Money Heist: Korea Yoo Ji-tae As The Professor First Look Released - Sakshi
Sakshi News home page

Money Heist: Korea – Joint Economic Area: ఆ భాషలో రీమేక్‌గా 'మనీ హెయిస్ట్‌'..

Published Fri, May 13 2022 5:26 PM | Last Updated on Fri, May 13 2022 6:14 PM

Money Heist: Korea Yoo Ji-tae As The Professor First Look Released - Sakshi

Yoo Ji-tae As The Professor In Money Heist: Korea Joint Economic Area: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. దేశాలు, భాషలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లకు మోస్ట్‌ పాపులారిటీ వస్తోంది. అలా మోస్ట్‌ పాపులర్‌ అయిన వెబ్‌ సీరీస్‌లలో 'మనీ హెయిస్ట్‌' ఒకటి. ముందుగా ఈ సిరీస్‌ స్పానిష్‌లో 'లా కాసా డె పాపెల్‌ (ది హౌజ్‌ ఆఫ్ పేపర్‌)' అనే టైటిల్‌తో వచ్చింది. తర్వాత యూఎస్‌లో ఇదే సిరీస్‌ను 'మనీ హెయిస్ట్‌' టైటిల్‌తో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. బ్యాంకుల దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన 5 సీజన్లు మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్‌కు రీమేక్‌ రాబోతుంది. 

మనీ హెయిస్ట్ వెబ్‌ సిరీస్‌ కొరియన్‌ భాషలో రీమేక్‌ కానుంది. 'మనీ హెయిస్ట్‌: కొరియా- జాయింట్ ఎకనామిక్‌ ఏరియా పార్ట్‌ 1' టైటిల్‌తో కొరియాలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తూ ఇందులోని ప్రొఫెసర్‌ పోస్టర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్‌. కొరియన్‌ 'మనీ హెయిస్ట్‌లో ప్రొఫెసర్‌గా 'యూ జి-టే' నటించనున్నాడు. ఈ పోస్టర్‌లో జాకెట్‌తో పాటు ఫార్మల్ దుస్తులు ధరించి, స్పెక్ట్స్‌ పెట్టుకుని ప్రొఫెసర్‌ ఏదో ఆలోచిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఈ సిరీస్‌ను జూన్‌ 24 నుంచి ప్రదర్శించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది. 

చదవండి: స్పానిష్‌ టీవీ సిరీస్‌కు ఫుల్‌ క్రేజ్‌ ఎందుకంటే..

ఇదివరకు వచ్చిన 'మనీ హెయిస్ట్‌'లో ప్రొఫెసర్‌ పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సిరీస్‌లోనే కేవలం ప్రొఫెసర్‌ పాత్రకే ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్ ఉంది. ఇందులో ప్రొఫెసర్‌గా అల్వారో మోర్టే నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే ప్రస్తుతం వస్తున్న 'మనీ హెయిస్ట్‌: కొరియా- జాయింట్ ఎకనామిక్‌ ఏరియా పార్ట్‌ 1'పై అందులోని ప్రొఫెసర్‌ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఇందులో ప్రొఫెసర్‌గా నటిస్తున్న 'యూ జి-టే' ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా వెన్‌ మై లవ్‌ బ్లూమ్స్‌, హీలర్‌, మ్యాడ్‌ డాగ్‌ చిత్రాల్లో అలరించాడు 'యూ జి-టే'. అలాగే దక్షిణ కొరియా సిరీస్‌ స్క‍్విడ్‌ గేమ్‌ కూడా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. 

చదవండి: 'మనీ హెయిస్ట్‌ సీజన్‌ 5' ఎమోజీలొస్తున్నాయ్‌





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement