Viral: Money Heist Actress Esther Acebo Reveals Lord Ganesh Painting At Her Home - Sakshi
Sakshi News home page

Money Heist Actress Esthar Acebo: స్పానిష్‌ నటి ఇంట్లో వినాయకుడి చిత్రపటం.. వైరల్‌

Published Wed, Jan 5 2022 5:48 PM | Last Updated on Wed, Jan 5 2022 7:17 PM

Money Heist Esthar Acebo Have Lord Ganesh Painting At Her House - Sakshi

Money Heist Esthar Acebo Have Lord Ganesh Painting At Her House: కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేక్షకులు ఓటీటీల బాట పట్టారు. ఓటీటీల్లో వచ్చిన అనేక వెబ్‌ సిరీస్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అందులో ముందు వరుసలో ఉండే వెబ్ సిరీస్‌ మనీ హేయిస్ట్‌ (Money Heist). ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్‌-స్పానిష్‌ ఆడియెన్స్‌ కోసం ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌తో సిరీస్‌ను అందించారు. ప్రస్తుతం తెలుగులో కుడా అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ థ్రిల్లర్‌ సిరీస్‌కు ప్రపంచం మొత్తం అడిక్ట్‌ అయిదంటే అతిశయోక్తి కాదు. అయితే  ఇప్పుడు ఈ సిరీస్‌ గురించి ఎందుకంటా అంటే.. ఈ వెబ్‌ సిరీస్‌లోని  ఒక నటి ఇంట్లో లార్డ్‌ గణేశుడి ఫొటో ఉండటం. అందుకే మనీ హేయిస్ట్‌ గురించి మరోసారి చెప్పుకోవాల్సి వచ్చింది. 



ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్‌ బరిలో ఏకంగా 4 మార్వెల్‌ చిత్రాలు

హిందూ దేవుళ్లను, సాంప్రదాయలను వివిధ దేశాల్లో నమ్మి పాటించేవారి సంఖ్య ఎక్కువే. హిందూ దేవుళ్లను పూజించే విదేశీ వారి గురించి ఎప్పుడో  ఒకసారి వింటూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా ఈ మనీ హేయిస్ట్‌ వెబ్ సిరీస్‌లో స్టాక్‌ హోమ్‌గా నటించిన ఎస్తర్‌ ఎసిబో (Esthar Acebo) ఇంట్లో వినాయకుడి పేయింటింగ్‌ ఉండటం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎస్తర్‌ షేర్‌ చేసిన ఒక వీడియోలో గణేశుడి పేయింటింగ్ కనిపించింది. దీనిని స్క్రీన్‌ షాట్ తీసి పలువురు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు ఇంటర్నెట్‌ను హల్‌చల్‌ చేస్తున్నాయి. స్పానిష్‌ నటి ఎస్తర్‌ ఎసిబో ఇంట్లో హిందూ దేవుడి చిత్ర పటం ఉండటం గర్వకారణం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 
 

ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement