membership drive
-
ఈసారి 10 కోట్ల మందికి బీజేపీ సభ్యత్వ నమోదు: జేపీ నడ్డా
ఢిల్లీ: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ప్రధాన సేవకుడు. దేశంలోని నూట నలభై కోట్ల ప్రజలకు నేతృత్వం వహిస్తున్నారు. విధి నిర్వహణ కోసం పగలనక రాత్రనక ప్రధాని పని చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మనందరికీ ఆదర్శం. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈసారి బీజేపీ సభ్యత్వ నమోదు 10 కోట్లకు చేరనుంది. అంతకు ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది. ..దేశంలో 1500 వరకు పెద్దా, చిన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ మాత్రమే పార్టీ రాజ్యాంగం ప్రకారం కార్యక్రమాలను అమలు చేస్తుంది. బీజేపీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సభ్యత్వ నమోదు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. మొత్తం మూడు దశల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. బీజేపీ సభ్యత్వ నమోదు మిస్డ్ కాల్, వాట్సాప్ ద్వారా, బీజేపీ వెబ్సైట్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, నమో యాప్ ద్వారా, బీజేపీ పార్టీ రసీదు ద్వారా కూడా సభ్యత్వం పొందవచ్చు’అని అన్నారు.#WATCH | Delhi: At the launch of BJP's Sanghatan Parva, Sadasyata Abhiyan 2024, Union Minister and BJP chief JP Nadda says, "Seeing your enthusiasm and the love of people of India for PM Modi as well as their faith in the BJP, I can confidently say that the Sadasyata Abhiyan this… pic.twitter.com/qsFRaD0akv— ANI (@ANI) September 2, 2024 -
సభ్యత్వం, శిక్షణపై ప్రత్యేక దృష్టి : ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: సభ్యత్వ నమోదు, శిక్షణపై ప్రత్యేక దృష్టితో పనిచేయనున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఏఐసీసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అక్టోబర్ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలను వీధివీధినా జరపాలని సమావేశం నిర్ణయించింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ అమలుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చపై అధ్యక్షురాలు సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుని రెండు, మూడు రోజు ల్లో మార్గదర్శకాలు జారీ చేస్తారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తోందో మాజీ ప్రధాని మన్మోహన్ వివరించారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని వివరించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకరంగా వాడుకుంటోందని, ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి కనబరుస్తోందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది’అని పేర్కొన్నారు. ‘బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు తక్కువ’ శాసనసభలో, బయటా ప్రజల తరఫున పోరాడేందుకు సిద్ధమవుతున్నామని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు తక్కువని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ‘హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా తెలంగాణ సమాజం కలిసిమెలిసి ఉంది. బీజేపీ విభజన రాజకీయాలు కుదరవు. తెలం గాణకు ఏం చేశారని బీజేపీ ఎదుగుతుంది? బిల్లులో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఇవ్వలేదు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఒక్కరికే పరిమితమయ్యారు. ఎన్నికలు 2023లో జరిగినా అంతకుముందు జరిగినా టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
చిచ్చురేపిన సభ్యత్వ నమోదు
సాక్షి, తాండూరు: పట్టణంతో పాటు పలు మండలాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. గడువు ముగిసిన తర్వాత, స్థానిక ఇన్‌చార్జ్‌లకు కనీస సమాచారం ఇవ్వకుండా మెంబర్‌షిప్‌లు ఇవ్వడంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఈ సారి టీఆర్ఎస్ సభ్యత్వాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. పార్టీ సభ్యత్వం ముగిసిందని అధికారికంగా స్పష్టంచేశారు. అయితే రెండు రోజులుగా తాండూరులో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేతల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తి చేసి.. వివరాలను పార్టీ ఇన్‌చార్జ్‌లకు అందించారు. ఇదిలా ఉండగా ఆయా మండలాలు, మున్సిపల్ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా మళ్లీ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, తాండూరు పట్టణ అధ్యక్షుడు గత నెలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సభ్యత్వం పూర్తి చేసి సభ్యత్వ రశీదు బుక్కులతో పాటు సమకూరిన నగదును పార్టీకి చెల్లించారు. తమకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశామని నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ కమిటీల నియామకం.. మండలాల్లో, పట్టణంలో