బెర్లిన్ : వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదని సామెత.. కానీ టెక్నాలజీ పుణ్యమా అని వాన రాక గురించి కొంచెం అటు ఇటుగానైనా తెలుస్తోంది. ప్రాణం పోకడ గురించి తాము చెబుతామని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయాలజీ అండ్ ఏజింగ్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక్క రక్త పరీక్షతోనే చెప్పేస్తామని ధీమాగా చెబుతున్నారు. వచ్చే 5 నుంచి పదేళ్లలో ఓ వ్యక్తి మరణిస్తారా లేదా అనే విషయానికి సంబంధించిన గుర్తులను (బయోమార్కర్స్)ను తాము గుర్తించామని చెబుతున్నారు. 14 గుర్తులు నిర్దిష్టమైన వ్యాధికి సూచికలు కాకపోగా.. జీవక్రియలు, కొవ్వులు జీర్ణమయ్యే ప్రక్రియ, మంట/వాపు, రక్తంలో చక్కెరల మోతాదు వంటి అంశాల ఆధారంగా పనిచేస్తాయి.
44 వేల మందిపై ఈ పద్ధతిని పరీక్షించి చూశామని.. అన్ని వయసుల వారు, ఆడ, మగ తేడా లేకుండా ఈ పరీక్ష సరైన ఫలితాలిచ్చిందని చెప్పారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వాళ్లందరూ యూరోపియన్ సంతతికి చెందిన వారే. ఇతర ప్రాంతాల ప్రజలతోనూ ఈ పద్ధతి కచి్చతమైన ఫలితాలను ఇస్తుందా లేదా అన్నది విశ్లేషించాల్సి ఉందని అమండా హస్లేగ్రేవ్ అనే శాస్త్రవేత్త తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment