నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ధౌలి కొండ ప్రాంతం నుంచి టూరిస్టు బస్సు జారిపడింది. పశ్చిమ బెంగాల్ మెదీనాపూర్ నుంచి పర్యాటకులతో వచ్చిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ విచారకర సంఘటన మంగళవారం సంభవించింది. ఈ సంఘటనలో 35 మంది గాయపడ్డారు. కొండపై శాంతి స్థూపం సందర్శన ముగించుకుని వస్తుండగా మలుపులో అదుపు తప్పి బస్సు కొండ నుంచి దిగువ ప్రాంతానికి జారడంతో ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని స్థానిక క్యాపిటల్ ఆస్పత్రి, కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ప్రాంతంలో లోగడ పలుసార్లు పర్యాటక బస్సులు జారి ఇటువంటి ప్రమాదాలకు గురైన దాఖలాలు ఉన్నాయి.