
పురుషులు ఇంట్లో.. మహిళలు పనుల్లో
ఇప్పుడైతే పురుషులు, మహిళలు ఉద్యోగరీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు.
అయితే ఇదే సమయంలో పురుషులు మాత్రం ఇంటికే పరిమితమయ్యేవారని అధ్యయనంలో బయటపడింది. రాతియుగం చివరల్లో శిలా యుగం మొదట్లో జర్మనీలో ఆశ్చర్యకరంగా కుటుంబాల ఏర్పాటు జరిగిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ సమయంలో పురుషులు తాము పుట్టిన ఊరులోనే ఉండగా.. మహిళల్లో ఎక్కువ శాతం మంది బొహేమియా, సెంట్రల్ జర్మనీ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపారు. అయితే క్రీ.పూ.2500–1650 మధ్య కాలంలో ఇలా వలస వచ్చిన మహిళలను ఖననం చేసిన ప్రదేశంలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఇలా వలస వచ్చిన మహిళలు చనిపోయే నాటికి స్థానిక సమాజంలో కలిసిపోయారని వారు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.