు ఒకే ఈవెంట్లో గోల్డ్, సిల్వర్ సాధించడంతో భారత్ కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. గతంలో ఈ క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో ఒకే ఈవెంట్లో భారత్ ఎన్నడూ స్వర్ణం, రజతం సాధించింది లేదు. ఇదే ఈవెంట్లో భారత్ కాంస్యం గెలిచే అవకాశాన్ని కూడా తృటిలో చేజార్చుకుంది. ప్రవీన్ చిత్రవేళ్ (16.89మీ, నాలుగో స్థానం) 0.03 మీటర్ల మార్జిన్‌తో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. బెర్ముడాకు చెందిన జా-నై పెరిన్‌చీఫ్ 16.92 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం సాధించాడు. ఎల్దోస్ పాల్ స్వర్ణం (కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఆరో స్వర్ణం), అబ్దుల్లా రజతంతో ప్రస్తుత క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరగా, ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 45కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు) చేరింది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్ వరుసగా స్వర్ణ పతకాలు సాధిస్తుంది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పతకాలు సాధించారు. తాజాగా ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్ పాల్ కూడా స్వర్ణం సాధించడంతో ఇవాళ భారత్ ఖాతాలో చేరిన స్వర్ణాల సంఖ్య మూడుకు చేరింది. ఇక ఇదే రోజు భారత్ మరో పతకం కూడా సాధించింది. మహిళల హాకీలో భారత్.. న్యూజిలాండ్‌పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. చదవండి: మరో పసిడి పంచ్.. బాక్సింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణం -
World U-20 Athletics Championships: భారత్‌కు మరో పతకం
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వ తిరుమారన్ రజత పతకం గెల్చుకున్నాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 4X400 మీటర్ల రిలేలో సుమ్మీ, ప్రియా హబ్బతనహల్లి మోహన్, కుంజ రజిత, రూపల్ చౌదరీలతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు ఈ టోర్నీలో 4గX400 మిక్స్డ్ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్యం లభించాయి. -
ట్రిపుల్ జంప్ ఫైనల్లోకి ఎల్డోజ్ పౌల్.. తొలి భారత అథ్లెట్‌గా..!
అమెరికాలోని యుజీన్ వేదికగా జరగుతోన్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ట్రిపుల్ జంప్ ఈవెంట్లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో 16.68 మీటర్ల దూకి ఎల్డోస్ పాల్ ఫైనల్లో అడుగు పెట్టాడు. తద్వారా ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ట్రిపుల్ జంప్ విబాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌గా ఎల్డోస్ పాల్ చరిత్ర సృష్టించాడు. ఇక ఇదే ఈవెంట్లో పాల్గొన్న భారత అథ్లెట్లు ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యారు. ఇక ఆదివారం జరగనున్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎల్డోస్ పాల్ తలపడనున్నాడు. మరో వైపు శుక్రవారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా,రోహిత్ యాదవ్ ఫైనల్‌కు చేరుకున్నారు. చదవండి:World Athletics Championships 2022:. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా -
డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్‌హామ్‌కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్‌లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్‌తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
World Athletics Championship: ‘ట్రిపుల్’ ధమాకా
యుజీన్ (అమెరికా): వెనిజులా స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత యులిమర్ రోజస్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ రోజస్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రోజస్ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్), 2019 (దోహా)లలో కూడా ఆమె కనకపు పతకాన్ని అందుకుంది. ట్రిపుల్ జంప్‌లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. ‘రికార్డు స్థాయిలో ఎక్కువ దూరం దూకాలనే బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదు. అయితే తాజా ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మళ్లీ పోటీలో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. పెద్దగా సన్నాహకాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను. గాయాలతో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ గెలవగలిగాను’ అని రోజస్ వ్యాఖ్యానించింది. సబ్లేకు 11వ స్థానం పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
అర్పిందర్‌కు కాంస్యం
ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్): అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) కాంటినెంటల్ కప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అర్పిందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ 16.59 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఈటెను 80.24 మీటర్లు విసిరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
రంజిత్ మహేశ్వరికి దక్కని అవార్డు
న్యూఢిల్లీ / కొచ్చి: ఇంకొన్ని గంటలైతే అర్జున అవార్డును అందుకుంటాననే ఆనందంలో ఉన్న ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరికి షాక్ తగిలింది. ఐదేళ్ల క్రితం డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడనే కారణంతో అవార్డుల జాబితా నుంచి రంజిత్ పేరును తాత్కాలికంగా తొలగించారు. ఈ విషయాన్ని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) అధికారులు రంజిత్‌కు తెలిపారు. విచారణలో సచ్ఛీలుడిగా బయటపడితే తనకు ఈ అవార్డు దక్కుతుందని చెప్పారు. మరోవైపు సోమవారం వరకు వేచి చూడాల్సిందిగా క్రీడల మంత్రి తనతో చెప్పినట్టు రంజిత్ చెప్పాడు. ఇదిలావుండగా రంజిత్ డోపింగ్ వ్యవహారంపై క్రీడా మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. సోమ లేదా మంగళవారం వరకు నివేదిక వచ్చే అవకాశం ఉందని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అవార్డుల బహూకరణ ముందు రంజిత్ విషయంలో ఇలా జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. 2008లో కొచ్చిలో జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నిర్వహించిన డోప్ టెస్టులో రంజిత్ విఫలమయ్యాడు.