WhatsApp Jokes
-
ప్రతీ వాట్సాప్ గ్రూపునకు కూడా 10 డాలర్లు పెడితే!?
సాక్షి, హైదరాబాద్: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను టెస్లా చీఫ్ కొనుగోలు చేసిన తరువాత సోషల్ మీడియాలో సెటైర్లు ఒక రేంజ్లో పేలుతున్నాయి. మెటా సొంతమైనవాట్సాప్ను కూడా కొనుగోలు చేసి, వాట్సాప్ గ్రూపులకు కూడా ఫీజు పెడితే బావుంటుందంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ‘‘ఎలాన్ మస్క్ దయచేసి వాట్సాప్‌ను కొనుగోలు చేసి, 10 డీలర్లు ఫీజు పెట్టండి.. డాలర్లే డాలర్లు’’ అంటూ హాయ్ హైదారాబాద్ అనే ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్ల రియాక్షన్స్, మీమ్స్ అదిరిపోతున్నాయి. వుండండి బ్రో..మీరు లేనిపోని సలహాలు ఇవ్వకండి. నేను అంత రిచ్ కాదు ఒకరు కమెంట్ చేయగా, ఆ పనిచేయాలి పీడా పోద్ది, ఫ్యామిలీ గ్రూపు, ఆఫీసు గ్రూపు, ఫ్రెండ్స్ గ్రూపు, టెన్త్ గ్రూపు, ఇంటర్ గ్రూపు, అసోసియేషన్ గ్రూపు అబ్బో..ఈ గ్రూపులతో చచ్చిపోతున్నాం అని ఇంకొకరు వ్యాఖ్యానించారు అంతేకాదు 55 శాతం ట్విటర్ ఉద్యోగులను తొలగించారు.. ఇక మస్క్ వాట్సాప్‌ను కొంటే..వాట్సాప్ యూనివర్శిటీ స్టూడెంట్లు అందరినీ సస్పెండ్ చేస్తారేమో అంటూ మరొకరు, స్పామ్ మెసేజ్‌ల గోల ఉండదు అని ఇంకొకరు ట్వీట్ చేయడం విశేషం. Hey @elonmusk, Please buy @WhatsApp and charge $10 for each WhatsApp group. Enjoy 🌧️💱💸💴💵💰🌧️ — Hi Hyderabad (@HiHyderabad) November 5, 2022 Ala cheste whatsApp university emai povali andi pic.twitter.com/BOvjHAz5CV — Naveen (@naawritings) November 5, 2022 Whatsapp university students 😂😀 pic.twitter.com/O23uJyn9zz — CH SaiTeja 09 (@iamSaiTeja09) November 5, 2022 Actually that is the best thing… we can get out off from spam messages. — Maidla Kiran Mudiraj (@kiranMudiraj128) November 5, 2022 -
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్
చేజారిపోతున్న యూజర్లను మళ్లీ తనవైపుకు తిప్పుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త అప్డేట్లతో ముందుకు వస్తోంది. తాజాగా మరో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. యాపిల్ ఐ మెసేజ్,ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ తరహాలో మెసేజ్ రియాక్షన్ ఎమోజీ తో పాటు వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన వెబ్ సిరీస్ 'మనీ హెయిస్ట్' ఎమోజీలను వినియోగించుకోవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా'లో తెలిపింది. More details: • You can react to a message multiple times with different emojis. • The process to send a reaction is end-to-end encrypted, so nobody outside the chat can see your reactions. • You can react to messages in individual chats as well. https://t.co/mJwPL44xvK — WABetaInfo (@WABetaInfo) September 4, 2021 కమ్యూనిటీ బ్లాగ్‌లో ఏముంది? 'వాట్సాప్ బీటా' ఇన్ఫర్మేషన్ ప్రకారం..వాట్సాప్ పర్సనల్ అకౌంట్, లేదంటే పబ్లిక్ గ్రూప్‌లలో యూజర్ల మధ్య సంభాషణలు జరుగుతుంటాయి. ఆ సమయంలో సిచ్చువేషన్‌కు తగ్గట్లు ఎమోజీలను సెండ్ చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కానీ తాజాగా వాట్సాప్ ఆ ఫీచర్‌ను బిల్డ్ చేసినట్లు వెల్లడించింది.ఇకపై యూజర్లు చాటింగ్‌కు అనుగుణంగా ఎమోజీలను సెండ్ చేసుకోవచ్చుని, ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన 'Money Heist Season 5' కి చెందిన 17 ఎమోజీలను త్వరలో విడుదల చేస్తున్నట్లు బ్లాగ్ పేర్కొంది. ఈ రెండు ఫీచర్లను ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై వాట్సాప్ క్లారిటీ ఇవ్వలేదు. కమ్యూనిటీ బ్లాగ్‌లో స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో ఫీచర్లు మరో కొద్దిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని యూజర్లు అంచనా వేస్తున్నారు. అకౌంట్లను బ్లాక్ చేస్తున్న వాట్సాప్ గత కొద్ది కాలంగా ఆయా దేశాల ఐటీ రూల్స్‌కు విరుద్దంగా వ్యవహరిస్తున్న యూజర్లపై వాట్సాప్ ఉక్కుపాదం మోపుతోంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనుచిత, హానికరమైన సమాచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే ఈ ఏడాది జూన్ - జూలై నెలల మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు అధికారికంగా చెప్పింది. అందుకే చేజారిపోతున్న యూజర్లను తనవైపుకు తిప్పుకునేందుకు వాట్సాప్ మరిన్ని అప్డేట్లను తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన ప్రతీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేపు సాయంత్రం ఏం జరగబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కన్నడ రాజకీయాలకు జోకులు కూడా పేలుతున్నాయి. వాట్సాప్ మెసేజ్‌లు, మెమెలతో కొందరు సెటైర్లు పేలుస్తున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జడ్జి అలా చక్కర్లు కొడుతున్న ఓ జోకును ప్రస్తావించటం విశేషం. ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం పిటిషన్లపై సీరియస్‌గా వాదనలు కొనసాగుతున్న సమయంలో జడ్జి సిక్రీ జోక్యం చేసుకుంటూ... ఇందాకే వాట్సాప్‌లో మాకు ఓ మెసేజ్ వచ్చింది‘‘ అయ్యా... నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దయచేసి నన్ను సీఎంను చెయ్యండి’’ అంటూ గవర్నర్ కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి కోరతాడు. ఇంతకీ మీరు ఎవరయ్యా అని సిబ్బంది అడిగితే... ఎమ్మెల్యేలు తలదాచుకున్న హోటల్ యాజమానిని అని అవతలి వ్యక్తి సమాధానమిస్తాడు... అంటూ ఆ జోకును న్యాయమూర్తి సిక్రీ చదివి వినిపించారు. దీంతో కోర్టు హాల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. బెంగళూరులోని ఇగల్‌టన్ రిసార్ట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తలదాచుకోవటంపై ఈ జోకు నిన్నంతా వైరల్ అయ్యింది. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని హోటల్లలో బస చేసిన విషయం తెలిసిందే. కాగా, గవర్నర్ వాజుభాయ్ వాలా విధించిన 15 రోజుల గడువును తోసిపుచ్చిన కోర్టు శనివారం సాయంత్రం 4గంటలకు బలనిరూపణకు సిద్ధం కావాలని కర్ణాటక సీఎం యెడ్యూరప్పను ఆదేశించింది. -
భజ్జీ జోక్ : ట్విట్టరియన్లు ఫుల్ ఫన్నీ
స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్లో షేర్ చేసిన పాపులర్ వాట్సాప్ మెసేజ్‌పై ట్విట్టరియన్లు తెగ జోకులు పేల్చుతున్నారు. రెస్టారెంట్లో డిన్నర్ చేసిన అనంతరం బిల్లు పేమెంట్ చేసేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి మనతో డిన్నర్ చేసిన ఫీల్ వస్తుందని భజ్జీ ట్వీట్ చేశారు. జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానాన్ని ఆధారంగా తీసుకుని ఆయన ఈ పాపులర్ వాట్సాప్ జోకును తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం రెస్టారెంట్ల బిల్లులో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీలు వేరువేరుగా వస్తున్నాయి. దీనిపై కామెడీ చేస్తూ భజ్జీ ఈ ట్వీట్ చేశారు. భజ్జీ చేసిన ఈ ట్వీట్‌పై విపరీతైన స్పందనలు వస్తూ ఉన్నాయి. భజ్జీ ఫీలింగ్ సరియైనదని, తనకు కూడా అలానే అనిపిస్తుందని, ఎందుకు రెండు జీఎస్టీలు ఉన్నాయో తనకు అర్థం కావడం లేదని, మనకు అరుణ్ జైట్లీ జీ కూడా వివరించలేరని ఓ ట్విట్టరియన్ పేర్కొన్నాడు. అంతకముందు కూడా వీరిద్దరూ మనతో డిన్నర్ చేసేవాళ్లని, కానీ ప్రస్తుతం రెండు వేరువేరు ఆహ్వాన పత్రికలపై మన దగ్గరకి వస్తున్నారంటూ మరో ట్విట్టరియన్ అన్నాడు. ఇలా హర్భజన్ ట్వీట్‌పై ట్విట్టరియన్లు ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా సిరీస్ మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి భజ్జీ ట్వీట్లతో వార్తలోకి ఎక్కుతునే ఉన్నారు. ఏదో ఒక ట్వీట్‌తో ట్విట్టరియన్లను అలరిస్తున్నారు. -
అత్తాకోడళ్లపై వాట్సాప్ లో జోకులు
ముంబై: నరేంద్ర మోదీ సర్కారు పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలకు నోట్ల రద్దు సెగ తాకిందని సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా నోట్ల కష్టాలు పడుతోందని వాట్సాప్ లో జోకులు షేర్ చేస్తున్నారు. ఒకే చీరను అమితాబ్ భార్య జయబచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ రాయ్ బచ్చన్ వివిధ సందర్భాల్లో కట్టుకున్న ఫొటోలు అత్తాకోడళ్లకు నోట్ల కష్టాలు అంటూ కామెంట్లు పెట్టారు. ఒకే డిజైన్ తో ఉన్న ఎరుపు రంగు చీరను అత్తాకోడళ్లను పలు సందర్భాల్లో ధరించారు. గత సెప్టెంబర్ లోనే ఈ ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేశాయి. నోట్ల కష్టాల నేపథ్యంలో నెటిజన్లు మరోసారి వీటిని వెలుగులోకి తెచ్చి తమ హాస్యచతురత ప్రదర్శించారు. అయితే ఈ ప్రచారంపై బచ్చన్ కుటుంబం స్పందించలేదు.