గ్రామ కమిటీలతో పాటు, వార్డు కమిటీల ఏర్పాటు సైతం తుది దశకు చేరుకొంది. ఇప్పటికే గ్రామ కమిటీల అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. అయితే రెండు రోజులుగా కొంత మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసిన స్థానిక నాయకులు విషయాన్ని తాండూరు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్‌తో పాటు మండలాల అధ్యక్షులకు చెప్పారు. సభ్యత్వ నమోదు చేస్తున్నది తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులుగా గుర్తించారు. మరోసారి వర్గపోరు.. తాండూరు నియోజకవర్గంలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. స్థానికంగా పట్టు సాధించేందుకు ఇద్దరు నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహేందర్‌రెడ్డి వర్గీయులను రెచ్చగొట్టే విధంగా.. ఎమ్మెల్యే వర్గీయులు.. గడువు ముసిగిన తర్వాత సభ్యత్వం చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేశాం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి బుక్కులు, నగదును ఇన్‌చార్జ్‌లకు అందించాం. సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే వర్గీయులు మెంబర్షిప్ చేస్తున్నారు. పార్టీ స్థానిక ఇన్‌చార్జ్‌లకు సైతం ఈ విషయాన్ని చెప్పడం లేదు. దీనిపై పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టు రామచందర్‌రావుతో పాటు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాం. – అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు -
‘టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఆదివారం గన్నవరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆవరణలో చౌహాన్, జీవీఎల్ మొక్కలు నాటారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలిపారు. పేదల అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. టీడీపీ నుంచి అనేక మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చౌహాన్ మాట్లాడుతూ.. బీజేపీ జీరో స్థాయి నుంచి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. ఏపీలో 25 లక్షల సభ్యత్వం తమ లక్ష్యమని తెలిపారు. బూత్ స్థాయి నుంచి బీజేపీ బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సేవ చేయాలనుకునే వారికి బీజేపీ పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడమే తప్ప.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని.. ప్యాకేజీకి అంగీకరించారని గుర్తుచేశారు. ప్యాకేజీకి అనుగుణంగా కేంద్రం అనేక రూపాలలో నిధులు ఇచ్చిందన్నారు. ఏపీకి రూ. 17వేల కోట్ల రూపాయలు ఇస్తే.. ఆ డబ్బులను చంద్రబాబు దారి మళ్లించి తన జేబులో వేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్టీని నడపలేకనే.. అధ్యక్ష పదవి నుంచి పారిపోయారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నకిలీ గాంధీలతో నిండిపోయిందన్నారు. -
తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక దృష్టి
-
సభ్యత్వ నమోదు ప్రారంభించడం సంతోషంగా ఉంది
-
ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
రాయికల్ (జగిత్యాల): ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వస్తున్నట్లు ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసార్ల నాగేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్ని, కార్న్బెర్న్ తదితర ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్‌రావు, రాజేశ్, మాదవ్, సత్యం, అర్జున్, అమర్‌రావు, ప్రకాశ్, అభినయ్, చక్రవర్తి,సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలోకి 30 లక్షల మంది ముస్లింలు
లక్నో: ''ప్రతిపక్షాల దాడిని కాదు.. నా ప్రభుత్వ కార్యక్రమాలను చూసి నన్ను అంచనా వేయండి'' అన్నభారత ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తికి ముస్లిం ప్రజానీకం నుంచి భారీ స్పందన వచ్చిందని బీజేపీ జాతీయ మైనార్టీ సెల్ చీఫ్ అబ్దుల్ రషీద్ అన్సారీ తెలిపారు. మునుపెన్నడూ లేనంత ఆదరణ లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలని ఇచ్చిన పిలుపునకు స్పందించి.. 30 లక్షల మంది ముస్లింలు తమ పార్టీలో చేరారని ఆయన ప్రకటించారు. తాజా లెక్కల ప్రకారం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో తమ పార్టీలో చేరుతున్న ముస్లింల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్సారీ పేర్కొన్నారు. మిస్డ్ కాల్ ద్వారా సభ్యులుగా చేరే పథకంలో భాగంగా 10 కోట్ల 50 లక్షల సభ్యత్వం నమోదైనట్టు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. దీంతో ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా బీజేపీ నిలిచిన సంగతి తెలిసిందే. మరో 90 రోజుల పాటు మహాసంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నామన్నాని ఆయన గత నెలలో ప్రకటించారు. -
బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని మరింత పటిష్టపరచాలని మోదీ పార్టీ కార్యకర్తలను కోరారు.