ఈసారి 10 కోట్ల మందికి బీజేపీ సభ్యత్వ నమోదు: జేపీ నడ్డా | PM Narendra Modi launches membership drive updates | Sakshi
Sakshi News home page

ఈసారి 10 కోట్ల మందికి బీజేపీ సభ్యత్వ నమోదు: జేపీ నడ్డా

Published Mon, Sep 2 2024 7:00 PM | Last Updated on Mon, Sep 2 2024 7:25 PM

PM Narendra Modi launches membership drive updates

ఢిల్లీ: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ప్రధాన సేవకుడు. దేశంలోని నూట నలభై కోట్ల ప్రజలకు నేతృత్వం వహిస్తున్నారు. విధి నిర్వహణ కోసం  పగలనక రాత్రనక ప్రధాని పని చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మనందరికీ ఆదర్శం. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈసారి బీజేపీ సభ్యత్వ నమోదు 10 కోట్లకు చేరనుంది. అంతకు ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది. 

..దేశంలో 1500 వరకు పెద్దా, చిన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ మాత్రమే పార్టీ రాజ్యాంగం ప్రకారం కార్యక్రమాలను అమలు చేస్తుంది. బీజేపీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సభ్యత్వ నమోదు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. మొత్తం మూడు దశల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. బీజేపీ సభ్యత్వ నమోదు మిస్డ్ కాల్, వాట్సాప్ ద్వారా, బీజేపీ వెబ్‌సైట్‌ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, నమో యాప్‌ ద్వారా, బీజేపీ పార్టీ రసీదు ద్వారా కూడా సభ్యత్వం పొందవచ్చు’అని అన్నారు.


 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement