బీజేపీలోకి 30 లక్షల మంది ముస్లింలు | 30 lakh Muslims join BJP during membership drive | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి 30 లక్షల మంది ముస్లింలు

Published Thu, Jun 4 2015 1:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీలోకి 30 లక్షల మంది ముస్లింలు - Sakshi

బీజేపీలోకి 30 లక్షల మంది ముస్లింలు

లక్నో: ''ప్రతిపక్షాల దాడిని కాదు.. నా ప్రభుత్వ కార్యక్రమాలను చూసి నన్ను అంచనా వేయండి'' అన్నభారత ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తికి ముస్లిం ప్రజానీకం నుంచి భారీ స్పందన వచ్చిందని బీజేపీ జాతీయ మైనార్టీ సెల్ చీఫ్ అబ్దుల్ రషీద్ అన్సారీ తెలిపారు. మునుపెన్నడూ లేనంత  ఆదరణ లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలని ఇచ్చిన పిలుపునకు స్పందించి.. 30 లక్షల మంది ముస్లింలు తమ పార్టీలో చేరారని ఆయన ప్రకటించారు. తాజా లెక్కల ప్రకారం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో తమ పార్టీలో చేరుతున్న ముస్లింల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్సారీ పేర్కొన్నారు.

మిస్డ్ కాల్ ద్వారా సభ్యులుగా చేరే పథకంలో భాగంగా 10 కోట్ల 50 లక్షల సభ్యత్వం నమోదైనట్టు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. దీంతో ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా  బీజేపీ నిలిచిన సంగతి తెలిసిందే. మరో 90 రోజుల పాటు మహాసంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నామన్నాని ఆయన గత నెలలో ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement