బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏప్రిల్ 15న భువనేశ్వర్‌లో ప్రారంభం కానున్నాయి.
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రెండ్రోజుల పాటు జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏప్రిల్ 15న ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ హాజరుకానున్నారు. ఈ వివరాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ స్థానిక పంచాయితీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికే ప్రధాని వస్తున్నారని అన్నారు. పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.