national executive meeting
-
బీజేపీలోకి పొంగులేటి.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి బండి సంజయ్‌తో పాటుగా బీజేపీ నేతలు పాల్గొన్నారు. కాగా, సమావేశాల అనంతరం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో ప్రధాని మోదీ ప్రజా సంగ్రామ యాత్రను ప్రత్యేకంగా రెండు సార్లు ప్రశంసించారు. ప్రభుత్వ వేధింపులను తట్టుకొని పాదయాత్రను కొనసాగిస్తున్న విషయాన్ని అభినందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. బెంగాల్ తరహాలో హింసాత్మక పాలన జరుగుతోంది. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి చేరే అంశంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. మా సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మా పార్టీలోకి ఎవరు వచ్చినా.. రాకున్నా.. ప్రజలే పార్టీని అధికారంలోకి తీసుకువస్తారు అని కామెంట్స్ చేశారు. -
PM Modi: బీజేపీ సమావేశాలు.. రోడ్ షోలో మోదీకి ఘన స్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనే ముందు ప్రధాని మోదీ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఇటీవల గుజరాత్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మెగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పూలలో ఘన స్వాగతం పలికారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at NDMC Convention Center in Delhi for BJP National Executive meeting (Source: DD) pic.twitter.com/vQGdwNXj9n — ANI (@ANI) January 16, 2023 మరోవైపు.. రెండు రోజల పాటుగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఆరు అంశాలపై చర్చించనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం రాజకీయ, ఆర్థిక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. త్వరలో జరగునున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. BJP National Executive meeting being held at NDMC Convention Centre in Delhi. (Source: DD) pic.twitter.com/eYEEwrOhiW — ANI (@ANI) January 16, 2023 -
బీజేపీని ఓడిద్దాం రండి
పట్నా: కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పార్టీలన్నీ తమ మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమం కోసం చేతులు కలపాలని అన్నారు. శనివారం బిహార్ రాజధాని పాట్నాలో జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ ప్రసంగించారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయాలన్నదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీయేతర పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలన్నీ కలిసి పోరాడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కేవలం 50 సీట్లకే పరిమితం చేయొచ్చని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాల్సిన బాధ్యతను నితీశ్‌కు అప్పగిస్తూ జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే కాషాయ పార్టీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే అసమ్మతి తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తీర్మానంలో ఉద్ఘాటించారు. అసమ్మతి తెలిపినవారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాజంలో అసహనం, తీవ్రవాదం పెరిగిపోతున్నాయి. దళితులు, గిరిజనులు వేధింపులకు గురవుతున్నారు’’ అని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది. మోదీకి ప్రత్యామ్నాయం నితీశ్ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు బిహార్‌లో అధికార కూటమిలోని జేడీ(యూ) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ, జాతీయ మండలి సమావేశాలు శనివారం పాట్నాలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగున్న ఈ భేటీల్లో తొలిరోజు కీలక అంశాలపై చర్చించారు. నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా అభివర్ణిస్తూ వేదిక వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్ కా నేత కైసా హో.. నితీశ్ కుమార్ జైసా హో’ అంటూ జేడీ(యూ) కార్యకర్తలు నినదించారు. రేపటి నుంచి నితీశ్ ఢిల్లీ పర్యటన! 2024 ఎన్నికల్లో బీజేపీ ఢీకొట్టడానికి విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా నితీశ్ ఈ నెల 5 నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించే అవకాశముంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నాయకులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాతోపాటు కమ్యూనిస్ట్ నేతలతోనూ ఆయన సమావేశమవుతారని జేడీ(యూ) వర్గాలు తెలిపాయి. బిహార్‌లో బీజేపీతో తెగతెంపుల తర్వాత నితీశ్‌కు ఇదే తొలి ఢిల్లీ పర్యటన. మణిపూర్‌లో జేడీ(యూ)కు షాక్ బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ పట్నా/ఇంఫాల్: జేడీ(యూ)కు మణిపూర్‌లో పెద్ద షాక్ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను, ఏకంగా ఐదుగురు శుక్రవారం అధికార బీజేపీలో చేరారు. వారి విలీనానికి స్పీకర్ ఆమోదం కూడా తెలిపారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఆ ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్.శారదాదేవి సాదర పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో విందు కార్యక్రమంలో సదరు ఎమ్మెలోయేలతో వారు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పట్ల ప్రజల విశ్వాసానికి, ప్రేమకు ఎమ్మెల్యేల చేరిక సూచిక అని బీరేన్‌సింగ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో తాజా చేరికలతో బీజేపీ బలం 37కు పెరిగింది. ఎమ్మెల్యేలను కొనడమే పనా: నితీశ్ తాజా పరిణామాలపై జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేయడం రాజ్యాంగబద్ధమేనా అని బీజేపీని నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడమే పనిగా పెట్టుకుందని బీజేపీపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలూ బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీలో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మణిపూర్ జేడీ(యూ) అధ్యక్షుడు కుశ్ బీరేన్ చెప్పారు. వారి తీరు రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. -
‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’
సాక్షి,హైదరాబాద్: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే దోచుకుంటాం.. మీరు దేశం మొత్తాన్ని దోచుకుంటున్నారు’ అని రాసి దానికి ‘బైబై మోదీ’అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసిన ప్లకార్డులతో కొందరు వ్యక్తులు పాపులర్ టీవీ సిరీస్ ‘మనీహీస్ట్’లోని గెటప్‌తో ప్రధాని నరేంద్రమోదీపై నిరసన వ్యక్తం చేశారు. ‘మనీహీస్ట్’లోని వస్త్రధారణతో వారు నగరంలోని వివిధ బ్యాంకులు, పెట్రోల్ బంకులు, రైల్వేస్టేషన్లు వంటి ముఖ్యప్రాంతాల్లో నిలబడి ప్రజలను ఆకట్టుకున్నారు. అంతకుముందు మనీహీస్ట్ చిత్రాలతో ఎల్బీనగర్,హైటెక్‌సిటీ, లక్డీకాపూల్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. ‘మనీహీస్ట్’చిత్రంలో మాదిరిగా ముసుగులతో ఉన్న వారు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, పీఎన్బీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు, ఐఓసీ పెట్రోల్ బంకుల వద్ద, రోడ్లపైన కనిపించారు. ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. -
‘పతాక’ స్థాయి ప్రచారం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే తేడా ఏదీ లేకుండా.. అన్ని ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించింది. దీని ద్వారా కేంద్ర సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృ తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేయాలని నిర్ణయానికి వచ్చింది. గుజరాత్, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సహా రాబోయే అన్ని ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించేలా ప్రణాళికను అమలు చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకూ ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించింది. ప్రజల మధ్యే ఉండేలా..: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా.. శనివారం ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర ముఖ్యనేతల ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల భేటీ నిర్వహించారు. నడ్డా ఈ రెండు సమావేశాల్లోనూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ‘పన్నా ప్రముఖ్’లతో క్షేత్రస్థాయికి.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిని పార్టీ నేతలు కలవాలని.. జాబితాల్లోని ఒక్కో పేజీలో ఉన్న ఓటర్లను తరచూ కలిసేందుకు ఒకరికి (పన్నా ప్రముఖ్) బాధ్యత అప్పగించాలని కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిని అమలు చేస్తుండగా.. దక్షిణాది రాష్ట్రాలకూ విస్తరించాలని నిర్ణయానికి వచ్చారు. పన్నా ప్రముఖ్‌లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి.. వారు పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేలా చూడాలని తీర్మానించారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతపై రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జులు తరచూ సమీక్షించాలని నిర్ణయించారు. ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో 200 మంది వరకు కార్యకర్తలతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. కింది స్థాయిలో పేద వర్గాలకు ప్రయోజనం చేకూర్చే పథకాలు, కార్యక్రమాలను అమల్లోకి తేవాలని తీర్మానించారు. పేద వర్గాలకు ఆయా పథకాలు కచ్చితంగా చేరేలా చూడాలని, వీలైనంత మెరుగైన పద్ధతుల్లో విస్తరించాలని నిర్ణయానికి వచ్చారు. ఇంటింటికి త్రివర్ణ పతాకంతో.. దేశంలో ప్రతీ ఇంటికి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లాలని.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ దిశగా విస్తృత కార్యచరణ అమలు చేయనున్నామని వెల్లడించారు. కులం, భాష, ప్రాంతాలకు అతీతంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, ప్రజల్లో దేశభక్తిని నింపడం ద్వారా పార్టీకి ప్రయోజనం కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్థిక అంశాలు, పేదల సంక్షేమంపై తొలి తీర్మానం బీజేపీ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రాజకీయ, ఆర్థిక, పేదల సంక్షేమం, అభివృద్ధి అంశాలపై తీర్మానాలు ప్రతిపాదించారు. ఇందులో ఆర్థిక అంశాలు, పేదల సంక్షేమంపై పెట్టిన తీర్మానాన్ని శనివారం రాత్రి ఆమోదించినట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పార్టీ కార్యకలాపాలు, ఇతర అంశాలకు సంబంధించి సోషల్ మీడియాను మరింతగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవడంపై క్షేత్రస్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ఉదయ్‌పూర్ ఘటనపై చర్చ! రాజకీయ తీర్మానంలో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఘటన చర్చకు వచ్చినట్టు సమాచారం. పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ఉదయ్‌పూర్ దర్జీని ఇద్దరు దుండుగులు తల నరికి హత్య చేయడం, తదనంతర పరిణామాలపై పదాధికారులు, జాతీయ కార్యవర్గంలో చర్చించినట్టు తెలిసింది. దీనితోపాటు మహారాష్ట్రలోని అమరావతి, ఔరంగాబాద్‌లలో మరో రెండు ఘటనలూ జరగడం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. దీనిపై విస్తృతంగా చర్చించి పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. చర్చ జరుగుతోందని, గుచ్చిగుచ్చి ప్రశ్నించ వద్దని వసుంధర రాజే, అధికార ప్రతినిధి సంజయ్ మయూక్ కోరారు. ఇక అగ్నిపథ్ పథకాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ముక్త కంఠంతో ప్రస్తుతించింది. ఈ పథకం కింద వచ్చే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొంది. తెలంగాణపై ‘ప్రత్యేక’ తీర్మానం! తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ ప్రభుత్వం విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై కార్యవర్గ భేటీలో విస్తృత చర్చ జరిగినట్టు సమాచారం. దీనిపై ఆదివారం మరింత చర్చించాక తెలంగాణలో రాజకీయంగా చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై జాతీయ కార్యవర్గం ఒక అధికారిక ప్రకటన చేస్తుందని జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే సింధియా పేర్కొన్నారు. ప్రతీ నిర్ణయం పేదల కోసమే – కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ ప్రభుత్వానికి పేదలే ప్రధానమని, ప్రధాని మోదీ ప్రతి నిర్ణయాన్ని పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలిరోజు విశేషాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, గరీబ్ కల్యాణ్ యోజనపై తొలిరోజు సమావేశాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీర్మాన్ని ప్రవేశపెట్టగా.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ బలపర్చారని తెలిపారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద దేశంలోని 80 కోట్ల మంది జనాభాకు లబ్ధి చేకూరుతోందన్నారు. కరోనా సంకట కాలంలో ఈ పథకం పేదలకు ఎంతో మేలు చేసిందని, గత 25 నెలలుగా రూ.2.6 లక్షల కోట్లను పేదలకు అందించామని చెప్పారు. 2014 మేలో అధికారం చేపట్టినప్పుడు ప్రధాని మోదీ తొలిసారి చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీ మేరకు పేదలు, మహిళా, యువత, దళితులు, బడుగు, బలహీనవర్గాల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సౌభాగ్య, ప్రతి ఇంటికి నల్లా నీరు, జన్‌ధన్ బ్యాంకు ఖతాలు, ముద్ర యోజన వంటి పథకాలు మంచి ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ ప్రభావం ఉన్నా.. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని, అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలు ద్రవ్యోల్బణంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో గత 8 ఏళ్లలో విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరిగాయని.. మన దేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే మహా శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దడం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యమన్నారు. దేశంలో పోలియో వ్యాక్సినేషన్‌కు 30 ఏళ్ల సమయం పట్టగా.. కోవిడ్ సమయంలో కేవలం ఏడాదిన్నరలో దాదాపు మొత్తం జనాభాకు 191 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు. -
డైనమిక్ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నా: తెలుగులో మోదీ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: డైనమిక్ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సిటీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశాలు ప్రారంభించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్నారు. డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న @BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం. pic.twitter.com/wOrG9GvabO — Narendra Modi (@narendramodi) July 2, 2022 రెండు రోజులపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రేపు కూడా మోదీ హైదరాబాదర్‌లోనే ఉండనున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ బహిరంగసభలో పాల్గొంటారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో పాగా వేయడానికి రోడ్‌మ్యాప్ ఇవ్వనున్నారు. చదవండి: Live Updates: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన -
నేషనల్ ఎజెండా.. తెలంగాణపై జెండా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అధికారాన్ని విస్తరించడం, ఇప్పటికే ఉన్నచోట నిలుపుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ కార్యాచరణను సిద్ధం చేయనుంది. అవసరమైన ప్రణాళికలు, వ్యూహాలపై విస్తృతంగా చర్చించి ఖరారు చేయనుంది. దీనితోపాటు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా రాబోయే కొన్ని నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణపైనా నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్లవచ్చనే అంచనాల నేపథ్యంలో.. వ్యూహాల అమలును వేగిరం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలనూ ఖరారు చేయనున్నట్టు తెలిసింది. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నదని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా పకడ్బందీ వ్యూహాన్ని, కార్యాచరణ ప్రణాళికను కార్యవర్గ భేటీలో రూపొందించనున్నారు. ఇందుకోసమే రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ బలాబలాలు, లోటుపాట్లు, టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతరేకత, ఏయే అంశాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి, పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై బీజేపీ అధ్యయనం చేపట్టింది. 119 నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, ముఖ్య నేతలను నియోజకవర్గాలకు పంపి పరిశీలన చేయించింది. రెండు, మూడు రోజుల పరిశీలన తర్వాత ఆయా నేతలంతా శనివారం హైదరాబాద్‌కు చేరుకుని కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా తెలంగాణకు సంబంధించిన తీర్మానాలను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలిసింది. ఎజెండాపై ప్రధాన కార్యదర్శుల చర్చ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారీ ర్యాలీగా నోవాటెల్‌కు వచ్చిన ఆయన.. తెలంగాణ చరిత్ర, నిజాం వ్యతిరేక పోరాటం, విమోచన, తెలంగాణ సంస్కృతీ సం›ప్రదాయాలు, కళల ఘనతను చాటేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. తర్వాత హెచ్ఐసీసీ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భరత మాత చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు. అనంతరం జేపీ నడ్డా అధ్యక్షతన జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. కార్యవర్గ సమావేశాల్లో నిర్వహించాల్సిన చర్చలు, చేయాల్సిన తీర్మానాల ఎజెండాపై చర్చించారు. ఇందులో తరుణ్ చుగ్, దగ్గుబాటి పురందేశ్వరి, బీఎల్ సంతోష్, శివప్రకాశ్‌జీ, మరికొందరు నేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బీజేపీ శాఖల నుంచి వచ్చిన నివేదికలు, సంస్థాగత సంబంధిత అంశాలను ఇందులో చర్చించినట్టు తెలిసింది. ఎజెండాను ఖరారు చేయనున్న పదాధికారులు శనివారం ఉదయం 9 గంటలకు పార్టీ జాతీయ పదాధికారులు సమావేశం కానున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు సమర్పించిన ఎజెండా ముసాయిదాపై చర్చిస్తారు. ఏవైనా మార్పులు, చేర్పులు అవసరమైతే సిద్ధం చేసి.. కార్యవర్గ భేటీలో ఆయా అంశాలపై చర్చించేందుకు సిద్ధం చేస్తారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన వచ్చాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయి. తిరిగి ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలై.. సాయంత్రం నాలుగు గంటల దాకా జరుగుతాయి. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ ముగింపు ప్రసంగం చేస్తారు. అయితే సోమవారం కూడా పార్టీ సమావేశాలు కొనసాగుతాయి. అన్ని రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులు భేటీ అయి.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల వారీగా ప్రత్యేక సూచనలు చేస్తారు. సోమవారం సాయంత్రానికి బీజేపీ జాతీయ సమావేశాలు పూర్తిగా ముగుస్తాయి. ఆరు ఆంశాలపై తీర్మానాలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రధానంగా ఆరు అంశాలపై తీర్మానాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు.. మోదీ ఎనిమిదేళ్ల పాలనను అభినందిస్తూ ధన్యవాద తీర్మానం.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు.. సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం.. తెలంగాణలో పరిస్థితులు, కేసీఆర్ సర్కార్ తీరు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణ.. తదితరాలపై తీర్మానాలు ఉంటాయని తెలిపాయి. ఇవేగాకుండా మరికొన్ని అంశాలపైనా చర్చ, తీర్మానాలు ఉండవచ్చని పేర్కొన్నాయి. అంతా వేదిక కిందే.. జాతీయ భేటీలో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, సీఎంలు, ముఖ్య నేతలు అంతా సాధారణ కార్యకర్తలుగా వేదిక కిందే ఆసీనులు కానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ మాత్రమే వేదికపై ఉంటారు. ఆయా అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టేవారు, వాటిని బలపరిచేవారు పైకి వచ్చి మాట్లాడి వెళుతుంటారు. – సమావేశాల్లో మొత్తం 354 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారు. వీరిలో 118 పదాధికారులు ఉన్నారు. రాష్ట్రం నుంచి 14 మంది సమావేశాల్లో పాల్గొంటున్నారు. – ఆదివారం సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ జరిగే ‘విజయ సంకల్ప సభ’లో మోదీ, నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, 18 రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. నేటి కార్యక్రమాలివీ.. ►ఉదయం 9 గంటలకు బీజేపీ పదాధికారులు భేటీ అవుతారు. కార్యదర్శుల భేటీలో రూపొందించిన ఎజెండాపై చర్చించి ఖరారు చేస్తారు. ►ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. ►సాయంత్రం 3 గంటలకు జేపీ నడ్డా ప్రసంగంతో కార్యవర్గ భేటీ ప్రారంభం అవుతుంది. ►రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయి. ►తిరిగి ఆదివారం ఉదయం 10కి మొదలవుతాయి. -
కాకతీయ ప్రాంగణంలో ‘కాషాయ’ పండుగ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ‘జాతీయ పండుగ’ శుక్రవారం అంగరంగ వైభవంగా మొదలుకానుంది. సోమవారం దాకా జరగనున్న ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం సర్వం సన్నద్ధమైంది. భేటీ కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేతలు రాష్ట్రానికి చేరుకోగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరికొందరు నేతలు శుక్రవారం రానున్నారు. జేపీ నడ్డాకు శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకనున్నాయి. నడ్డా అక్కడి నుంచి భారీ ర్యాలీగా హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకోనున్నారు. తొలుత తెలంగాణ, సంస్కృతి సంప్రదాయాలు, కళలు, చరిత్రకు అద్దంపట్టేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభిస్తారు. తర్వాత నడ్డా అధ్యక్షతన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీ జరగనుంది. అందులో కార్యవర్గ సమావేశాల ఎజెండాపై చర్చిస్తారు. 2న (శనివారం) ఉదయం పదాధికారుల సమావేశం నిర్వహించి.. తీర్మానాలు, ఎజెండాను ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ కార్యవర్గ భేటీ ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు సాగుతుంది. 3న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యవర్గ భేటీ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో ‘విజయ సంకల్ప సభ’ బహిరంగ సభలో ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. సమావేశ మందిరాలకు చారిత్రక పేర్లతో.. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా, జాతీయ కార్యవర్గ సమావేశ స్థలికి కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు పెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసు ఆఫీస్‌గా పేరు ఖరారు చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ ప్రాంగణంగా.. మీడియా హాల్‌కు షోయబుల్లాఖాన్ హల్గా.. అతిథులు బసచేసే ప్రాంగణానికి సమ్మక్క–సారలమ్మ నిలయంగా.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబింగా ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనశాలకు గొల్లకొండగా పేరు పెట్టారు. జాతీయ కార్యవర్గ భేటీ తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరును ఖరారుచేశారు. 4వ తేదీన బీజేపీ సంఘటన కార్యదర్శుల (అన్ని రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల) సమావేశ హల్కు కొమురం భీం పేరు పెట్టారు. ప్రధాని షెడ్యూల్ ఇదీ ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 2న (శనివారం) మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకునే ప్రధాని.. నాలుగో తేదీన తిరిగి బయలుదేరనున్నారు. ప్రధాని షెడ్యూల్లో ముఖ్య కార్యక్రమాలతోపాటు రోజూ కొంత సమయాన్ని రిజర్వుగా ఉంచారు. ఆ సమయంలో పార్టీ నేతలతో భేటీలు, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేయనున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఆయన చేరికతో రాష్ట్రం నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, మురళీధర్‌రావు, డీకే అరుణ, విజయశాంతి, ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాజాసింగ్, మంత్రి శ్రీనివాస్ జాతీయ కార్యవర్గంలో ఉన్నారు. ఏర్పాట్లలో లోటు రావొద్దు – ప్రధాని పర్యటనపై అధికారులకు సీఎస్ ఆదేశం బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ కోసం హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. మూడు రోజులు ఇక్కడే ఉండనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్షించారు. ప్రధాని 2న హైదరాబాద్‌కు చేరుకుని 4న ఉదయం బయలుదేరి వెళతారని.. ఇతర వీఐపీలూ పర్యటించనుండటంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. కార్యవర్గ భేటీ ఏర్పాట్లు దాదాపు పూర్తి హఫీజ్‌పేట్ (హైదరాబాద్): బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. శుక్రవారం నుంచే సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీతోపాటు అతిథులు బస చేసే నోవాటెల్ ప్రాంగణం ఇతర ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం పరిశీలించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్‌తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ తాత్కాలిక కార్యాలయం, కేంద్ర మంత్రులు, ఇతర వీఐపీలకు స్వాగతానికి ఏర్పాట్లు, కావలసిన వసతులు, ప్రచార రథం, నోవాటెల్ ఎదురుగా ప్రత్యేక షెడ్లో ఎగ్జిబిషన్ తదితర అంశాలను పరిశీలించారు. రాష్ట్ర బీజేపీ కోరిక మేరకు జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తోందని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, 18 మంది సీఎంలు, అన్ని రాష్ట్రాల బీజేపీ సీనియర్లు రానుండటంతో తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని.. డబుల్ ఇంజన్ సర్కార్‌తో తెలంగాణ రూపురేఖలు మారుతాయని విజ్ఞప్తి చేశారు. -
ప్రజల ఆశలు, ఆకాంక్షలు మన బాధ్యతను మరింత పెంచుతున్నాయి: మోదీ
-
ఎన్నికల వ్యూహాలను ఖరారు చేయనున్న బీజేపీ కార్యవర్గం
-
2022నాటికి మోదీ కలల భారతం ఇదే
న్యూఢిల్లీ : అవినీతిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, కొన్నిసార్లు ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ తదితర నేతలు హాజరైన ఈ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గం రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టింది. అందులో పలు అంశాలను ప్రస్తావించడంతోపాటు ఆరు ప్రత్యేక అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. రాజకీయ తీర్మానంలోని అంశాలు ఏమిటంటే.. పారదర్శకతతో కూడిన ఆర్థిక వ్యవస్థ అవినీతిని అంతమొందిస్తామని, నల్లడబ్బును వెనక్కు తీసుకొస్తామని ఇచ్చిన హామీ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంది. అందుకు తగినట్లు పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయం తీసుకోగా ప్రజలనుంచి కూడా అనూహ్య మద్దతు వచ్చింది. దీంతో నల్లమార్కెట్ నడ్డి విరిచినట్లయింది. ఈ నిర్ణయమే పారదర్శకతకు మార్గం చూపినట్లయింది. డిజిటల్ లావాదేవీలు కూడా అమాంతం పెరిగాయి. వస్తు సేవల పన్ను(ఒకే దేశం.. ఒకే పన్ను) దేశం మొత్తానికి ఒక పన్ను విధానం ఉండాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌ను బీజేపీ పాలిత ప్రభుత్వం నెరవేర్చింది. పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తర్వాత ఇదే అతిపెద్ద నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని వర్తకవాణిజ్య సమస్యలన్ని తీరాయి. ఈ నిర్ణయం అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కక్కటిగా తీరుస్తోంది. ఉగ్రవాదం-ప్రత్యేకవాదంపై కఠినత ఉగ్రవాదం, ప్రత్యేకవాదం విషయంలో ఏమాత్రం సహనం తీసుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రం కఠిన వైఖరితో ఉంది. గత ఆరేళ్లుగా ఉగ్రవాద చర్యలను తటస్థీకరించగలిగాం. ప్రపంచ వేదికలపై ఎన్నోసార్లు ఇప్పటికే ఉగ్రవాదంపై బలంగా గొంతును వినిపించారు. మహిళలకు గౌరవం, సమానత్వంతో కూడిన జీవితం మహిళలకు గౌరవంతో కూడిన జీవితాన్ని అందించడంతోపాటు వారి పురోభివృద్ధికై కేంద్రం పనిచేస్తోంది. భేటీ బచావో-భేటీ పఢావో, సుకణ్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన వంటి ఎన్నో పథకాలు మూడు కోట్ల మందికి లబ్ధిని చేకూరుస్తున్నాయి. రైతు సంక్షేమ కార్యక్రమాలు సాయిల్ హెల్త్ కార్డ్, క్రాప్ ఇన్సూరెన్స్‌లాంటి పలు పథకాలను రైతులకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతుల ఆదాయం రెండింతలు చేసే కార్యక్రమాలు తీసుకొచ్చింది. రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. జాతి నిర్మాణంకోసం యువత అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ కార్యనిర్వహక వర్గం ఈ సంవత్సరాన్ని యువ ప్రోత్సాహక నామసంవత్సరంగా పరిగణిస్తోంది. దేశ నిర్మాణంలో యువతే కీలకం అయినందున వారి అభివృద్ధే ముఖ్యంగా భావిస్తున్నాం. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్, ముద్రా స్కీం, స్టార్ట్ప్ ఇండియాలాంటి కార్యక్రమాలతో యువతకు ఎన్నో అవకాశాలు తీసుకొస్తున్నాం. డోక్లామ్‌పై శాంతి తీర్మానం డోక్లామ్ విషయంలో శాంతియుత తీర్మానం చేసినందుకు జాతీయ కార్యనిర్వాహక మండలి అభినందనలు తెలియ జేస్తోంది. ఇది పరిణితిచెందిన, దౌత్య రాజకీయాల విజయంగా భావిస్తున్నాం. బ్రిక్స్‌లో ధృఢమైన భారత్ బ్రిక్స్‌లో ధృఢమైన దేశంగా భారత్ నిలిచింది. మోదీ పది పాయింట్ల అజెండాను ప్రకటించారు. వీటి ద్వారా బ్రిక్స్ దేశాలు ఐక్యంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు ఎదుర్కోవచ్చు. మౌలిక సదుపాయాల బలోపేతం గతంలో ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేస్తూ దేశంలో మౌలిక సదుపాయాలను మరింత వేగంగా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ శతజయంతి మిషన్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ శతజయంతి సందర్భంగా బలహీన వర్గాలకు చేయూతనందించి వృద్ధి తీసుకురావాలని భావిస్తున్నాం. అందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశ వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకొని పార్టీ స్థిరత్వానికి శ్రీకారం చుట్టారు. 2022 నాటికి నూతన భారత్‌ను నిర్మించాలని మోదీ తలపెట్టారు. 2022నాటి దీని లక్ష్యం కోసం సంకల్ప్ సిద్ధి ప్రోగ్రామ్ ద్వారా ముందుకు తీసుకెళతారు. ఇది జరగబోయే సత్యం. బీజేపీ జాతీయ కార్యవర్గం చేసిన ఆరు ప్రతిజ్ఞలు పేదరికం రహిత భారత్ స్వచ్ఛ భారత్ ఉగ్రవాద రహిత భారత్ కులాల రహిత భారత్ మతోన్మాద రహిత భారత్ అవినీతి రహిత భారత్ -
15 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రెండ్రోజుల పాటు జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏప్రిల్ 15న ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ హాజరుకానున్నారు. ఈ వివరాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్థానిక పంచాయితీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికే ప్రధాని వస్తున్నారని అన్నారు. పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. -
దక్షిణాన విస్తరణే బీజేపీ లక్ష్యం
- రేపటి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు - నేడు బెంగళూరుకు చేరుకోనున్న ప్రధాని మోదీ - ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సమావేశాలు సాక్షి, బెంగళూరు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం నుంచి బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. రెండురోజుల పాటు జరిగే భేటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడమే ముఖ్య ఎజెండా కానుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి జాతీయ కార్యవర్గ సమావేశాలు కావడంతో వీటికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం బెంగళూరుకు రానున్నారు. ఆయన మూడు రోజులు బెంగళూరులోనే ఉంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. గురువారం ఇటీవల పునర్వ్యవస్థీకరించిన నూతన జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశం జరుగుతుంది. మోదీ, పార్టీ చీఫ్ అమిత్‌షాలు ఈ సమావేశంలో పాల్గొంటారు. కార్యవర్గ సమావేశాల్లో సభ్యులతో పాటు జేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు శాసనసభా పక్ష నేతలతో కలిపి మొత్తం 330 మంది పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని నేషనల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు ఈ సమావేశాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు పార్టీ నేత మురళీధర్ రావు తెలిపారు. -
మోదీకి కలిసొచ్చిన గోవా
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి గోవా రాజకీయంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగినప్పటికీ ఆయన్ను సీఎం పదవిలో కొనసాగిస్తూ గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జూన్‌లో గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో మోదీని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా నియమించారు. దీంతో ఆయన ప్రధాని కాగలిగారు. ఈ నేపథ్యంలోనే చిన్న రాష్ర్టమైన గోవా రెండు కేంద్ర మంత్రి పదవులను పొందగలిగింది. కేబినెట్లో ఇప్పటికే గోవాకు చెందిన శ్రీపాద్ నాయక్ ఉండగా తాజాగా మాజీ సీఎం పారికర్ చేరారు.