PM Modi Attends BJP National Executive Meeting In Delhi, Video Goes Viral - Sakshi
Sakshi News home page

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 9 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌!

Published Mon, Jan 16 2023 5:40 PM | Last Updated on Mon, Jan 16 2023 6:35 PM

PM Modi Attends BJP National Executive Meeting In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఇదిలా ఉండగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనే ముందు ప్రధాని మోదీ ఢిల్లీలో రోడ్‌ షో నిర్వహించారు. ఇటీవల గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మెగా రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పూలలో ఘన స్వాగతం పలికారు. 

మరోవైపు.. రెండు రోజల పాటుగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఆరు అంశాలపై చర్చించనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం రాజకీయ, ఆర్థిక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. త్వరలో జరగునున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement