Money Heist
-
ఓటీటీలో దూసుకెళ్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. మీరు చూశారా?
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే ఒకరకంగా ఓటీటీల యుగమనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సైతం ఇంట్లో కూర్చోనే చూసేస్తున్నాం. ఇక వెబ్ సిరీస్‌ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. గంటల తరబడి ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీలు సైతం ఆసక్తికరమైన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ఎక్కువ మంది యువత ఆసక్తిగా చూసిన సిరీస్‌లలో మనీ హైస్ట్ ఒకటి. స్పానిష్‌లో రూపొందిన ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ దక్కించుకుంది. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్ పలు స్థానిక భాషల్లోనూ అలరించింది. ఈ సిరీస్ మొదటి రెండు పార్టుల్లో కనిపించే కీలక పాత్ర బెర్లిన్. అయితే మనీ హైస్ట్కు ముందు అతడు చేసిన మరో దోపిడీతో తాజాగా బెర్లిన్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. అయితే తాజాగా ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కించిన బెర్లిన్ అనే వెబ్ సిరీస్ ఇటీవలే రిలీజైంది. ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇలాంటి సిరీస్‌లు ఇష్టపడే ప్రేక్షకులకు మంచి కిక్‌ను అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనీహైస్ట్ అభిమానులు ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతారు. మీలో ఎవరైనా మనీ హైస్ట్ లాంటి సిరీస్‌లు నచ్చేవారుంటే తప్పకుండా బెర్లిన్ సిరీస్ ఓసారి ట్రై చేయండి. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా.. సిరీస్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అసలేంటి బెర్లిన్ స్టోరీ.. మనీ హెయిస్ట్ సిరీసులో చూపించే దొంగతనాల వెనుక ఫ్రొఫెసర్, అతని సోదరుడు బెర్లిన్ ఇద్దరూ మాస్టర్ మైండ్స్ ఉంటారు. వీరిలో ఇద్దరికి సూపర్ క్రేజ్ వచ్చింది. వీరిలో ఒకరైన బెర్లిన్ మనీ హైస్ట్ కన్నా ముందు చేసిన దోపిడీ ఏంటి? అనే విషయాన్ని ఈ సిరీస్‌లో తెరకెక్కించారు. కాగా బెర్లిన్ పాత్రలో పెడ్రో అలోన్సో అద్భుతంగా నటించాడు. ఆయనతో పాటు సమంత సిక్వోరోస్, ట్విస్టన్ ఉల్లోవా, మిచెల్ జెన్నర్, బెగోనా వర్గాస్, జూలియో పెనా ఫెర్నోండోజ్, జోయెల్ శాంఛైజ్ కీలక పాత్రలు పోషించారు. -
‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’
సాక్షి,హైదరాబాద్: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే దోచుకుంటాం.. మీరు దేశం మొత్తాన్ని దోచుకుంటున్నారు’ అని రాసి దానికి ‘బైబై మోదీ’అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసిన ప్లకార్డులతో కొందరు వ్యక్తులు పాపులర్ టీవీ సిరీస్ ‘మనీహీస్ట్’లోని గెటప్‌తో ప్రధాని నరేంద్రమోదీపై నిరసన వ్యక్తం చేశారు. ‘మనీహీస్ట్’లోని వస్త్రధారణతో వారు నగరంలోని వివిధ బ్యాంకులు, పెట్రోల్ బంకులు, రైల్వేస్టేషన్లు వంటి ముఖ్యప్రాంతాల్లో నిలబడి ప్రజలను ఆకట్టుకున్నారు. అంతకుముందు మనీహీస్ట్ చిత్రాలతో ఎల్బీనగర్,హైటెక్‌సిటీ, లక్డీకాపూల్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. ‘మనీహీస్ట్’చిత్రంలో మాదిరిగా ముసుగులతో ఉన్న వారు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, పీఎన్బీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు, ఐఓసీ పెట్రోల్ బంకుల వద్ద, రోడ్లపైన కనిపించారు. ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. -
'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ రీమేక్
Yoo Ji-tae As The Professor In Money Heist: Korea Joint Economic Area: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. దేశాలు, భాషలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లకు మోస్ట్ పాపులారిటీ వస్తోంది. అలా మోస్ట్ పాపులర్ అయిన వెబ్ సీరీస్లలో 'మనీ హెయిస్ట్' ఒకటి. ముందుగా ఈ సిరీస్ స్పానిష్‌లో 'లా కాసా డె పాపెల్ (ది హౌజ్ ఆఫ్ పేపర్)' అనే టైటిల్‌తో వచ్చింది. తర్వాత యూఎస్‌లో ఇదే సిరీస్‌ను 'మనీ హెయిస్ట్' టైటిల్‌తో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. బ్యాంకుల దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన 5 సీజన్లు మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్‌కు రీమేక్ రాబోతుంది. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ కొరియన్ భాషలో రీమేక్ కానుంది. 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1' టైటిల్‌తో కొరియాలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తూ ఇందులోని ప్రొఫెసర్ పోస్టర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. కొరియన్ 'మనీ హెయిస్ట్‌లో ప్రొఫెసర్‌గా 'యూ జి-టే' నటించనున్నాడు. ఈ పోస్టర్లో జాకెట్‌తో పాటు ఫార్మల్ దుస్తులు ధరించి, స్పెక్ట్స్ పెట్టుకుని ప్రొఫెసర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఈ సిరీస్‌ను జూన్ 24 నుంచి ప్రదర్శించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. చదవండి: స్పానిష్ టీవీ సిరీస్‌కు ఫుల్ క్రేజ్ ఎందుకంటే.. Get ready to go back to class, The Professor arrives in just 6 weeks 🥳 MONEY HEIST: KOREA - JOINT ECONOMIC AREA ARRIVES ON JUNE 24th 🕺🏻💃 pic.twitter.com/fBtWRU4FQJ — Netflix India (@NetflixIndia) May 13, 2022 ఇదివరకు వచ్చిన 'మనీ హెయిస్ట్'లో ప్రొఫెసర్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సిరీస్‌లోనే కేవలం ప్రొఫెసర్ పాత్రకే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ప్రొఫెసర్‌గా అల్వారో మోర్టే నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే ప్రస్తుతం వస్తున్న 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1'పై అందులోని ప్రొఫెసర్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఇందులో ప్రొఫెసర్‌గా నటిస్తున్న 'యూ జి-టే' ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా వెన్ మై లవ్ బ్లూమ్స్, హీలర్, మ్యాడ్ డాగ్ చిత్రాల్లో అలరించాడు 'యూ జి-టే'. అలాగే దక్షిణ కొరియా సిరీస్ స్క్విడ్ గేమ్ కూడా పాపులర్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వరుడి మెడలో నోట్ల దండ.. పక్కన ఫ్రెండ్ ఏం చేశాడంటే!
ఇటీవల పెళ్లి వీడియోలు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో వరుడు, వధువు డ్యాన్స్‌లు, లేదా వింత ఆచారాలు పాటించడం లాంటివి వల్ల వైరల్‌గా మారి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో వరుడి మెడలోని కరెన్సీ దండ నుంచి కొన్ని నోట్లను అతడి స్నేహితుడు దొంగిలించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో.. పెళ్లి తతంగం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూర్చున్న వరుడి మెడలో బంధువులు కరెన్సీ దండలను వేసుంటారు. పెళ్లి కొడుకు అతిథులు ఏదో చెప్తుంటే బుద్ధిగా వింటుంటాడు. ఆ సమయంలో పక్కన కుర్చీలోనే కూర్చొన్న అతడి స్నేహితుడు ఆ కరెన్సీ దండల నుంచి చోరీకి ప్లాన్ వేస్తాడు. అనుకున్నదే తడువుగా అమలుకు ప్రయత్నిస్తాడు. అంతలో వరుడు అతని స్నహితుడి వైపు తలతిప్పి చూస్తాడు. ఆ వ్యక్తి వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా తన చేతిని వెనక్కి లాక్కుంటాడు. అయితే వరుడు పెళ్లి తంతులో మళ్లీ బిజీ కావడంతో ఈ సారి కొన్ని నోట్లు దొంగలించి మెల్లగా తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అయితే ఇదంతా ఆ పరిసరాల్లో ఉన్న ఒకరు వారి ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా మిశ్రమంగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆ గర్వం తలకెక్కింది.. ఇప్పుడు నేనేంటో తెలిసొచ్చింది: కచ్చా బాదామ్ సింగర్ -
నన్ను పట్టుకోలేరు
సాక్షి, సిటీబ్యూరో: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన మనీ హెయిస్ట్ తొమ్మిది సీజన్లను తీక్షణంగా వీక్షించి.. తాను అందులోని ప్రొఫెసర్ క్యారెక్టర్‌గా ఫీల్ అవుతూ.. సిండికేట్ ఏర్పాటు చేసుకుని మరీ వరుస కిడ్నాప్‌లకు పాల్పడిన గుంజపోగు సురేష్ అలియాస్ సూరి వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడు ఇటీవలి కాలంలో పలుమార్లు పోలీసులకు చిక్కకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సందర్భాల్లో పోలీసులు తన వాట్సాప్ స్టేటస్ చూస్తారని ఊహించాడు. దీంతో డాన్ చిత్రంలోని ‘డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై’ (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అనే డైలాగ్‌ను స్టేటస్‌గా పెట్టి సవాల్ విసిరాడు. సూరిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు అయిదు రోజుల కస్టడీకి కోరుతూ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. సంకల్పం చెదరకూడదని పచ్చబొట్టు... భోజగుట్ట ప్రాంతానికి చెందిన సూరి డిగ్రీ పూర్తి చేశాడు. పోలీసు అధికారి అవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. తన అన్న సుధాకర్‌కు ఉన్న నేరచరిత్ర నేపథ్యంలో తన దృష్టి మళ్లకుండా, సంకల్పం చెదరకుండా ఉండటానికి టాటూ వేయించుకోవాలని భావించాడు. 2006లో కుడి చేతిపై పోలీసు బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. తన అన్న ప్రభావంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అలవాటుపడిన ఇతగాడు 2011 నుంచి నేరాలు చేయడం ప్రారంభించాడు. మరో చేతిపై ఓ సినీ నటుడి ఫొటోను టాటూగా వేయించుకున్న సూరి ఆయన మాదిరిగానే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఓ ట్రావెల్స్ కార్యాలయంలో డ్రైవర్‌గా పని చేయడంతో డ్రైవింగ్‌పై మంచి పట్టువచ్చింది. సెకండ్ హ్యాండ్ పజేరో వాహనం ఖరీదు చేసిన ఇతగాడు నేరం చేసినప్పుడు, ఆ తర్వాత వీలున్నన్ని రోజులు అందులోనే గడిపేవాడు. స్టీరింగ్‌పై ఉంటే చిక్కడం దుర్లభం... రేసర్లను తలదన్నుతూ డ్రైవింగ్ చేసే సూరి కారు డ్రైవింగ్ సీటులో ఉంటే మాత్రం పట్టుకోవడం ఎవరితరం కాదు. ఇతడిని ఫోన్ నంబర్ ఆధారంగా పట్టుకోవడానికి గతంలో సదాశివపేట, విజయవాడ పోలీసులు ప్రయత్నించారు. ఆ సందర్భంల్లో దాదాపు కిలోమీటరు దూరంగా కారును రివర్స్‌లో అత్యంత వేగంగా నడిపి తప్పించుకున్నాడు. మరోసారి పోలీసులపైకే కారు పోనిచ్చి ఉడాయించాడు. ఈ సందర్భాల్లో తన వాట్సాప్ స్టేటస్‌గా డాన్ సినిమా డైలాగ్ పెట్టాడు. పది రోజులకు పైగా గాలించిన ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎన్.రవీందర్ నేతృత్వంలోని బృందం ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టింది. ఓ టోల్గేట్ వద్ద కారులో నిద్రిస్తున్న సూరిని గుర్తించింది. మూడు గంటలు శ్రమించి ఆ వాహనం చుట్టూ ఇతర వాహనాలు ఆపి పట్టుకోగలిగింది. బిహారీ మాదిరిగా బిల్డప్.. స్నేహితులకు స్నేహితులో, పరిచయస్తులనో మాత్రమే టార్గెట్‌గా చేసుకుని, యువతితో డేటింగ్ ట్రాప్ వేయించి కిడ్నాప్ చేసే సూరి తాను కిడ్నాప్ చేసిన వారి వద్ద బిహారీ మాదిరిగా బిల్డప్ ఇస్తాడు. తాను కనిపించకుండా అనుచరులతో కిడ్నాప్ చేయిస్తాడు. ఆపై వారికి కళ్లకు గంతలు, ముఖానికి తొడుగులు వేశాకే రంగంలోకి దిగుతాడు. బాధితులతో హిందీలో మాట్లాడుతూ బిహార్‌కు చెందిన కిడ్నాపింగ్ గ్యాంగ్‌గా నమ్మిస్తాడు. వారి కుటుంబీకుల నుంచి డబ్బు ముట్టిన తర్వాత ప్లేట్ ఫిరాయిస్తాడు. తానే అతికష్టమ్మీద కిడ్నాపర్ల నుంచి రెస్క్యూ చేసినట్లు బిల్డప్ ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది బాధితులు పోలీసుల కదలికలపై ఇతడికే సమాచారం ఇస్తూ వచ్చారు. ఇతడిని పట్టుకున్న తర్వాత పోలీసులు వారితో సూరినే కిడ్నాపర్ అని చెప్పినా కొందరు నమ్మలేదు. పొడవాటి గడ్డం, సిగతో కూడిన తలకట్టు, జీన్స్, టీషర్ట్స్‌తో తిరిగే సూరి ప్రతి అంశంలోనూ ఎవరో ఒకరిని స్ఫూర్తిగా తీసుకున్నాడని, నడిచిన మార్గం మాత్రం సరైంది కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
Hyderabad: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన వెబ్‌సిరీస్ చూసి.. కిడ్నాప్ చేసి..
సాక్షి, హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘మనీ హెయిస్ట్’ చూసి కిడ్నాప్‌లకు తెగబడి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ తప్పించుకుంటున్న ఓ ఘరానా నేరగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘరానా నిందితుడితోపాటు అతడి గ్యాంగ్‌ను ఆసిఫ్‌నగర్ పోలీసులు పట్టుకున్నట్లు కొత్వాల్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మెహిదీపట్నంలోని భోజగుట్టకు చెందిన గుంజపోగు సురేశ్ 2011 నుంచి నేరాలు చేయడం మొదలెట్టాడు. ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో 14 చోరీ కేసులు నమోదయ్యాయి. 2019 డిసెంబర్లో జైలుకు వెళ్లి 2020 ఫిబ్రవరిలో బయటకు వచ్చాడు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘మనీ హెయిస్ట్’వెబ్ సిరీస్ అతడిని ఆకర్షించింది. దీంతో అదే పంథాలో అపహరణలు చేసి బాధితుల నుంచి డబ్బు రాబట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారంలో తనకు సహకరించడానికి భోజగుట్ట ప్రాంతానికే చెందిన ఎం.రోహిత్, ఐ.జగదీశ్, కె.కునాల్‌లతోపాటు జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన శ్వేతాచారిని ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు ఇచ్చేవాడు. తన స్నేహితుల ద్వారా పరిచయమైన వారి ఫోన్ నంబర్లు సంగ్రహించేవాడు. వారితో సంప్రదింపులు జరపడానికి ప్రత్యేకంగా ఫోన్, నంబర్ ఏర్పాటు చేసుకున్నాడు. శ్వేతాచారి ఫొటోను డీపీగా పెట్టి, ఆమెతోనే వాయిస్ మెసేజ్‌లు సందేశాలు పంపి టార్గెట్ చేసిన వ్యక్తుల్ని ముగ్గులోకి దించేవాడు. పగటిపూట ఆమెతో, రాత్రిళ్లు స్వయంగా చాటింగ్ చేసేవాడు. అడుగడుగునా జాగ్రత్తలు: ఓ దశలో డేటింగ్ కోసం కలుద్దామంటూ శ్వేతతో సందేశం పంపించి ఏదో ఒక చోటుకు బాధితులను రప్పించేవాడు. అక్కడకు వచ్చిన తర్వాత తన గ్యాంగ్‌తో కలసి కిడ్నాప్ చేసేవాడు. గుర్తుపట్టకుండా ఉండటానికి తమతోపాటు బాధితులకూ మాస్కులు, ఫేస్కవర్లు చేయించేవాడు. బాధితుడి ఫోన్ నుంచి కాల్స్ చేయడమో, అతడి నుంచి హాట్‌స్పాట్ తీసుకుని తన ఫోన్ ద్వారా వాట్సాప్ కాల్స్ చేసి బాధితుల కుటుంబాన్ని బెది రించేవాడు. డిమాండ్ చేసిన నగదును బాధితుడి ఖాతాలో వేయించి, బాధితుడితోనే ఏటీఎంల నుంచి డ్రా చేయించి డబ్బు తీసుకున్నాక అతడిని విడిచిపెట్టేవాడు. ఇలా 2021 నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట, హైదరాబాద్‌లోని లంగర్‌హౌ స్, జీడిమెట్ల, ఆసిఫ్‌నగర్, రాజేంద్రనగర్‌తోపాటు తెనాలి రూరల్‌లో ఆరు నేరాలకు పాల్పడ్డాడు. సురేశ్ ఒక్కోసారి బాధిత కుటుంబీకులను డబ్బులు తీసుకొని హైదరాబాద్‌లోని అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కిందకు రమ్మనేవాడు. కిందికి తాడు సహాయంతో డబ్బు సంచిని పైకి లాగి తీసుకునేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ఈ నెల 5న కిడ్నాప్ చేసి, రూ.50 వేలు వసూలు చేశాక మరుసటిరోజు విడిచి పెట్టాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారనే విషయం తెలుసుకున్న సురేశ్ తన కారును కర్నూలులో రిపేరుకు ఇచ్చి ఆ షెడ్ యజమాని నుంచి తాత్కాలికంగా మరో వాహనం తీసుకున్నాడు. ఇలా పది రోజులుగా సంచరిస్తున్న సురేశ్ హైదరాబాద్ చేరుకోగానే ఆసిఫ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. సురేశ్ ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్వేత కోసం గాలిస్తున్నారు. -
మనీ హేయిస్ట్ నటి ఇంట్లో లార్డ్ గణేశ్ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్
Money Heist Esthar Acebo Have Lord Ganesh Painting At Her House: కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేక్షకులు ఓటీటీల బాట పట్టారు. ఓటీటీల్లో వచ్చిన అనేక వెబ్ సిరీస్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అందులో ముందు వరుసలో ఉండే వెబ్ సిరీస్ మనీ హేయిస్ట్ (Money Heist). ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్-స్పానిష్ ఆడియెన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సిరీస్‌ను అందించారు. ప్రస్తుతం తెలుగులో కుడా అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ థ్రిల్లర్ సిరీస్‌కు ప్రపంచం మొత్తం అడిక్ట్ అయిదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఎందుకంటా అంటే.. ఈ వెబ్ సిరీస్‌లోని ఒక నటి ఇంట్లో లార్డ్ గణేశుడి ఫొటో ఉండటం. అందుకే మనీ హేయిస్ట్ గురించి మరోసారి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు హిందూ దేవుళ్లను, సాంప్రదాయలను వివిధ దేశాల్లో నమ్మి పాటించేవారి సంఖ్య ఎక్కువే. హిందూ దేవుళ్లను పూజించే విదేశీ వారి గురించి ఎప్పుడో ఒకసారి వింటూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా ఈ మనీ హేయిస్ట్ వెబ్ సిరీస్‌లో స్టాక్ హోమ్‌గా నటించిన ఎస్తర్ ఎసిబో (Esthar Acebo) ఇంట్లో వినాయకుడి పేయింటింగ్ ఉండటం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎస్తర్ షేర్ చేసిన ఒక వీడియోలో గణేశుడి పేయింటింగ్ కనిపించింది. దీనిని స్క్రీన్ షాట్ తీసి పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు ఇంటర్నెట్ను హల్చల్ చేస్తున్నాయి. స్పానిష్ నటి ఎస్తర్ ఎసిబో ఇంట్లో హిందూ దేవుడి చిత్ర పటం ఉండటం గర్వకారణం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. Proud moment for India ❤️ Spanish actress @EstherAcebo to international fame for her role as Mónica Gaztambide aka #Stockholm in the hit @netflix series #MoneyHeist. who is proudly displaying vedic pictures of lord #Ganesha at her home in one of her video pic.twitter.com/i3HAq92iri — 𝐓𝐇𝐄 𝐔𝐍𝐒𝐓𝐎𝐏𝐏𝐀𝐁𝐋𝐄 𝐖𝐈𝐍𝐆𝐒 (@the_wings_2002) January 5, 2022 ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ -
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్
చేజారిపోతున్న యూజర్లను మళ్లీ తనవైపుకు తిప్పుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త అప్డేట్లతో ముందుకు వస్తోంది. తాజాగా మరో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. యాపిల్ ఐ మెసేజ్,ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ తరహాలో మెసేజ్ రియాక్షన్ ఎమోజీ తో పాటు వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన వెబ్ సిరీస్ 'మనీ హెయిస్ట్' ఎమోజీలను వినియోగించుకోవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా'లో తెలిపింది. More details: • You can react to a message multiple times with different emojis. • The process to send a reaction is end-to-end encrypted, so nobody outside the chat can see your reactions. • You can react to messages in individual chats as well. https://t.co/mJwPL44xvK — WABetaInfo (@WABetaInfo) September 4, 2021 కమ్యూనిటీ బ్లాగ్‌లో ఏముంది? 'వాట్సాప్ బీటా' ఇన్ఫర్మేషన్ ప్రకారం..వాట్సాప్ పర్సనల్ అకౌంట్, లేదంటే పబ్లిక్ గ్రూప్‌లలో యూజర్ల మధ్య సంభాషణలు జరుగుతుంటాయి. ఆ సమయంలో సిచ్చువేషన్‌కు తగ్గట్లు ఎమోజీలను సెండ్ చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కానీ తాజాగా వాట్సాప్ ఆ ఫీచర్‌ను బిల్డ్ చేసినట్లు వెల్లడించింది.ఇకపై యూజర్లు చాటింగ్‌కు అనుగుణంగా ఎమోజీలను సెండ్ చేసుకోవచ్చుని, ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన 'Money Heist Season 5' కి చెందిన 17 ఎమోజీలను త్వరలో విడుదల చేస్తున్నట్లు బ్లాగ్ పేర్కొంది. ఈ రెండు ఫీచర్లను ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై వాట్సాప్ క్లారిటీ ఇవ్వలేదు. కమ్యూనిటీ బ్లాగ్‌లో స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో ఫీచర్లు మరో కొద్దిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని యూజర్లు అంచనా వేస్తున్నారు. అకౌంట్లను బ్లాక్ చేస్తున్న వాట్సాప్ గత కొద్ది కాలంగా ఆయా దేశాల ఐటీ రూల్స్‌కు విరుద్దంగా వ్యవహరిస్తున్న యూజర్లపై వాట్సాప్ ఉక్కుపాదం మోపుతోంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనుచిత, హానికరమైన సమాచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే ఈ ఏడాది జూన్ - జూలై నెలల మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు అధికారికంగా చెప్పింది. అందుకే చేజారిపోతున్న యూజర్లను తనవైపుకు తిప్పుకునేందుకు వాట్సాప్ మరిన్ని అప్డేట్లను తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