సాక్షి, హైదరాబాద్: డైనమిక్ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సిటీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశాలు ప్రారంభించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్నారు.
డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న @BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం. pic.twitter.com/wOrG9GvabO
— Narendra Modi (@narendramodi) July 2, 2022
రెండు రోజులపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రేపు కూడా మోదీ హైదరాబాదర్‌లోనే ఉండనున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ బహిరంగసభలో పాల్గొంటారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో పాగా వేయడానికి రోడ్‌మ్యాప్ ఇవ్వనున్నారు.
చదవండి: Live Updates: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన
Comments
Please login to add a commentAdd a comment