
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అథ్లెట్ కె.ప్రేమ్ కుమార్ స్వర్ణంతో మెరిశాడు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ మీట్‌లో అతను 110 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం సాధించాడు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో అతను పోటీని అందరికంటే ముందుగా 13.90 సెకన్లలో పూర్తి చేశాడు. సీనియర్ కోచ్, ‘ద్రోణాచార్య’ అవార్డీ నాగపురి రమేశ్ వద్ద ప్రేమ్‌కుమార్ శిక్షణ పొందాడు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు తలపడే ఈ అథ్లెటిక్స్‌లో పతకమే లక్ష్యంగా అతను కోచ్ రమేశ్ వద్ద తన ప్రదర్శనకు మెరుగులు దిద్దుకున్నాడు. ఈ క్రమంలో అతనికి ‘సాయ్–గోపీచంద్–మైత్రా ప్రాజెక్ట్’ అన్నివిధాలా చేయూతనిచ్చిందని స్వర్ణ విజేత ప్రేమ్ కుమార్ తెలిపాడు. ఈ సందర్భంగా అతను తన కోచ్‌కు, తోడ్పాటు అందించిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment