
సాక్షి,హైదరాబాద్: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే దోచుకుంటాం.. మీరు దేశం మొత్తాన్ని దోచుకుంటున్నారు’ అని రాసి దానికి ‘బైబై మోదీ’అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసిన ప్లకార్డులతో కొందరు వ్యక్తులు పాపులర్ టీవీ సిరీస్ ‘మనీహీస్ట్’లోని గెటప్‌తో ప్రధాని నరేంద్రమోదీపై నిరసన వ్యక్తం చేశారు. ‘మనీహీస్ట్’లోని వస్త్రధారణతో వారు నగరంలోని వివిధ బ్యాంకులు, పెట్రోల్ బంకులు, రైల్వేస్టేషన్లు వంటి ముఖ్యప్రాంతాల్లో నిలబడి ప్రజలను ఆకట్టుకున్నారు.
అంతకుముందు మనీహీస్ట్ చిత్రాలతో ఎల్‌బీనగర్,హైటెక్‌సిటీ, లక్డీకాపూల్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. ‘మనీహీస్ట్’చిత్రంలో మాదిరిగా ముసుగులతో ఉన్న వారు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు, ఐఓసీ పెట్రోల్ బంకుల వద్ద, రోడ్లపైన కనిపించారు. ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment