వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌ | Whatsapp Testing Message Reactions Feature | Sakshi
Sakshi News home page

WhatsApp: 'మనీ హెయిస్ట్‌ సీజన్‌ 5' ఎమోజీలొస్తున్నాయ్‌

Published Sun, Sep 5 2021 1:34 PM | Last Updated on Sun, Sep 5 2021 1:49 PM

Whatsapp Testing Message Reactions Feature - Sakshi

చేజారిపోతున్న యూజర్లను మళ్లీ తనవైపుకు తిప్పుకునేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సరికొత్త అప్‌డేట్‌లతో ముందుకు వస్తోంది. తాజాగా మరో సూపర్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. యాపిల్‌ ఐ మెసేజ్‌,ట్విట్టర్‌, ఇన్‌ స్ట్రాగ్రామ్‌ తరహాలో మెసేజ్‌ రియాక్షన్‌ ఎమోజీ తో పాటు వరల్డ్‌ వైడ్‌గా పాపులర్‌ అయిన వెబ్‌ సిరీస్‌ 'మనీ హెయిస్ట్‌'  ఎమోజీలను వినియోగించుకోవచ్చని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ 'వాట్సాప్‌ బీటా'లో తెలిపింది. 

కమ్యూనిటీ బ్లాగ్‌లో ఏముంది?
'వాట్సాప్‌ బీటా' ఇన్ఫర్మేషన్‌ ప్రకారం..వాట్సాప్‌ పర్సనల్‌ అకౌంట్‌, లేదంటే పబ్లిక్‌ గ‍్రూప్‌లలో యూజర్ల మధ్య సంభాషణలు జరుగుతుంటాయి. ఆ సమయంలో సిచ్చువేషన్‌కు తగ్గట్లు ఎమోజీలను సెండ్‌ చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కానీ తాజాగా వాట్సాప్‌ ఆ ఫీచర్‌ను బిల్డ్‌ చేసినట్లు వెల్లడించింది.ఇకపై యూజర్లు చాటింగ్‌కు అనుగుణంగా ఎమోజీలను సెండ్‌ చేసుకోవచ్చుని, ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలైన 'Money Heist Season 5' కి చెందిన 17 ఎమోజీలను త్వరలో విడుదల చేస్తున్నట్లు బ్లాగ్‌ పేర్కొంది. ఈ రెండు ఫీచర్లను ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై వాట్సాప్‌ క్లారిటీ ఇవ్వలేదు. కమ్యూనిటీ బ్లాగ్‌లో స్క్రీన్‌ షాట్‌లను షేర్‌ చేయడంతో ఫీచర్లు మరో కొద్దిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని యూజర్లు అంచనా వేస్తున్నారు.      

అకౌంట్లను బ్లాక్‌ చేస్తున్న వాట్సాప్‌ 
గత కొద్ది కాలంగా ఆయా దేశాల ఐటీ రూల్స్‌కు విరుద్దంగా వ్యవహరిస్తున్న యూజర్లపై వాట్సాప్‌ ఉక్కుపాదం మోపుతోంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనుచిత, హానికరమైన సమాచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే ఈ ఏడాది జూన్ - జూలై నెలల మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు అధికారికంగా చెప్పింది. అందుకే చేజారిపోతున్న యూజర్లను తనవైపుకు తిప్పుకునేందుకు వాట్సాప్‌ మరిన్ని అప్‌డేట్‌లను తెచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: వారెన్‌ బఫెట్‌ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్‌ అంబానీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement