Bhubaneshwar
-
ఆర్మీ అధికారి కాబోయే భార్యపై పోలీసుల వేధింపులు
భువనేశ్వర్: భారత ఆర్మీకి చెందిన అధికారికి కాబోయే భార్యపై పోలీసుల దాడి ఘటన ఒడిషాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అలాగే, జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి బాధితురాలు తన రెస్టారెంట్‌ను మూసివేసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో కొంత మంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆమెను వేధింపులకు గురిచేశారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. అనంతరం, ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆమె భరత్పూర్ పోలీసు స్టేషన్ వెళ్లారు. ఈ సందర్బంగా పీఎస్ కేవలం ఒక్క మహిళా కానిస్టేబుల్ మాత్రమే సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. జరిగిన విషయం చెప్పి కేసు నమోదు చేయాలని కోరగా అందుకు కానిస్టేబుల్ నిరాకరించింది. కాసేపటి తర్వాత కొందరు పోలీసులు స్టేషన్‌కు వచ్చారు.Army officer’s fiance alleges sexual assault in #Odisha. The woman spoke about the #attack on her and her fiance, an army officer, on Thursday after being discharged from #AIIMS #Bhubaneswar pic.twitter.com/xfQ7HmIz65— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) September 20, 2024ఈ సందర్భంగా తనపై దాడికి సంబంధించిన ఘటనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు మహిళా పోలీసులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను లాకప్‌లో వేసి దారుణంగా హింసించారు. ఇన్స్‌స్పెక్టర్ ర్యాంక్ ఉన్న పోలీసు, మరో నలుగురు ఆమె వద్దకు వెళ్లి బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దారుణంగా సైగలు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల దెబ్బల కారణంగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తర్వాత ఆమె ఎయిమ్స్ చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో తనతో పోలీసులు ప్రవర్తించిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు.ఇక, ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళా పోలీసులతో పాటు, మరో ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆమెకు కాబోయే భర్త కోల్‌కతాలోని 22 సిక్కు రెజిమెంట్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు.ఇది కూడా చదవండి: కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు -
Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
భువనేశ్వర్: స్వదేశంలో మూడేళ్ల తర్వాత తొలిసారి బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకంతో మెరిశాడు. గతవారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్...బుధవారం జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్లో పసిడి పతకం సాధించాడు. హరియాణాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన డీపీ మనూ 82.06 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన కిశోర్ కుమార్ జెనా నిరాశపరిచాడు. ఒడిశాకు చెందిన కిశోర్ జావెలిన్‌ను 75.25 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిసారి భారత్‌లో 2021 మార్చి 17న భువనేశ్వర్‌లోనే జరిగిన ఫెడరేషన్ కప్‌లో నీరజ్ పోటీపడి స్వర్ణ పతకం సాధించాడు. మూడేళ్ల తర్వాత ఇదే వేదికపై పోటీపడ్డ నీరజ్ పసిడి ఫలితాన్ని పునరావృతం చేశాడు. -
శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్!
అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్‌లోని ఓ హోటల్లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్‌లో ఉంచింది. శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్ దీప్తితో ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్. తాజాగా సీబీఐ ఛార్జిషీట్ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. -
అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అసెంబ్లీ భవన్ ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ గట్టిగట్టిగా అరిచాడు. తన దగ్గరకు రావాలని చూసిన వారిని కత్తితో బెదిరించాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. (చదవండి : హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు) అయితే యువకుని తల్లి వివరాల మేరకు సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలిసింది. కొడుకును ఆసుపత్రిలో చూపించేందుకు తల్లి, కొడుకులు ఆటోలో కలసి బయలుదేరారు. అసెంబ్లీ భవన్ వద్దకు చేరుకోగానే యువకుడు సైకోలాగా ప్రవర్తిస్తూ బ్యాగ్‌లో ఉన్న కత్తిని తీసుకొని ఆటో నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత తల్లి మెడపై కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో పాటు బీజేడీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశాడు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని అతని వద్ద నుంచి కత్తి స్వాధీనం చేసుకొని తల్లిని విడిపించి యువకుడిని కస్టడీలోకి తీసుకున్నారు. యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని.. ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళుతుండగా.. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ దశ్ పేర్కొన్నారు. కాగా యువకుడు కత్తితో సైకోలాగా ప్రవర్తిస్తూ హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : భారీ చేపతో బామ్మకు జాక్‌పాట్) -
ఫేస్బుక్ పోస్టు వివాదాస్పదం..
భువనేశ్వర్: సోషల్ మీడియా ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టు ప్రసారం చేసిన ఆరోపణ కింద విద్యాధికులు కూడా చిక్కుకుంటున్నారు. ఇటువంటి సంఘటన స్థానిక ఉత్కళ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. అభ్యంతరకర పోస్టు చేసిన ఆరోపణతో వివరణ కోరుతూ సదరు అధ్యాపకునికి ఉత్కళ విశ్వవిద్యాలయం క్రమశిక్షణ వర్గం తాఖీదుల్ని జారీ చేసింది. సోషల్ మీడియలో పరిధి దాటితే ఎంతటి వారైన అభాసుపాలు కావడం తథ్యమని తాజా సంఘటన రుజువు చేస్తుంది. ఉత్కళ విశ్వవిద్యాలయం సైకాలజి విభాగం సహాయ ప్రొఫెసరుగా పనిచేస్తున్న మహేశ్వర్ శత్పతి అధికార వర్గాలకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో ఫేస్బుక్లో పోస్టు చేసినట్టు ఆరోపణ. తుది ఫలితాల ప్రకటనకు ముందు విద్యార్థుల మార్కుల జాబితాను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయడం అభ్యంతరకరంగా మారింది. ఈ మేరకు వివరణ కోరుతూ ఆయనకు అధికార వర్గం తాఖీదుల్ని జారీ చేసింది. ఉత్కళ విశ్వవిద్యాలయం పోస్టుగ్రాడ్యుయేటు మండలి అధ్యక్షుడు ఈ తాఖీదుల్ని జారీ చేశారు. -
15 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రెండ్రోజుల పాటు జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏప్రిల్ 15న ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ హాజరుకానున్నారు. ఈ వివరాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్థానిక పంచాయితీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికే ప్రధాని వస్తున్నారని అన్నారు. పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. -
భువనేశ్వర్‌లో బస్సు ప్రమాదం
-
భువనేశ్వర్‌లో బస్సు ప్రమాదం
భువనేశ్వర్: నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ధౌలి కొండ ప్రాంతం నుంచి టూరిస్టు బస్సు జారిపడింది. పశ్చిమ బెంగాల్ మెదీనాపూర్ నుంచి పర్యాటకులతో వచ్చిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ విచారకర సంఘటన మంగళవారం సంభవించింది. ఈ సంఘటనలో 35 మంది గాయపడ్డారు. కొండపై శాంతి స్థూపం సందర్శన ముగించుకుని వస్తుండగా మలుపులో అదుపు తప్పి బస్సు కొండ నుంచి దిగువ ప్రాంతానికి జారడంతో ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని స్థానిక క్యాపిటల్ ఆస్పత్రి, కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ప్రాంతంలో లోగడ పలుసార్లు పర్యాటక బస్సులు జారి ఇటువంటి ప్రమాదాలకు గురైన దాఖలాలు ఉన్నాయి. చర్యలు శూన్యం బంగారు త్రిభుజం పర్యటన కింద దేశ, విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. ధౌలి కొండపైన ఉన్న శాంతి స్థూపం సందర్శించేందుకు వెళ్తారు. తిరిగి వచ్చే సమయంలో మలుపు తిరిగే చోట తరచూ బస్సులు జారి పడుతున్నాయి. కొండపైకి పర్యాటక బస్సుల్ని అనుమతించడం శ్రేయోదాయకం కాదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ ఈ మేరకు ఎటువంటి చర్యల్ని చేపట్టకపోవడం విచారకరం. 2012 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన పశ్చిమ బెంగాలు నుంచి విచ్చేసిన పర్యాటక బస్సు ఇదే ప్రాంతంలో 60 అడుగుల లోతుకు జారి పడింది. ఈ సంఘటనలో 7 మంది మరణించగా 40 మంది పైబడి గాయపడ్డారు. 2016 సంవత్సరం మే 23వ తేదీన ఇదే చోట ఇటువంటి విషాద సంఘటన జరిగింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం సంభవించింది. 35 మంది గాయపడ్డారు. బస్సు ఊగిసలాడే పరిస్థితిలో ఉండడంతో మరణాలు సంభవించనట్టు తదుపరి విచారణ తేల్చింది. మంగళవారం మరోసారి అదే పరిస్థితి పునరావృతం కావడం దురదృష్టకరం. పశ్చిమ బెంగాలు మెదినాపూర్ ప్రాంతం నుంచి 65 మంది పర్యాటకులతో వచ్చిన బస్సు తాజా ప్రమాదానికి గురైంది. చర్యలకు ఆదేశిస్తాం: మంత్రి ధౌలి ప్రాంతంలో తరచూ సంభవిస్తున్న పర్యాటక బస్సు దుర్ఘటనల నివారణకు విభాగం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా తెలిపారు. కొండపైకి భారీ బస్సుల్ని అనుమతించకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు వివరించారు. కొండ దిగువ భాగంలో బస్సుల్ని నిలిపి చిన్న బస్సుల్లో పర్యాటకుల్ని కొండపైకి వెళ్లేందుకు అనుమతించేందుకు విభాగం చర్యలు చేపడుతుంది. బ్రేక్ ఫెయిల్, స్టీరింగ్ ఫెయిల్, టైర్లు పరిస్థితి వగైరా అంశాల్ని పరిశీలిస్తున్నారు. పరిశీలన మేరకు తదుపరి చర్యల్ని పేపడతామని స్థానిక ఎమ్వీఐ బిరాంచీ నారాయణ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిస్తే ప్రమాదానికి దారి తీసిన వాస్తవ కారణాలు, పరిస్థితులు స్పష్టం అవుతాయన్నారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవరుకు విచారణ జరిపితే దుర్ఘటన పూర్వాపరాలు తేటతెల్లం అవుతాయని నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి తెలిపారు. నిందితుడు అరెస్టు జయపురం: జయపురం సమితి ధన్పూర్ గ్రామంలో చింగుడు హరిజన్‌ను హత్య చేశాడన్న ఆరోపణతో నిందితుడు బుడు హరిజన్‌ను జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం సదర్ పోలీసు స్టేషన్ ఐఐసీ నిర్మళ మహాపాత్రో మంగళవారం విలేకరులకు తెలిపారు. నిందితుని వద్ద హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీన పరుచుకున్నట్టు చెప్పారు. ఈ హత్యకు ప్రధాన కారణం పాత విభేదాలేనని వెల్లడించారు. నిందితుని మంగళవారం కోర్టులో హాజరు పరచినట్టు పేర్కొన్నారు. గతంలో రాత్రి 9.30 గంటల సమయంలో ఆ గ్రామంలో తన చిన్నాన్న కుమారుడు చింగుడు హరిజన్‌ను బుడు హరిజన్ కత్తితో పొడిచి ఫరారీ అయ్యాడు. ఎట్టకేలకు పట్టుపడ్డాడు. -
ఐఐటీ భువనేశ్వర్ డెరైక్టర్‌గా రాజ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) వైస్ చాన్సెలర్ గా పనిచేసిన ప్రొఫెసర్ ఆర్వీ రాజ్‌కుమార్ భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) డెరైక్టర్‌గా నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.