ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికొస్తే ఒకరకంగా ఓటీటీల యుగమనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సైతం ఇంట్లో కూర్చోనే చూసేస్తున్నాం. ఇక వెబ్ సిరీస్‌ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. గంటల తరబడి ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీలు సైతం ఆసక్తికరమైన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.
ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ఎక్కువ మంది యువత ఆసక్తిగా చూసిన సిరీస్‌లలో మనీ హైస్ట్ ఒకటి. స్పానిష్‌లో రూపొందిన ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ దక్కించుకుంది. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్ పలు స్థానిక భాషల్లోనూ అలరించింది. ఈ సిరీస్ మొదటి రెండు పార్టుల్లో కనిపించే కీలక పాత్ర బెర్లిన్. అయితే మనీ హైస్ట్‌కు ముందు అతడు చేసిన మరో దోపిడీతో తాజాగా బెర్లిన్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు.
అయితే తాజాగా ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కించిన బెర్లిన్ అనే వెబ్ సిరీస్ ఇటీవలే రిలీజైంది. ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇలాంటి సిరీస్‌లు ఇష్టపడే ప్రేక్షకులకు మంచి కిక్‌ను అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనీహైస్ట్ అభిమానులు ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతారు. మీలో ఎవరైనా మనీ హైస్ట్ లాంటి సిరీస్‌లు నచ్చేవారుంటే తప్పకుండా బెర్లిన్ సిరీస్ ఓసారి ట్రై చేయండి. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా.. సిరీస్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
అసలేంటి బెర్లిన్ స్టోరీ..
మనీ హెయిస్ట్ సిరీసులో చూపించే దొంగతనాల వెనుక ఫ్రొఫెసర్, అతని సోదరుడు బెర్లిన్ ఇద్దరూ మాస్టర్ మైండ్స్ ఉంటారు. వీరిలో ఇద్దరికి సూపర్ క్రేజ్ వచ్చింది. వీరిలో ఒకరైన బెర్లిన్ మనీ హైస్ట్ కన్నా ముందు చేసిన దోపిడీ ఏంటి? అనే విషయాన్ని ఈ సిరీస్‌లో తెరకెక్కించారు. కాగా బెర్లిన్ పాత్రలో పెడ్రో అలోన్సో అద్భుతంగా నటించాడు. ఆయనతో పాటు సమంత సిక్వోరోస్, ట్విస్టన్ ఉల్లోవా, మిచెల్ జెన్నర్, బెగోనా వర్గాస్, జూలియో పెనా ఫెర్నోండోజ్, జోయెల్ శాంఛైజ్ కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment