ఉత్సాహంగా ఎంపికలు | athletics selection trials | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎంపికలు

Published Tue, Sep 20 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

ఉత్సాహంగా ఎంపికలు

ఉత్సాహంగా ఎంపికలు

  •  అథ్లెటిక్స్‌ ఎంపికలకు 800 మంది క్రీడాకారులు హాజరు 
  •  ఈ నెల 24 నుంచి గచ్చిబౌలిలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ మీట్‌
  • మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 24, 25తేదీల్లో జరిగే 3వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్‌–14, 16, 18, 20విభాగాల అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను మంగళవారం స్థానిక స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలకు జిల్లావ్యాప్తంగా దాదాపు 800మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి కేటగిరీల వారీగా 100మీ., 200మీ., 400మీ., 600మీ., 800మీ., 1500మీ., 2000మీ., 3000మీ., 5000మీ., 10000మీటర్ల పరుగుతో పాటు 5కేఎం, 10కేఎం నడక, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో అంశాల్లో ఎంపికలు నిర్వహించారు. అంతకుముందు ఎంపికలను డీఎస్‌డీఓ టీవీఎల్‌ సత్యవాణి, జిల్లా ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ ప్రారంభించారు.
    ఈ సందర్భంగా డీఎస్‌డీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఓ నంబర్‌ 4 క్రీడాపాలసీని జారీ చేసినట్లు తెలిపారు. 50క్రీడాంశాల్లో అథ్లెటిక్స్‌కు అగ్రభాగాన ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. అథ్లెటిక్స్‌కు ఎనలేని గుర్తింపు ఉందని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఎంపికలకు బాలికలు కూడా అధికసంఖ్యలో రావడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ మీట్‌లో పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు రాజేశ్వర్, శ్రీనివాసులు, పీఈటీలు ఆనంద్, సునీల్‌కుమార్, శ్రీనివాసులు, సాధిక్‌ అలీ, స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement