
జర్మనీలో మళ్లీ కాల్పుల కలకలం!
జర్మనీలో ఉగ్రభూతం కోరలు చాస్తోంది. మ్యూనిక్ షాపింగ్ మాల్ దాడి మరువక ముందే జర్మనీ రాజధాని బెర్లిన్ కు దగ్గరలోని ఓ ఆస్పత్రిలో దుండగులు కాల్పులకు పాల్పడటం కలకలం రేపింది.
బెర్లిన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఓ సాయుధుడైన దుండగుడు అక్కడి వైద్యుడిపై కాల్పులు జరిపి, అనంతరం తనను తాను తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రంగంలోకి దిగిన స్పెషల్ పోలీసు బలగాలు ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.